న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Final 2022: తొలి ఎడిషన్ తర్వాత రాజస్థాన్ మళ్లీ ఇప్పుడే.. ఈ‌సారి ట్రోఫీ గెలవడానికి పుష్కలంగా అవకాశాలు!

IPL Final 2022: Rajasthan Royals reached IPL final for the second time after 2008 season

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2022 క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయం ద్వారా మే 29న గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. 2008లో ప్రారంభ ఎడిషన్లో ఫైనల్లో గెలిచిన రాజస్థాన్ ఆ తర్వాత మళ్లీ ఫైనల్ చేరుకోలేదు. ఇక తాజా సీజన్లో మరోసారి ఫైనల్ చేరుకుంది.

ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్‌కు ఎందుకు స్పెషల్ అంటే?

ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్‌కు ఎందుకు స్పెషల్ అంటే?

ఇకపోతే ఈ సీజన్ రాజస్థాన్ కు చాలా స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ రాయల్, ఆ జట్టుకు తొలి ఎడిషన్లోనే కప్ అందించిన ఆసీస్ కెప్టెన్ షేన్ వార్న్.. ఐపీఎల్ కు ముందు దివంగతులైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆసాంతం వార్న్ ను తలుచుకుని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో ఆడుతుంది. ఎలాగైనా వార్న్ కు నివాళిగా కప్ కొట్టి ఇవ్వాలని రాజస్థాన్ తలుస్తోంది.

ఈ క్రమంలో కెప్టెన్ సంజూ శాంసన్ నాయకత్వంలో జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హిట్మయర్, మెక్కాయ్, బౌల్ట్ లాంటి మ్యాచ్ విన్నర్లను కలిగి ఉన్న రాజస్థాన్ ట్రోఫీ గెలవడానికి ఇంతకంటే సరైన టైం, జట్టు దొరకదు.

ఆర్సీబీని పట్టుదలగా కట్టడి చేసి

ఆర్సీబీని పట్టుదలగా కట్టడి చేసి

ఇక నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. ఆర్సీబీని పట్టుదలగా కట్టడి చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (7) యథావిధిగా కీలక మ్యాచ్ లో చేతులెత్తేయగా.. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (25) టెస్ట్ ఇన్నింగ్స్, గ్లెన్ మాక్స్‌వెల్ (24) అరకొర బ్యాటింగ్ ఆర్సీబీ కొంపముంచింది. కేవలం రజత్ పాటిదార్ (58పరుగులు 42బంతుల్లో) పోరాడడంతో 157పరుగుల స్కోరు చేయగలిగింది.

ఇక రాజస్థాన బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ (3/22), ఒబెడ్ మెక్‌కాయ్ (3/23) ఆర్సీబీ పతనాన్ని శాసించారు. రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీశారు. ఇక ఛేదనలో బట్లర్ (106పరుగులు 60బంతుల్లో 10ఫోర్లు 6సిక్సర్లు) చెలరేగగా.. యశస్వి జైశ్వాల్‌ (21పరుగులు 13బంతుల్లో), సంజూ శాంసన్ (23పరుగులు 21బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) రాణించడతో సునాయసంగా ఆర్ఆర్ గెలిచింది.

ఇక ఈ మ్యాచ్‌లో ఒక్క అవార్డు తప్పా అన్ని అవార్డులు జోస్ బట్లర్‌కే..!

ఇక ఈ మ్యాచ్‌లో ఒక్క అవార్డు తప్పా అన్ని అవార్డులు జోస్ బట్లర్‌కే..!

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ - జోస్ బట్లర్

గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ - జోస్ బట్లర్

అత్యధిక సిక్సర్లు - జోస్ బట్లర్

పవర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ - జోస్ బట్లర్

మ్యాచ్‌లో అత్యంత విలువైన ఆస్తి - జోస్ బట్లర్

మ్యాచ్‌లో వేగవంతమైన డెలివరీ - ప్రసిద్ధ్ కృష్ణ

అత్యధిక ఫోర్లు - జోస్ బట్లర్

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - జోస్ బట్లర్

Story first published: Saturday, May 28, 2022, 10:20 [IST]
Other articles published on May 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X