న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో తొలి గెలుపుని రుచి చూసిన రాజస్థాన్ రాయల్స్

IPL 2019 : Royal Challengers Bangalore Lost Their Fourth Successive Match In IPL 2019 || Oneindia
Steve Smith

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి గెలుపుని రుచి చూసింది. జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో బోణీ చేసింది. మూడు మ్యాచ్‌లు వరుసగా ఓటమి పాలైన తర్వాత నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆర్సీబీ నిర్దేశించిన 159 పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ (59) హాఫ్ సెంచరీతో రాణించగా స్టీవ్ స్మిత్ (38), రాహుల్ త్రిపాఠి(34) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఓపెనర్లుగా విరాట్‌ కోహ్లీ, పార్థివ్‌ పటేల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 49 పరుగుల వద్ద కోహ్లీ(23) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కోహ్లీ దూకుడుగా ఆడే సమయంలో శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌ బౌల్డయ్యాడు.

1
45770

ఆ తర్వాత మరో 22 పరుగుల వ్యవధిలో ఏబీ డివిలియర్స్‌(13) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత హెట్‌మెయిర్(1) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. దాంతో 73 పరుగులకే ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ జట్టులో ఎంతో కీలకమైన ఈ మూడు వికెట్లను శ్రేయాస్‌ గోపాలే తీయడం విశేషం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోయినిస్‌తో కలిసి పార్థివ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కి 53 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 126 పరుగుల వద్ద పార్థివ్‌ నాలుగో వికెట్‌గా ఔటయ్యాడు. చివర్లో స్టోయినిస్(31 నాటౌట్)‌, మొయిన్‌ అలీ(18 నాటౌట్‌) దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.

Story first published: Tuesday, April 2, 2019, 23:51 [IST]
Other articles published on Apr 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X