న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్సీబీ అభిమానుల పాలిట విలన్‌గా మారిన దినేష్ కార్తీక్.. ఎంత పెద్ద తప్పు చేశాడంటే?

IPL Qualifier 2: How Dinesh Karthik Changed From Hero To Villian For RCB Fans

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌‌ మ్యాచ్‌లో బట్లర్ (106పరుగులు 60బంతుల్లో 10ఫోర్లు 6సిక్సర్లు) ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. 158పరుగుల లక్ష్యాన్ని బట్లర్ ఉఫ్ మని ఊదేశాడు. ఫలితంగా రాజస్థాన్ 7వికెట్ల తేడాతో గెలిచింది.

ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా బట్లర్ నిలవడంతో పాటు.. రాజస్థాన్‌ను బట్లర్ సగర్వంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఇక ఎలిమినేటర్ గండం గట్టెక్కినా ఆర్సీబీ క్వాలిఫయర్లో మాత్ర అన్నీ కాల్చుకుని మూసుకుని ఇంటిబాట పట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ ఘోర తప్పిదం చేశాడు. తద్వారా బెంగళూరు జట్టుకు ఉన్న ఏకైక హోప్ కూడా సమసిపోయింది.

దినేష్ కార్తీక్ చెత్త కీపింగ్..

10ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు వికెట్ కోల్పోయి 103పరుగుల వద్ద ఉంది. అప్పుడు ఇంకా 55పరుగులు చేయాల్సి ఉంది. ఇక క్రీజులో బట్లర్ (66పరుగులు 33బంతుల్లో) ప్రమాదకరంగా ఉన్నాడు. అయితే 11వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్‌కు దిగాడు. ఆ ఓవర్ తొలి బంతికి హర్షల్ హాఫ్ సైడ్ కాస్త లెంత్ అండ్ వేరియేషన్ బాల్ వేశాడు.

దాన్ని సరిగా జడ్జ్ చేయని బట్లర్ డ్రైవ్ ఆడగా.. అది బ్యాట్ కు ఎడ్జ్ అయి నేరుగా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో బట్లర్ అవుట్ అవ్వాల్సింది. కానీ అతనికి లక్ ఫేవర్‌గా ఉంది. లడ్డూ లాంటి క్యాచ్‌ను దినేష్ కార్తీక్ చెత్త కీపింగ్ ద్వారా మిస్ చేశాడు. స్లైట్ డివియేషన్ కూడా పసిగట్టలేకపోయాడు. దీంతో బట్లర్‌కు లైఫ్ దొరికింది. ఒకవేళ బట్లర్ అవుట్ అయి ఉంటే మ్యాచ్ స్థితి వేరేగా ఉండేదేమో. టీ20లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేం.

లైఫ్ దొరకడంతో రెచ్చిపోయిన బట్లర్

లైఫ్ దొరకడంతో రెచ్చిపోయిన బట్లర్

దినేష్ కార్తీక్.. ప్రమాదకర బట్లర్ క్యాచ్ మిస్ చేయడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఇక లైఫ్ దొరకడంతో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాదాపు విజయం ఖరారైన దశలో సంజూ శాంసన్ (23పరుగులు 21బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు)ను హసరంగా ఔట్ చేసినా అది పెద్ద ప్రభావం చూపకుండా బట్లర్ వీరోచితంగా దాడి చేశాడు. పడిక్కల్‌తో కలిసి బట్లర్ విజయం దిశగా ఇన్నింగ్స్ నడిపించాడు.

16వ ఓవర్లో హసరంగ బౌలింగ్లో రెండు సిక్సర్లు కొట్టిన బట్లర్ ఈ సీజన్లో 800పరుగుల మైలురాయి దాటాడు. 18వ ఓవర్ చివరి బంతికి రన్ తీసి ఈ సీజన్లో నాలుగో సెంచరీ, ఐపీఎల్లో 5వ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్, తర్వాతి ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో సిక్స్ కొట్టి సగర్వంగా రాజస్థాన్‌ను ఫైనల్ చేర్చాడు.

బ్యాటింగ్లో హీరో.. కీపింగ్లో జీరో

బ్యాటింగ్లో హీరో.. కీపింగ్లో జీరో

దినేష్ కార్తీక్ ఈ సీజన్లో ఆర్సీబీ ఫినిషర్‌గా మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినప్పటికీ అతను కీపింగ్లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. ఏకంగా ఈ సీజన్లో 10క్యాచ్ లు మిస్ చేశాడు. అతని తర్వాత స్థానంలో సంజూ శాంసన్ 8క్యాచ్ లు మిస్ చేయగా.. రిషబ్ పంత్ మూడు క్యాచ్ లు మిస్ చేశాడు. ఇక దినేష్ కార్తీక్.. బౌలర్ల స్వింగ్ ను, స్పిన్ ను అర్థం చేసుకోవడంలో తరచూ విఫలమవుతున్నాడు.

ఇకపోతే నిన్నటి మ్యాచ్ లో అతను క్యాచ్ మిస్ చేయడంతో అతనిపై కూడా నెగెటివ్ కామెంట్లు ఊపందుకున్నాయి. హీరో.. ఎలా జీరో అవుతాడో క్లాసిక్ ఉదాహరణగా దినేష్ కార్తీక్ నిలిచాడని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. బట్లర్ వికెట్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఆర్సీబీ అభిమానుల పాలిట విలన్ గా మారాడు.

Story first published: Saturday, May 28, 2022, 9:31 [IST]
Other articles published on May 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X