న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్ రషీద్ ఖాన్‌ని తొక్కేశాడు (వీడియో)

IPL: Rashid Khan Pulls Off One-Handed Stunner To Rival Trent Boults Catch. Watch Video

హైదరాబాద్: ప్లేఆఫ్ ఆశలు నిలుపుకునేందుకు చావో రేవో అనే రీతిలో పోరాడిన బెంగళూరుకు మంచి విజయమే దక్కింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో క్రికెటర్లు ఆద్యంతం అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు బెంగళూరు ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అయినా అద్భుతమైన ఇన్నింగ్స్‌ను కనబరిచింది. డివిలియర్స్ దూకుడుకి చెక్ పెట్టిన ధావన్ క్యాచ్.. ఔరా అనిపిస్తే కాసేపటికి.. గ్రాండ్ హోమ్ వీర బాదుడికి రషీద్ ఖాన్ పట్టిన క్యాచ్‌తో స్టేడియంలో ఉన్నందరికీ షాక్ తగిలినట్లైంది.

చక్కగా అంచనా వేసి బ్యాటింగ్‌కు దిగింది

చక్కగా అంచనా వేసి బ్యాటింగ్‌కు దిగింది

ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే ఇదే ఆఖరి మ్యాచ్...పరిస్థితులను చక్కగా అంచనా వేసి బ్యాటింగ్‌కు దిగింది బెంగళూరు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బెంగళూరుకు డివిలియర్స్ ఇన్నింగ్స్ మంచి ఊపునిచ్చింది. ఈ తరుణంలో మొయిన్ అలీ, డివిలియర్స్ భాగస్వామ్యం చక్కగా రాణించింది. సరిగ్గా డివిలియర్స్ అవుట్ అయ్యాక జట్టు ఆందోళనకు గురవడంతో.. క్రీజులోకి వచ్చిన గ్రాండ్ హోమ్ తనదైన స్థాయిలో స్కోరును పరుగులు పెట్టించాడు.

గ్రాండ్ హోమ్ ముగింపు ఇస్తాడనుకున్న తరుణంలో

అప్పటికే నిలదొక్కుకున్న గ్రాండ్ హోమ్ మంచి ముగింపు ఇస్తాడనుకున్న తరుణంలో 19.2 ఓవర్లకు సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ క్యాచ్ పట్టడంతో గ్రాండ్ హోమ్ పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. చేధనకు దిగిన హైదరాబాద్ ధాటిగా ఆడుతూ టార్గెట్‌ను చేరుకుంటుంది అనుకుంటున్న సమయంలో మొయిన్ అలీ బౌలింగ్‌లో అలెక్స్ హేల్స్ క్యాచ్‌ను డివిలియర్స్ అందుకుని మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

రషీద్ ఖాన్ పట్టిన క్యాచ్‌ను అంతా మర్చిపోయారు

రషీద్ ఖాన్ పట్టిన క్యాచ్‌ను అంతా మర్చిపోయారు

దీంతో బెంగళూరు ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ పట్టిన క్యాచ్‌ను అంతా మర్చిపోయారు. ఎందుకంటే బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతిని రషీద్ ఖాన్ ఒంటిచేత్తో పట్టుకుంటే.. డివిలియర్స్ దాదాపు సిక్సు అనుకున్న బంతిని ఎగిరి సూపర్ మ్యాన్‌లా అందుకున్నాడు.

విలియమ్‌సన్ వీరోచిత పోరాటానికి సత్ఫలితం

విలియమ్‌సన్ వీరోచిత పోరాటానికి సత్ఫలితం

కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ వీరోచిత పోరాటానికి సత్ఫలితం దక్కలేదు. మూడో వికెట్‌గా బరిలోకి దిగిన కేన్ 42 బంతుల్లో 81పరుగులు చేసి జట్టు భారమంతటిని ఒక్కడే చివరి వరకూ మోసాడు. ఈ నేపథ్యంలో ఇంకా 5బంతులు మిగిలి ఉండగానే గ్రాండ్ హోమ్‌కు ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారు సరిగా రాణించకపోవడంతో బెంగళూరు 14పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కుంచుకుంది.

Story first published: Friday, May 18, 2018, 16:00 [IST]
Other articles published on May 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X