న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉప్పల్ స్టేడియంలో SRH Vs KXIP: ఇప్పటివరకు నమోదైన గణాంకాలివే!

IPL Match Stats: Sunrisers Hyderabad vs Kings XI Punjab at the Rajiv Gandhi International Stadium

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు పదకొండు మ్యాచ్‌లాడి చెరో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌ని కలిగి ఉండటంతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా... పంజాబ్ మాత్రం ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

బ్యాటింగ్ ప్రదర్శన

బ్యాటింగ్ ప్రదర్శన

211/4 - ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌పై పంజాబ్ జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరు. ఐపీఎల్ 2014లో పంజాబ్ ఈ స్కోరు నమోదు చేసింది.

119 ఆలౌట్ - ఈ స్టేడియంలో పంజాబ్ నమోదు చేసిన అత్యల్ప స్కోరు. ఐపీఎల్ 2018లో ఈ స్కోరు నమోదైంది.

254 - ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో నమోదైన అత్యధిక స్కోరు. సన్‌రైజర్స్‌ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ పరుగులు చేశాడు.

95 - పంజాబ్ ఆటగాడు మనన్ వోహ్రా చేసిన ఈ పరుగులు ఇరు జట్ల మధ్య ఓ ఆటగాడు నమోదు చేసిన అత్యధిక పరుగులు.

ఈ స్టేడియంలో నమోదైన సెంచరీలు

ఈ స్టేడియంలో నమోదైన సెంచరీలు

8 - ఈ వేదికలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు నమోదు చేసిన సెంచరీలు.

3 - డేవిడ్ వార్నర్ సాధించిన హాఫ్ సెంచరీలు.

76 - ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు నమోదైన సిక్సులు

13 - అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడు కూడా డేవిడ్ వార్నరే.

23 - అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడు కూడా డేవిడ్ వార్నరే.

బౌలింగ్ ప్రదర్శన

బౌలింగ్ ప్రదర్శన

8 - ఈ స్టేడియంలో పంజాబ్‌పై అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.

5/14 - ఈ స్టేడియంలో నమోదైన అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్ 2018 సీజన్‌లో అంకిత్ రాజ్‌పుత్ ఈ రికార్డుని నెలకొల్పాడు.

వికెట్ కీపింగ్ ప్రదర్శన

వికెట్ కీపింగ్ ప్రదర్శన

5 - సన్‌రైజర్స్‌కు చెందిన నోమన్ ఓజా, వృద్ధిమాన్ సాహా ఇద్దరూ ఈ జాబితాలో సమంగా ఉన్నారు.

ఫీల్డింగ్ ప్రదర్శన

ఫీల్డింగ్ ప్రదర్శన

4 - ఇరు జట్ల మధ్య అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు డేవిడ్ మిల్లర్. ఈ స్టేడియంలో ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఇన్ని క్యాచ్‌లు పట్టలేదు.

Story first published: Monday, April 29, 2019, 18:05 [IST]
Other articles published on Apr 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X