న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంచాలతో పాటు అమ్మాయిలను సరఫరా చేస్తేనే... క్రికెట్ జట్టులో చోటు

హైదరాబాద్: 'లంచాలతో పాటు అమ్మాయిలను సరఫరా చేస్తేనే రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో చోటు' ఇది ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మొహమ్మద్ అక్రమ్ సైఫీపై ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఆరోపణ. ఈ వివరాలను హిందీ న్యూస్ ఛానెల్ 'న్యూస్1' ఓ కథనం రూపంలో ప్రసారం చేసింది. జట్టులోకి ఎంపిక చేయాలంటే డబ్బుకు లేదా దానికి బదులు అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ అడిగినట్లు ఉత్తర ప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపించాడు.

నకిలీ ధ్రువపత్రాలతో సహాయపడుతున్నాడని

నకిలీ ధ్రువపత్రాలతో సహాయపడుతున్నాడని

అంతేకాకుండా చాలా మంది ఆటగాళ్లకు ఆయన నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బీసీసీఐ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు సహాయపడుతున్నాడని శర్మ ఆరోపించాడు. ఈ మేరకు అక్రమ్, శర్మ మధ్య జరిగిన ఫోన్ సంప్రదింపుల ఆడియో టేప్‌ను కూడా ఆ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది.

ఫైవ్ స్టార్ హోటల్‌కి అమ్మాయిలను పంపించాలి

ఫైవ్ స్టార్ హోటల్‌కి అమ్మాయిలను పంపించాలి

‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో చాలా మంది పెద్దలున్నారు. వాళ్లందరినీ ఒప్పించాలంటే న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌కి అమ్మాయిలను పంపించాలి' అని శర్మను అక్రమ్ అడిగినట్లు ఆడియో టేప్‌లో సమాచారం. జట్టులో తనకు కచ్చితంగా స్థానం కల్పిస్తానని శర్మకు అక్రమ్ చెప్పడం మరో ఫోన్ సంభాషణలో స్పష్టమైంది.

తమ పేర్లను ఇష్టపడలేదు

తమ పేర్లను ఇష్టపడలేదు

శర్మతో పాటు మరికొంత మంది ఆటగాళ్లు అక్రమ్‌పై ఆరోపణలు చేశారు. అయితే వారు తమ పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమ్‌కు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ అతడే షోని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు

ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు

అక్రమ్‌ను మీడియా సంప్రదించగా.. తనపై వస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ‘నా దగ్గరకు అమ్మాయిని పంపానని ఆ కుర్రాడు చెబుతున్నాడు. అతని ఆరోపణలు నిజమైతే, ఇప్పటితే అతను క్రికెట్ ఆడుతూ ఉండాలి. కానీ, లేదు. ఒకవేళ అతను ఉత్తరప్రదేశ్‌కు ఆడి ఉంటే అతడి ఆరోపణలు నిజమై ఉండేవి. ఉత్తరప్రదేశ్ 60 మంది క్రీడాకారుల జాబితాలో అతని పేరు ఎప్పుడూ కనబడనేలేదు. అసలు అతను జూనియర్ క్రికెటర్ కూడా కాదు' అని అక్రమ్ వివరణ ఇచ్చారు.

ఇలాంటి ఆరోపణలు రావడం సహజమే

ఇలాంటి ఆరోపణలు రావడం సహజమే

త్వరలోనే నిజం బయటపడుతుందని, ఓ పెద్ద మనిషి (రాజీవ్ శుక్లా) వెనుక ఉన్న తనపై అన్ని వైపుల నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం సహజమేనని అక్రమ్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఘటనపై ఆర్పీ సింగ్, మహమ్మద్ కైఫ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Story first published: Thursday, July 19, 2018, 16:43 [IST]
Other articles published on Jul 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X