ఐపీఎల్: జట్ల వారీగా ఛీర్ గర్ల్స్ జీతాలు, ఫొటోకు ఫోజివ్వాలన్నా డబ్బులే

Posted By:
IPL: Salaries of Cheerleaders of every team

హైదరాబాద్: యువ క్రికెటర్లకు భారత క్రికెట్‌లోకి వెళ్లేందుకు ఐపీఎల్ మంచి వేదికైంది. యువతను బాగా ప్రోత్సహిస్తోన్న ఐపీఎల్ కొత్త టాలెంట్‌కు మంచి అవకాశాలని అందిస్తోంది. యువ క్రికెటర్లను రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసేస్తున్న ఐపీఎల్ పుణ్యమా అని చాలా మంది సంపాదించుకుంటున్నారు. వారిలో స్టేడియంలో ప్రేక్షకులను ఎప్పుడూ ఉత్సాహంతో పలకరించే చీర్ గర్ల్స్ ప్రధానంగా ఉన్నారు.

మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎలాంటి ప్రత్యేక సందర్భంలోనైనా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించడం వీరి వంతు. ఇంత అందంగా, అంతే ఉత్సాహంగా అలరించే వీరి పారితోషకం సంగతికి వస్తే.. ఒక్కో పనికి ఒక్కో రకంగా తీసుకుంటారట. మ్యాచ్ గెలిస్తే, ఫొటోకు ఫోజిస్తే, మ్యాచ్‌కు సంబంధం లేకుండా ప్రత్యేక కార్యక్రమం ఏదైనా చేస్తే వాటికి విడివిడిగా తీసుకుంటారట.

ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు:

ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు:

జీఎమ్మార్ గ్రూపుకు చెందిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఈ ఏడాది కొత్త కెప్టెన్‌తో రంగం సిద్ధం చేసుకుంది. ఈ జట్టు చీర్ గర్ల్స్ ఆటగాళ్లను ఎప్పుడూ ఉత్సాహపరిచేందుకు మైదానంలో చలాకీగానే కనిపిస్తుంటారు. ఎక్కువగా తెల్లని, నల్లని దుస్తుల్లో మెరిసిపోతుంటారు. వీరి వేతనం ఒక్కో మ్యాచ్‌కు రూ. 9700వరకూ ఉంటుంది. వీరి వార్షిక ఆదాయానికి వచ్చే సరికి రూ. 2.5లక్షలుగా ఉంటుంది.

చెన్నై సూపర్ కింగ్స్:

చెన్నై సూపర్ కింగ్స్:

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనే సక్సెస్ ఫుల్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న చెన్నై జట్టు రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసింది. మొత్తం జట్టులో 30కి పైబడ్డ వయస్సున్న ఆటగాళ్లనే తీసుకుని కొత్త ప్రణాళికలతో ఆ జట్టు పదకొండో సీజన్‌కు సిద్దమవుతోంది. ఈ జట్టు చీర్ గర్ల్స్ వేతనం ఒక్కో మ్యాచ్‌కు రూ. 10000. వీరి వార్షిక ఆదాయం 2.5 నుంచి 2.6 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్:

సన్‌రైజర్స్ హైదరాబాద్:

2016వ సంవత్సరంలో ఒకే ఒక్క సారి టోర్నమెంట్‌ను గెలుచుకున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. వీళ్లు మాత్రం చీర్ గర్ల్స్ కదలికలపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. తద్వారా ఆటగాళ్లకు ఉత్సాహం పెరుగుతుందని వాళ్ల అంచనా. కలర్‌ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోయే ఈ జట్టు చీర్ గర్ల్స్ కురచ దుస్తుల్లో అన్ని జట్ల చీర్ గర్ల్స్ కంటే చలాకీగా కనిపిస్తారు. ఈ జట్టును సొంతం చేసుకున్న యజమాని సన్ గ్రూపు అధినేత కళానిధి మారన్.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

ఎరుపు రంగులో మెరిసిపోయే పంజాబ్ జట్టు తమ జట్టుకు సంబంధించిన చీర్ గర్ల్స్‌ ఒక్కో మ్యాచ్‌కు రూ.9500 జీతంగా తీసుకుంటారు. అన్ని జట్లలాగే బోనస్ సొమ్ము అదనం.

రాజస్థాన్ రాయల్స్:

రాజస్థాన్ రాయల్స్:

చెన్నై జట్టుతో పాటుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సైతం రెండేళ్ల నిషేదం అనంతరం ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతోంది. అయితే ఈ జట్టు చీర్ గర్ల్స్‌కు మాత్రం ఎక్కువ మొత్తంలో అంటే రూ.11500 నుంచి రూ. 12000వరకు ఇస్తోంది. వీరి వార్షిక ఆదాయం రూ. 3.22లక్షలు.

ముంబై ఇండియన్స్:

ముంబై ఇండియన్స్:

లీగ్ మొత్తంలో ఉన్న జట్లలో ముంబై ఇండియన్స్ జట్టు చాలా పాపులర్ అయిన జట్టు. ఈ జట్టు వారి చీర్ గర్ల్స్‌కు రూ.16000 జీతంగా రూ.6500 అదనపు బోనస్‌గా ఇస్తుంది. వారి వార్షిక వేతనం దాదాపు రూ.8లక్షల వరకు ఉండొచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు:

బెంగుళూరు జట్టు చీర్ గర్ల్స్ మిగిలిన జట్ల కంటే కిర్రెక్కించే భామలు. అందమైన నడుమొంపులతో జట్టును హుర్రెత్తిస్తుంటారు. వీరి జీతం రూ.6500 కాగా అదనంగా వచ్చే బోనస్ రూ. 3.250. వీరి వార్షిక వేతనం రూ. 5.25లక్షలు.

కోల్‌కత్తా నైట్ రైడర్స్:

కోల్‌కత్తా నైట్ రైడర్స్:

ఈ జట్టు చీర్ గర్ల్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వారందరినీ ఎంపిక చేసేది. కింగ్ ఖాన్ షారూఖ్ కాబట్టి. ఇంకా అన్ని జట్ల కంటే వీరి వేతనమే టాప్. వీళ్ల జీతం రూ.20000 కాగా అదనంగా వచ్చే బోనస్ కూడా అదే స్థాయిలో ఉంటుంది రూ.6500. ఇక వీరి వార్షిక వేతనం రూ. 11లక్షలు పైమాటే.

Story first published: Thursday, March 8, 2018, 14:15 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి