న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Auction 2020: సీఎస్కే ‘రసగుల్లా’ ట్వీట్, తమిళంలో ప్రశ్నించిన కేకేఆర్‌

IPL 2020 : CSK’s 'Rosogolla' Tweet, KKR’s Question In Tamil ! || Oneindia Telugu
IPL Auction 2020: To CSKs Time For Rosogolla Tweet, KKRs Question In Tamil

హైదరాబాద్: ఐపీఎల్ 2020 వేలం ముగిసింది. తమకు కావాల్సిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు భారీ ధర వెచ్చించి కొనుగోలు చేశాయి. వేలంలో ఎనిమిది ప్రాంఛైజీలు 62 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోగా... ఇందులో 29 మంది విదేశీ ఆటగాళ్లే ఉండటం విశేషం. వేలంలో ఎనిమిది జట్లు మొత్తం రూ. 140.3 కోట్లు ఖర్చు చేశాయి.

వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ నలుగురు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొమ్మిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం ముంబై ఇండియన్స్ రూ.11.2 కోట్లు ఖర్చు చేయగా... చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.45 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో సీఎస్కే పియూష్ చావ్లా (రూ. 6.75 కోట్లు), సామ్ కుర్రాన్ (రూ. 5.50 కోట్లు) అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసింది.

ట్విట్టర్‌లో ఫోటోలు: మూడో వన్డేకి ముందు చిల్ మూడ్‌లో కోహ్లీట్విట్టర్‌లో ఫోటోలు: మూడో వన్డేకి ముందు చిల్ మూడ్‌లో కోహ్లీ

ప్యాట్ కమిన్స్ కోసం అత్యధికంగా రూ.15.50 కోట్లు

ఇక, కోల్‌కతా కమిన్స్‌ విషయానికి వస్తే ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ కోసం అత్యధికంగా రూ.15.50 కోట్లు, ఇయాన్‌ మోర్గాన్‌కు రూ.5.25 కోట్లు, వరుణ్‌ చక్రవర్తి కోసం రూ.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే, వేలం జరుగుతున్న సమంయంలో చెన్నై-కోల్‌కతా ఫ్రాంచైజీల మధ్య జరిగిన ‘రసగుల్లా' సంభాషణ ఆసక్తికరంగా ఉంది.

రసగుల్లా తిన్న సీఎస్కే ఫ్రాంచైజీ సభ్యుడు

రసగుల్లా తిన్న సీఎస్కే ఫ్రాంచైజీ సభ్యుడు

వేలం సందర్భంగా చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంచైజీ సభ్యుడొకరు రసగుల్లా తిన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విటర్లో పంచుకుంది. ‘ఇది రసగుల్లా సమయం' అని పేర్కొంది. దానికి కేకేఆర్‌ ‘నల్ల ఇరుకా? (చాలా బాగుందా?)' అని స్పందించింది.

చాలా చాలా తియ్యగా ఉంది

చాలా చాలా తియ్యగా ఉంది

వెంటనే చెన్నై ‘రొంబ రొంబ ఛ్వీట్‌పొ (చాలా చాలా తియ్యగా ఉంది)' అని పెట్టడంతో కోల్‌కతా ‘ఒడ స్వీటా ఇరుకా?(అంత తియ్యగా ఉందా?)' అని ప్రశ్నించింది. ఈ సంబాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం.

చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు:

బ్యాట్స్ మెన్: ఫా డు ప్లెసిస్, అంబటి రాయుడు, మురళీ విజయ్, రుతురాజ్ గైక్వాడ్, సురేష్ రైనా

బౌలర్లు: హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, కెఎమ్ ఆసిఫ్, లుంగి ఎంగిడి, శార్దుల్ ఠాకూర్, పియూష్ చావ్లా (రూ. 6.75 కోట్లు), జోష్ హజిల్‌వుడ్ (రూ. 2 కోట్లు), ఆర్ సాయి కిషోర్ (రూ. 20 లక్షలు)

ఆల్ రౌండర్లు: షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మోను కుమార్, కర్న్ శర్మ, సామ్ కుర్రాన్ (రూ. 5.5 కోట్లు)

వికెట్ కీపర్లు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), ఎన్ జగదీసన్

వేలం తర్వాత కోల్‌కతా పూర్తి జట్టు

దినేష్ కార్తీక్ (కెప్టెన్), ఇయాన్ మోర్గాన్, పాట్ కమ్మిన్స్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, షుబ్మాన్ గిల్, లాకీ ఫెర్గూసన్, నితీష్ రానా, రింకు సింగ్, ప్రసీద్ కృష్ణ, సందీప్ వారియర్, హ్యారీ గుర్నీ, కమలేష్ శివమోవగ్, ఎం సిద్ధార్థ్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి, టామ్ బాంటన్, నిఖిల్ నాయక్, క్రిస్ గ్రీన్, ప్రవీణ్ తంబే

Story first published: Saturday, December 21, 2019, 8:51 [IST]
Other articles published on Dec 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X