న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Loan Window 2021: మీకు ఎక్కువైన విదేశీ ఆటగాళ్లను మాకివ్వండి.. రాజస్థాన్ రాయల్స్ రిక్వెస్ట్!

IPL Loan Window 2021: Rajastan Royals request player loans as window gets activated
IPL 2021:R Ashwin, Kane, Andrew And Other Cricketers Leave Amid Covid19 | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఏది కలిసి రావడం లేదు. కొత్త కెప్టెన్, డైరెక్టర్‌‌ను నియమించుకున్నా ఆ జట్టు రాత మారలేదు. మైదానంలో వరుస పరాజయాలకు తోడు గాయాలు, కరోనా భయంతో ఒక్కొక్కరుగా జట్టును వీడటం ఆ ఫ్రాంచైజీని కలవరపెడుతోంది. సీజన్‌కు ముందే గాయంతో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరం కాగా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే చేతి వేలిగాయానికి గురైన బెన్ స్టోక్స్ సర్జరీ చేయాల్సి రావడంతో ఇంగ్లండ్ పయనమయ్యాడు. ఆ తర్వాత బయో బబుల్‌లో ఉండలేక లివింగ్ స్టోన్ టీమ్‌కు గుడ్‌బై చెప్పగా.. దేశంలోని కరోనా సంక్షోభాన్ని చూడలేక ఆండ్రూ టై ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా నలుగురు విదేశీ ఆటగాళ్ల సేవలను కోల్పోయింది.

లోన్ విండో ఆప్షన్

లోన్ విండో ఆప్షన్

ఈ క్రమంలోనే ఆ ఫ్రాంచైజీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది., ఐపీఎల్‌ నిబంధనలను అనుసరించి దానికి అనుగుణంగా ప్రయత్నాలను మొదలుపెట్టింది. లోన్ విండో ఆప్షన్ ద్వారా ఇతర ఫ్రాంచైజీల ఆటగాళ్లను తీసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలను కలిసి విదేశీ ఆటగాళ్లను ఇవ్వాలని కోరింది. ఈ మేరకు రాజస్థాన్‌ రాయల్స్ ఫ్రాంచైజీ తమను సంప్రదించినట్లు ఇతర ఫ్రాంచైజీలు మీడియాకు తెలిపాయి. 'రాజస్థాన్‌ మమ్ముల్ని విదేశీ ఆటగాళ్లు ఇవ్వాలని కోరింది. దీనిపై ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌దే తుది నిర్ణయం​'అని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపారు.

 రూల్స్‌ ఏంటంటే..

రూల్స్‌ ఏంటంటే..

ఐపీఎల్‌ రూల్స్ ప్రకారం ఏజట్టులోనైనా విదేశీ ఆటగాళ్లు అర్దాంతరంగా తప్పుకొని వారి సంఖ్య 60 శాతం కంటే తక్కువ ఉంటే లోన్‌ విండో ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే రుణ ప్రాతికదికన వేరే ఫ్రాంచైజీల్లో అధికంగా ఉన్న విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. దీనికి ఆ సదరు ఫ్రాంచైజీలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత సీజన్‌లో రెండు మ్యాచ్‌ల కంటే ఎవరైతే తక్కువగా ఒక ఫ్రాంచైజీ తరఫున ఆడి ఉంటారో వారిని లోన్‌ విండో రూపంలో తీసుకోవచ్చు. అలా తీసుకున్న ఆటగాడు ఆ సీజన్‌ అంతా అదే ఫ్రాంచైజీకి ఆడాల్సి ఉంటుంది. అలాగే హోమ్‌ ఫ్రాంచైజీతో మ్యాచ్‌ ఆడకూడదు.

కరోనాతో ఇంటి బాట..

కరోనాతో ఇంటి బాట..

ఐపీఎల్‌ ఆడటానికి భారత్‌కు వచ్చిన విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరూ బయోబబుల్‌ ఉండలేక స్వదేశం బాట పడుతున్నారు. ఒకవైపు బారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో ఉండటంతో పాటు బయోబబుల్‌ అనేది కొంతమందికి కష్టంగా ఉంది. దాంతో ఇప్పటికే చాలామంది తమ దేశాలకు వెళ్లిపోగా, మరికొంతమంది వెళ్లిపోవడానికి సిద్దమైపోయారు. వీరిలో లివింగ్‌ స్టోన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడం జంపా, ఆండ్రూ టైలు ఉన్నారు. ఇందులో రిచర్డ్‌సన్‌, ఆడం జంపాలు ఆర్సీబీ ఆడుతుండగా, ఆండ్రూ టై, లివింగ్‌ స్టోన్‌లు రాజస్థాన్‌ రాయల్స్‌కు చెందిన ఆటగాళ్లు. దాంతో రాజస్థాన్‌ రాయల్స్‌ విదేశీ ఆటగాళ్ల సంఖ్య తగ్గింది.

Story first published: Monday, April 26, 2021, 18:20 [IST]
Other articles published on Apr 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X