న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెంగుళూరు జట్టు చేసినట్లే రాజస్థాన్ కూడా ఆ ఒక్క రోజు...?

IPL Diary: Royals to wear new jersey on May 11

హైదరాబాద్: ఐపీఎల్‌లో ఏ జట్టు ప్రాధాన్యత దానికి ఉన్నట్టు గానే వాటి జెర్సీలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటిది ఒక్కో సందర్భాన్ని బట్టి ఆయా ఫ్రాంచైజీలు తమ జెర్సీ రంగులని మార్చేస్తుంటాయి. ఇటీవల జరిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ జట్టు పచ్చ రంగు దుస్తుల్లో కనిపించింది. బెంగుళూరు కోవలోకే రాజస్థాన్ కూడా రానుంది.

2011 నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ ఫ్రాంఛైజీ ప్రతి ఐపీఎల్ సీజన్‌లోనూ 'గో గ్రీన్‌' అంటూ ఏదో ఒక మ్యాచ్‌లో ఆకుపచ్చ రంగు జెర్సీతో కనిపిస్తోంది. ఇలానే రాజస్థాన్ జట్టు కూడా కాన్సర్‌పై అవగాహర పెంచేందుకు జెర్సీ రంగును ఆ ఒక్క రోజు మార్చనుంది. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి అవగాహన కల్పించడం కోసం బెంగుళూరు పచ్చ రంగు ఎంచుకొంది. ఇదే నేపథ్యంలో కాన్సర్‌పై అవగాహన నేపథ్యం కాబట్టి పింక్ కలర్‌ను ఎంచుకునే యోచనలో ఉంది రాజస్థాన్ జట్టు.

టోర్నీలో భాగంగా మే 11న రాజస్థాన్‌ రాయల్స్‌ - చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య జైపూర్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనే రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు మరో కొత్త జెర్సీ ధరించనున్నారు. ఈ విషయాన్ని ఆ జట్టు ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌ రంజిత్‌ తెలిపారు. ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించే క్రమంలో రాజస్థాన్‌ ప్రభుత్వంతో కలిసి వీరు పని చేస్తున్నారు. 'క్యాన్సర్‌ ఔట్‌' నినాదంతో ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి తగు చికిత్స తీసుకోవాలి అనే అంశంపై వీరు అవగాహన కల్పించనున్నారు.

బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్‌... చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా తలపడనుంది.

Story first published: Thursday, April 19, 2018, 15:01 [IST]
Other articles published on Apr 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X