న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వామ్మో.. ఆర్‌సీబీ, భారీ ప్రణాళికలతోనే అది సాధ్యమైంది

IPL RCB vs KKR: Chris Lynn reveals how he planned KKR’s chase against RCB

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా జట్టు చివరి వరకూ పోరాడి ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన కోల్‌కతా జట్టుకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకు దిగిన దినేశ్ కార్తీక్ జట్టుకు ఆరంభంలోనే వరుణుడు ఆటంకం కలిగించినా పట్టుదలతో మ్యాచ్‌ను గెలిపించారు. మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రిస్ లిన్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. తన సహచరుడైన ఊతప్ప ఇంటర్వ్యూ చేస్తుండగా ఇలా స్పందించాడు.

అన్నింటిలా ఒకే శైలిలో సాగలేదు:

అన్నింటిలా ఒకే శైలిలో సాగలేదు:

'ఈ ఇన్నింగ్స్ అన్నింటిలా ఒకే శైలిలో సాగలేదు. చాలా కష్టంతో కూడుకున్న పని అన్నట్లు అనిపించింది. ఎట్టకేలకు మ్యాచ్ ను నాటౌట్‌గానే ముగించడంతో ఓ రకమైన నమ్మకం ఏర్పడింది. ఇదే సమయంలో లిన్ బాదిన షాట్‌లలో చాలా వరకూ స్వీప్ షాట్‌లే ఉన్నాయి. వాటి గురించి ఊతప్ప లిన్‌ను ప్రశంసించాడు. అంతేకాదు, దాంతో పాటుగా మనమంతా క్రిస్ లిన్ కు థ్యాంక్స్ చెప్పాలి. తన స్వీప్ షాట్ లతో గ్రౌండ్ అంతటినీ శుభ్రం చేశాడంటూ అతనిపై ఓ జోక్ వేశాడు. క్రిస్ లిన్ మాట్లాడుతూ.. రాత్రి జరిగిన మ్యాచ్ లో ఛేదనకు చాలా కష్టపడాల్సి వచ్చింది. బెంగళూరు జట్టులో మంచి కీలకమైన స్నిన్నర్లు ఉన్నారు. వాళ్లని ఎదుర్కోవడం చాలా కష్టమైంది.' అని తెలియజేశాడు.

మొదటి ఇన్నింగ్స్ అనంతరం ఛేదనకు దిగిన కోల్‌కతా మరో

మొదటి ఇన్నింగ్స్ అనంతరం ఛేదనకు దిగిన కోల్‌కతా మరో

ఓపెనర్ సునీల్ నరైన్ గురించి స్పందించిన క్రిస్ లిన్ .. అతను చాలా నేచురల్‌గా ఆడాడు. అంతలోనే వర్షం పడి మ్యాచ్ కు ఆటంకం కలిగించింది. అప్పటికీ ఇద్దరి భాగస్వామ్యంలో 59పరుగుల చక్కని భాగస్వామ్యాన్ని అందించాం. అతను మైదానంలో వచ్చినప్పటి నుంచి ఇలా చేద్దాం. అలా చేద్దాం అంటూ ఏమీ మాట్లాడకుండా పరుగులు తీసే పనిలోనే ఉన్నాడు. ఇలా అతని భాగస్వామ్యంతో ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వచ్చి టెన్షన్ అంతా:

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వచ్చి టెన్షన్ అంతా:

క్రిస్ లిన్.. సునీల్ నరైన్‌తో పాటుగా కెప్టెన్ దినేశ్ కార్తీక్, ఊతప్పలను కూడా పనిలో పనిగా పొగిడేశాడు. సరిగా మ్యాచ్ మధ్యలో ఉండగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వచ్చి టెన్షన్ అంతా పోగొట్టారు. రాబిన్ ఊతప్పతో పాటుగా దినేశ్ కార్తీక్ లు ఒకానొక దశలో క్రీజులోకి రావడంతో కాస్తంత ఊరటగా అనిపించింది. అని లిన్ చెప్పుకొచ్చాడు.

ఐదు బంతులు మిగిలి ఉండగానే:

ఐదు బంతులు మిగిలి ఉండగానే:

ఈ మ్యాచ్‌లో క్రిస్ లిన్ అజేయంగా 52 బంతుల్లో హఫ్ సెంచరీని దాటి 62 పరుగులు చేసి విజయాన్ని అందించారు. 176 పరుగుల లక్ష్యాన్ని ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల నష్టంతో ముగించేసింది కోల్‌కతా జట్టు.

Story first published: Monday, April 30, 2018, 16:49 [IST]
Other articles published on Apr 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X