ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు: పోలీసు వారి సూచన ఇదే

Posted By:
IPL Matches: Tight Security for Uppal Stadium says Rachakonda CP Mahesh Bhagavat

హైదరాబాద్: ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియంలో శనివారం జరగనుంది.

ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, రాజస్థాన్ తొలి మ్యాచ్

ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, రాజస్థాన్ తొలి మ్యాచ్

ఇక, హైదరాబాద్‌లో ఉప్పల్‌ స్టేడియంలో ఏప్రిల్ హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 7 మ్యాచ్‌లు జరుగుతాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

శనివారం నుంచి ఉప్పల్ స్టేడియం పోలీసుల ఆధీనంలోకి

శనివారం నుంచి ఉప్పల్ స్టేడియం పోలీసుల ఆధీనంలోకి

ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో శనివారం నుంచి ఉప్పల్ స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకుంటాన్నామని ఆయన అన్నారు. మొత్తం 2,500 మంది పోలీసులతో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. స్టేడియం ప్రాంగణంలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు ఏర్పాటు చేశామని.. ప్రతి క్షణంను క్షుణ్ణంగా పరీశీలిస్తామని తెలిపారు.

మ్యాచ్ ఉన్న రోజు ట్రాఫిక్‌ ఆంక్షలు

మ్యాచ్ ఉన్న రోజు ట్రాఫిక్‌ ఆంక్షలు

మ్యాచ్ ఉన్న రోజు ట్రాఫిక్‌ ఆంక్షలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. వాహనాల దారి మళ్లింపు ఉన్న నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 9, 12, 22, 26, మే 5, 7, 19 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

మ్యాచ్‌లకు వచ్చేవారు ఫోన్ మినహా ఏం తీసుకురావొద్దు

మ్యాచ్‌లకు వచ్చేవారు ఫోన్ మినహా ఏం తీసుకురావొద్దు

సాయంత్రం 4 గంటలకు జరుగనున్న మ్యాచ్‌కి వచ్చే వారిని మధ్యాహ్నం 1 గంట నుంచి అనుమతి ఉంటుందని, రాత్రి 8 గంటల మ్యాచ్‌లకి సాయంత్రం 5 గంటల నుంచి అనుమతి ఇస్తామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.
మ్యాచ్‌లకు వచ్చేవారు ఫోన్ మినహా, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటర్ బాటిల్స్ కానీ, తిను బండరాలు తీసుకురాద్దని సూచించారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 16:46 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి