న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: బెంగళూరుపై హర్భజన్ సింగ్ అరుదైన రికార్డ్

IPL 2019:Chennai Super Kings VS Royal Challengers Bangalore : Harbhajan Singh's Rare Feat In IPL2019
IPL: Harbhajan Singh claims unique IPL record in season opener against RCB

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్ చప్పగా సాగింది. ఇరు జట్లలో బౌలర్లు రెచ్చిపోయారు. బ్యాట్సుమెన్ ఆకట్టుకోలేకపోయారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన ఖాతాలో మొదటి విజయం వేసుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరును చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. మొదట్లోనే హర్భజన్ సింగ్ చేతికి బంతి దొరికింది. తనకు ఇంకా వికెట్లు తీసే సత్తా ఉందని ఈ మ్యాచ్‌లో నిరూపించాడు.

నాలుగో ఓవర్‌లోనే కెప్టెన్‌ కోహ్లీ(6) వికెట్‌ తీసిన భజ్జీ తర్వాత మొయిన్‌ అలీ(9), డివిలియర్స్‌(9)ను తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చేసిన స్కోర్ 70. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఇది ఆరో అత్యల్ప స్కోర్. చెన్నైపై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోర్. బెంగళూరుపై ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో నెహ్రాతో సమానంగా భజ్జీ నిలిచాడు. నెహ్రూ 13 మ్యాచుల్లో 23 వికెట్లు తీయగా, భజ్జీ 23 మ్యాచుల్లో 23 వికెట్లు తీశాడు.

1
45757

ఈ మ్యాచ్‌ ద్వారా హర్భజన్ సింగ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. మొయిన్‌ అలీ క్యాచ్‌ పట్టడం ద్వారా కాట్ అండ్‌ బౌల్డ్ వికెట్లు తీయడంలో అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుముందు చెన్నై బౌలర్‌ బ్రావో పేరిట ఉన్న 10 వికెట్ల రికార్డును హర్భజన్ అధిగమించాడు.

Story first published: Sunday, March 24, 2019, 14:12 [IST]
Other articles published on Mar 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X