న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ అంటే పిచ్చి: కాసుల వర్షం కురిపించే టోర్నమెంట్ ఐపీఎల్

IPL Auctions 2019 Salary Purse Amount Available: Know How Much Money Can Each Team Spend in the Indian Premier League 12 Auction

హైదరాబాద్: ఐపీఎల్ 2019 వేలానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఐపీఎల్ 2019 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం మొదలుకానుంది. ప్రపంచవ్యాప్తంగా 1,003 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొనడానికి ధరఖాస్తు చేసుకోగా ప్రాంచైజీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 350 మందితో కూడిన తుది జాబితాను ప్రకటించింది.

సిరిస్ 1-1తో సమం: పెర్త్ టెస్టులో భారత్ ఓటమికి గల కారణాలివేసిరిస్ 1-1తో సమం: పెర్త్ టెస్టులో భారత్ ఓటమికి గల కారణాలివే

118 మంది జాతీయ జట్లకు ఆడిన క్రికెట‌ర్లు, 228 మంది దేశవాళీ ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు. ఇందులో ఎనిమిది ప్రాంఛైజీలు కలిపి 70 మంది క్రికెటర్లను వేలంలో ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ వేలంలో 70 మంది ఆటగాళ్లకు అవకాశం ఉంది. అందులో 20 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. అత్యధిక కనీస ధర రూ.2 కోట్ల జాబితాలో భారత ఆటగాడు ఒక్కరు కూడా లేరు.

ఐపీఎల్ వేలం సందర్భంగా పలు అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను ఎలా నిర్వహిస్తారు? ఆటగాళ్లను కోట్లకు కోట్లు పెట్టి ఎందుకు కొంటారు? అలా కొన్న ఫ్రాంచైజీలు లాభాలు గడిస్తాయా? లేక నష్టాలను ముూట గట్టుకుంటాయా? లాంటి విషయాలు ఇప్పుడు ఇవే చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఐపీఎల్ అనేది అతిపెద్ద వ్యాపారమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటివరకు 11 సీజన్లు పూర్తయ్యాయి. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ వెనుక కార్పోరేట్ కంపెనీల హస్తం ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజీని ఆయా కంపెనీలు కోట్లలో క్యాష్ చేసుకుంటున్నాయి. వ్యాపారం, వినోదం, క్రీడల్ని ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో లలిత్ మోడీ 2008లో ఐపీఎల్‌ను ప్రారంభించారు.

అప్పట్లో అంతా దీనిని ఒక క్రీడా ప్రయోగంగా అభివర్ణించారు. ప్రీమియర్ లీగ్ పేరుతో వివిధ దేశాలకు చెందిన క్రికెట్ ప్లేయర్లు ఒకే వేదికపై తీసుకురాగలిగారు. అయితే, లీగ్‌లోకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పోరేట్ కంపెనీలు రంగ ప్రవేశంతో ఆటగాళ్లకు పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నాయి. వేలంలో ఫ్రాంచైజీలు ఎక్కువమంది ఆటగాళ్లను కోట్లు పెట్టి సొంతం చేసుకుంటాయి.

ఇప్పటికీ సగటు అభిమానికి అర్ధం కాని విషయం ఏంటంటే! ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోట్లాది రూపాయలతో ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తుంది? క్రికెట్ లీగ్ పేరుతో కోట్ల రూపాయల్ని ఎలా సంపాదింస్తుంది?

ఐపీఎల్ అనేది కాసుల వర్షం కురిపించే ఆట

ఐపీఎల్ అనేది కాసుల వర్షం కురిపించే ఆట

నిజానికి ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ అయినప్పటికీ... లీగ్‌లోకి కార్పోరేట్ కంపెనీలు ఎంటర్ కావడంతో బిజెనెస్ పరంగా కాసుల వర్షం కురిపించే ఆటగా మారింది. పలు వ్యాపార సంస్థలు తమ బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఐపీఎల్ అవకాశం కల్పిస్తుంది. టోర్నీలో ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు ధరించే జెర్సీల మీద పదిగా పైగా బ్రాండ్ పేర్లు కనిపిస్తాయి. కంపెనీలకు మంచి ప్రమోషన్ తో పాటు ఫ్రాంచైజీలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి.

పెద్ద మొత్తంలో డబ్బులు కుమ్మరిస్తోన్న కార్పోరేట్ కంపెనీలు

పెద్ద మొత్తంలో డబ్బులు కుమ్మరిస్తోన్న కార్పోరేట్ కంపెనీలు

క్రికెట్ అంటే భారత్‌లో ఓ మతం లాంటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్రికెట్ అభిమానులు ఉన్న దేశం ఏదైనా ఉంటే అది భారత్ మాత్రమే. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆటకున్న పాపులారిటీ, ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్న క్రేజ్‌ను కార్పొరేట్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. గతంలో కంపెనీలు ఆటగాళ్ల టీషర్టుపై లోగోలకు ఎలాంటి డబ్బులు చెల్లించేవారు కాదు. ఇప్పుడు మాత్రం లోగోలతో పాటు ఆటగాళ్ల జెర్సీలకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి.

ఐపీఎల్‌లో రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్

ఐపీఎల్‌లో రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్

ఐపీఎల్‌లో రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఉంటుంది. బీసీసీఐ ప్రత్యక్ష ప్రసారాలు చేసే ఛానల్స్, ఆన్‌లైన్‌లో లైవ్ మ్యాచ్‌ల ప్రసారం చేసే సంస్థల నుండి పెద్దమొత్తంలో వసూలు చేస్తుంది. ఈ మొత్తాన్ని అన్ని జట్ల ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంచుతుంది. ఫ్రాంచైజీలకు ఉన్న ర్యాంకింగ్ ఆధారంగా బీసీసీఐ పంచడం విశేషం. ఐపీఎల్ సంపాదిస్తున్న మొత్తంలో 60 నుంచి 70 శాతం వంతు మీడియా రైట్స్ ద్వారానే రావడం విశేషం. రానున్న ఐదేళ్లు(2018-2022) కోసం ఐపీఎల్ మీడియా, డిజిటల్ హక్కులను స్టార్ ఇండియా పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకుంది. టెలివిజన్ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ మీడియా(మొబైల్, ఇంటర్నెట్) రైట్స్‌ను స్టార్ ఇండియా సంస్థ రికార్డు స్థాయిలో రూ. 16, 347 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, December 18, 2018, 14:54 [IST]
Other articles published on Dec 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X