న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2020 ఐపీఎల్ వేలం.. ముగ్గురు స్టార్ విదేశీ ఆటగాళ్లకు చెక్ పెట్టిన ఢిల్లీ!!?

IPL 2020 : 3 Players Delhi Capitals Might Release || Oneindia Telugu
IPL Auction 2020: Three Overseas Players Who Could Be Released By Delhi Capitals

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌కు సంబందించిన వేలం కోల్‌కతాలో డిసెంబర్ 19న జరగనుంది. ఆటగాళ్లను అంటిపెట్టుకోవాలన్నా, వదులుకోవాలన్నా ఈ నెల 14తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు ఆకట్టుకోలేని స్టార్ ఆటగాళ్లను కూడా వదులుకోవడానికి సిద్ధమయ్యాయి. అందరికంటే ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వదులుకుంది. ఇక స్టార్ విదేశీ ఆటగాళ్లను సైతం వదులుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రంగం సిద్ధం చేసుకుంది.

<strong>టెస్టు సిరీస్‌లో లేడు.. అయినా జట్టుతో ప్రాక్టీస్ చేసిన భువనేశ్వర్.. ఎందుకంటే?!!</strong>టెస్టు సిరీస్‌లో లేడు.. అయినా జట్టుతో ప్రాక్టీస్ చేసిన భువనేశ్వర్.. ఎందుకంటే?!!

ఢిల్లీ ప్రణాళికలు:

ఢిల్లీ ప్రణాళికలు:

గత సీజన్-12లో ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢిల్లీ ఓడించింది. కానీ.. రెండో క్వాలిఫైయర్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. చెన్నై చేతిలో ఓడినా.. అంచనాలకు మించి రాణించింది. ఈ అంచనాలను వచ్చే సీజన్‌లో కూడా నిలుపుకోవడానికి తమ జట్టును మరింత పటిష్టంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం సరిగా ఆడని కొంతమంది విదేశీ ఆటగాళ్లను వేలంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని ఓ జాతీయ మీడియా కథనాల ప్రకారం తెలిసింది.

 విదేశీ ఆటగాళ్లకు చెక్:

విదేశీ ఆటగాళ్లకు చెక్:

సమాచార వర్గాల ప్రకారం.. ఢిల్లీ ఆగటగాళ్లు కోలిన్ ఇంగ్రామ్, ట్రెంట్ బౌల్ట్, కోలిన్ మున్రోలు జట్టు నుండి బయటకు వచేయనున్నారట. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ కోలిన్ ఇంగ్రామ్ గత సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 184 పరుగులు మాత్రమే చేసాడు. అతని ఢిల్లీ రూ .6.4 కోట్లు ఖర్చు చేస్తోంది. కోలిన్ మున్రో 4 మ్యాచ్‌లు ఆడి 84 పరుగులు చేసాడు. 2018 వేలంలో మున్రో సేవలకు 1.90 కోట్లు చెల్లించింది. 8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన బౌల్ట్.. 5 మ్యాచ్‌లు ఆడి కేవలం 5 వికెట్లు మాత్రమే తీసాడు. పేలవమైన ప్రదర్శనల కారణంగా ఢీల్లీ వీరితో విడిపోయే అవకాశం ఉంది.

విజయ్‌కి ఉద్వాసన:

విజయ్‌కి ఉద్వాసన:

గత రెండేళ్లుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మురళీ విజయ్‌ వచ్చే సీజన్‌కు జట్టులో ఉండకపోవచ్చు. గత రెండు సీజన్లుగా విజయ్‌కి చెన్నై రెండు కోట్ల జీతం చెల్లిస్తోంది. 2018,19 సీజన్లలో మూడు మ్యాచ్‌లు ఆడిన విజయ్‌.. కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో విజయ్‌ను రిలీజ్‌ చేసేందుకు సీఎస్‌కే రంగం సిద్ధం చేసిందట.

 కరణ్‌, ఠాకూర్‌లకు గుడ్‌ బై:

కరణ్‌, ఠాకూర్‌లకు గుడ్‌ బై:

కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌లను కూడా రిలీజ్‌ చేయడానికి సీఎస్‌కే సిద్ధమైనట్లు సమాచారం. గత రెండు సీజన్లలో లెగ్‌ స్పిన్నర్‌ కరణ్‌ శర్మ ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. గత రెండు సీజన్లలో 23 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్‌ ఠాకూర్ 24 వికెట్లు మాత్రమే తీశాడు. కరణ్‌ శర్మకు రూ. 5 కోట్లు, శార్దూల్‌కు రూ. 2 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. ఠాకూర్‌, కరణ్‌ ప్రదర్శనలపై అసంతృప్తిగా ఉన్న సీఎస్‌కే రిలీజ్‌ చేయడానికి సిద్ధంగా ఉంది.

జాదవ్, రాయుడులకు కష్టమే:

జాదవ్, రాయుడులకు కష్టమే:

సీఎస్‌కేలో కీలక ఆటగాళ్లు కేదార్ జాదవ్, అంబటి రాయుడులను కూడా రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తోందని సమాచారం. ప్రపంచకప్‌లో పూర్తిగా విఫలమమై ఇప్పటికే భారత జట్టులో చోటు కోల్పోయిన జాదవ్.. సీఎస్‌కేలో కూడా చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇతనికి రూ .7.80 కోట్లు చెల్లిస్తోంది. గత సీజన్‌లో పరుగులు చేయడంలో ఆకట్టుకోలేకపోయిన రాయుడును కూడా వదులుకోనుందని సమాచారం.

Story first published: Wednesday, November 13, 2019, 16:11 [IST]
Other articles published on Nov 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X