న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం 2019: ఈ ఐదుగురు కనీస ధరైనా పలుకుతారా?

IPL Auction 2019 : These 5 Indian Players Not Get Big Bids | Oneindia Telugu
IPL auction 2019: These five Indian players may not get big bids

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ కోసం వేలానికి సమయం ఆసన్నమైంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 18న జైపూర్ వేదికగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి మొత్తం 1003 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారు.

<strong>ఇండియా vs ఆస్ట్రేలియా: అడిలైడ్ టెస్టులో టాప్-4 ప్రదర్శనలివే</strong>ఇండియా vs ఆస్ట్రేలియా: అడిలైడ్ టెస్టులో టాప్-4 ప్రదర్శనలివే

వేలానికి సంబంధించి 346 మంది క్రికెటర్ల పేర్లతో బీసీసీఐ జాబితా విడుదల చేసింది. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేకపోవడం గమనార్హం. ఈ మొత్తంలో ఉన్న 9 మంది ప్లేయర్లు (బ్రెండన్‌ మెకల్లమ్, వోక్స్, లసిత్‌ మలింగ, షాన్‌ మార్ష్, కొలిన్‌ ఇంగ్రామ్, కోరె అండర్సన్, మాథ్యూస్, శ్యామ్‌ కరన్, డార్సీ షార్ట్‌) విదేశీయులే.

కాగా, ఐపీఎల్ 2019 సీజన్ ప్లేయర్ రిజిస్ట్రేషన్‌లో మొత్తం 1003 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారని బీసీసీఐ పేర్కొంది. ఇందులో మొత్తం 232 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఒకే రోజుతో ముగిసిపోయే ఐపీఎల్ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది.

అయితే, ఈ వేలంలో పలువురు భారత ఆటగాళ్లు తక్కువ ధర పలికే అవకాశం ఉంది. వేలంలో తక్కువ ధర పలికే భారత ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి పరిలిద్దాం....

ఛటేశ్వర్ పుజారా (కనీస ధర రూ. 50 లక్షలు)

ఛటేశ్వర్ పుజారా (కనీస ధర రూ. 50 లక్షలు)

ఐపీఎల్‌లో పుజారా ఇప్పటివరకు మూడు జట్ల(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్)కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 30 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన పుజారా 2014లో చివరిసారిగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున ఆడాడు. కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్ అయిన పుజారా 20.53 యావరేజితో 390 పరుగులు చేశాడు. టెస్టు క్రికెటర్‌గా ముద్ర పడిన పుజారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఐపీఎల్ 2019 వేలంలో పుజారాను ఇంతకు మించి తక్కువ ధరకే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

యువరాజ్ సింగ్ (కనీస ధర రూ. కోటి)

యువరాజ్ సింగ్ (కనీస ధర రూ. కోటి)

గత ఐపీఎల్ వేలంతో పోలిస్తే ఐపీఎల్ 2019 సీజన్ కోసం యువరాజ్ సింగ్ తన కనీస ధరను తగ్గించుకున్నాడు. 18న నిర్వహించనున్న వేలంలో వెటరన్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తన కనీస ధరను రూ.కోటిగా నిర్ణయించుకోవడం విశేషం. గత సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన యువరాజ్ సింగ్ 8 గేమ్‌లాడి 65 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే, గతంలో యువరాజ్ అద్భుతమైన పామ్‌లో ఉన్నప్పుడు యువీని ఢిల్లీ ఫ్రాంఛైజీ రూ. 16 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

వృద్ధిమాన్ సాహా (కనీస్ ధర రూ. కోటి)

వృద్ధిమాన్ సాహా (కనీస్ ధర రూ. కోటి)

ఐపీఎల్‌లో విజయవంతమైన వికెట్ కీపర్లలో వృద్ధిమాన్ సాహా ఒకడు. ఇప్పటివరకు మొత్తం 115 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన సాహా 129.85 స్ట్రయిక్ రేట్‌తో 1679 పరుగులు సాధించాడు. గత సీజన్‌ వేలంలో సాహాను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. అయితే గాయం కారణంగా సాహా సన్ రైజర్స్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఇషాంత్ శర్మ (కనీస ధర రూ. 75 లక్షలు)

ఇషాంత్ శర్మ (కనీస ధర రూ. 75 లక్షలు)

ఢిల్లీకి చెందిన ఇషాంత్ శర్మ చివరిసారిగా ఐపీఎల్‌ 2016 ఐపీఎల్ సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో మెరుగైన రికార్డు లేని కారణంగానే గత సీజన్‌లో ఇషాంత్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబర్చలేదు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు మొత్తం 76 మ్యాచ్‌లాడిన ఇషాంత్ కేవలం 58 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

జయదేవ్ ఉనాద్కత్ (కనీస ధర రూ. 1.5 కోటి)

జయదేవ్ ఉనాద్కత్ (కనీస ధర రూ. 1.5 కోటి)

గతేడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన భారత ఆటగాడిగా జయదేవ్ ఉనాద్కత్ అరుదైన ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు గత సీజన్‌లో జయదేవ్ ఉనాద్కత్‌ను రూ. 11.5 కోట్లకు కోనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. అయితే గత సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన ఉనాద్కత్ 11 వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో రాజస్థాన్ ఫ్రాంఛైజీ అతడిని వేలానికి విడుదల చేసింది.

Story first published: Wednesday, December 12, 2018, 20:05 [IST]
Other articles published on Dec 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X