న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ హోప్స్

IPL: Delhi Daredevils rope in James Hopes as bowling coach

హైదరాబాద్: ఐపీఎల్ వేలం ముగిసిన మరుసటి రోజు నుంచి ఫ్రాంచైజీలు జట్టు కూర్పుపై కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ విషయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పేరు మార్చుకునే దిశగా యోచిస్తే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు బౌలింగ్ కోచ్‌ను ఎంచుకుంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన జేమ్స్ హోప్స్‌ను ఢిల్లీ జట్టు బౌలింగ్ కోచ్ గా తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సీఈఓ హేమంత్ దువా స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ వేలంలో ఆటగాళ్ల కొనుగోలు పూర్తయ్యాక మిగిలిన సిబ్బందిపై దృష్టి పెట్టాం. జేమ్స్ హోప్స్ లాంటి కోచ్ రావడంతో ఆటగాళ్లలో నూతన ఉత్తేజం వస్తోందని ఆశపడుతన్నామన్నారు. మిగిలిన కోచింగ్ సిబ్బందిని యథాతథంగానే కొనసాగిస్తున్నామన్నారు.

ప్రవీణ్ ఆమ్రే, శ్రీధరన్ శ్రీరామ్‌లు అసిస్టెంట్ కోచ్‌లు గానే వ్యవహరించనున్నారు. జట్టుకు సునీల్ వాల్సన్ మేనేజర్‌గా, పాల్ క్లోస్ ఫిజియోథెరపిస్ట్‌గా, ఫిట్‌నెస్ కోచ్‌గా రజినీకాంత్ శివజ్ఞానం లు అదే స్థానంలో కొనసాగనున్నారు.

జనవరి 4న రిటెన్షన్ జాబితా విడుదల చేసే క్రమంలోనే ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్‌ను ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించింది. ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ రైల్వే క్రికెటర్ అయిన శుభదీప్ ఘోష్‌ను ఎంచుకుంది.

జేమ్స్ హోప్స్ ఆస్ట్రేలియా తరపున 84 వన్డేలు, 12 టీ 20ల్లో ఆడాడు. ఇప్పటికే ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో కలిపి ఐపీఎల్ జట్లలో మూడు సార్లు ఆడాడు. ఇతను 2011 సంవత్సరంలో డేర్ డెవిల్స్ జట్టు క్రీడాకారుడిగా ఉన్నాడు. హోప్స్ 2016లోనే క్రికెట్ అన్ని ఫార్మాట్‌లకు స్వస్తి చెప్పాడు.


ఢిల్లీ డేర్‌డెవిల్స్:

1. రిషబ్ పంత్ (రూ.8 కోట్లు-Retained)
2. క్రిస్ మోరిస్ (రూ.7.1 కోట్లు-Retained)
3. శ్రేయాస్ అయ్యర్ (రూ.7 కోట్లు-Retained)
4. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.9 కోట్లు)
5. గౌతమ్ గంభీర్ (రూ.2.8 కోట్లు)
6. జేసన్ రాయ్ (రూ.1.5 కోట్లు)
7. కొలిన్ మన్రో (రూ.1.9 కోట్లు)
8. మహ్మద్ షమి (రూ.3 కోట్లు)
9. కాగిసో రబాడా (రూ.4.2 కోట్లు)
10. అమిత్ మిశ్రా (రూ.4 కోట్లు)
11. పృథ్వి షా (రూ.1.2 కోట్లు)
12. రాహుల్ తివాతియా (రూ.3 కోట్లు)
13. విజయ్ శంకర్ (రూ.3.2 కోట్లు)
14. హర్షల్ పటేల్ (రూ.20 లక్షలు)
15. అవేష్ ఖాన్ (రూ.70 లక్షలు)
16. షాబాజ్ నదీమ్ (రూ.3.2 కోట్లు)
17. డేనియల్ క్రిస్టియన్ (రూ.1.5 కోట్లు)
18. జయంత్ యాదవ్ (రూ.50 లక్షలు)
19. గురుకీరత్ మన్ (రూ.75 లక్షలు)
20. ట్రెంట్ బౌల్ట్ (రూ.2.2 కోట్లు)
21. మన్‌జోత్ కల్రా (రూ.20 లక్షలు)
22. అభిషేక్ శర్మ (రూ.55 లక్షలు)
23. సందీప్ లామిచానె (20 ల‌క్ష‌లు)
24. న‌మ‌న్ ఓజా (1.4 కోట్లు)
25. స‌య‌న్ ఘోష్ (20 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 13:23 [IST]
Other articles published on Jan 30, 2018
Read in English: Hopes is DD bowling coach
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X