న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL or PSL?: విదేశీ క్రికెటర్లకు బీసీసీఐ షాకివ్వనుందా?

 IPL or PSL? BCCI considered giving foreign players a choice between two leagues - Report

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు దూరంగా ఉంటున్న భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్‌తో పూర్తిగా క్రికెట్ సంబంధాలను తెగతెంపులు చేసుకోవడానికి సన్నద్ధమవుతోంది.

ఐపీఎల్ 2019 ప్లే ఆఫ్స్‌ మధ్యలో మహిళల ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు: బీసీసీఐ వెల్లడిఐపీఎల్ 2019 ప్లే ఆఫ్స్‌ మధ్యలో మహిళల ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు: బీసీసీఐ వెల్లడి

ఇందులో భాగంగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లకు సైతం బీసీసీఐ అల్టిమేటం జారీ చేసే యోచనలో ఉంది. పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న క్రికెటర్లను ఐపీఎల్‌ నుంచి నిషేధించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో వచ్చిన కథనం మేరకు పీఎస్‌ఎల్‌లో ఆడే విదేశీ క్రికెటర్లను ఐపీఎల్‌ నుంచి తప్పించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఐపీఎల్‌లో ఆడాలనుకునే విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్‌‌లో ఆడకూడదనే ఆదేశాలు జారీ చేయాలని బీసీసీఐ చూస్తోంది. ఈ రెండు లీగ్‌ల్లో విదేశీ క్రికెటర్లు ఏదో ఒక లీగ్‌లోనే ఆడాలని కోరనుంది. దీని కోసం ఏది కావలో ఆయా క్రికెటర్లనే తేల్చుకోవాలని బీసీసీఐ సమాయత్తమవుతోంది. ఈ మేరకు సోమవారం సీఓఏ సభ్యులు వినోద్‌ రాయ్‌, ఎడ్జుల్డీ, లెప్టెనెంట్ జనరల్ రవి రాథోడ్, బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రిల మధ్య జరిగిన సమావేశంలో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ రెండింటిలో ఏదొక లీగ్‌ మాత్రమే ఎంచుకోవాలని బీసీసీఐ ప్రతిపాదన చేస్తే... ఇప‍్పటికే పీఎస్‌ఎల్‌, ఐపీఎల్‌ ఆడుతున్న స్టార్‌ క్రికెటర్లు డ్వేన్‌ బ్రేవో, సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌, ఏబీ డివిలియర్స్‌లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో వీరంతా ఆడుతోన్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, February 26, 2019, 12:58 [IST]
Other articles published on Feb 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X