న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సొంతగూటితో పాటు రికార్డు ధర: జాక్‌పాట్ కొట్టిన మలింగ, మోహిత్ శర్మ

 IPL Auction 2019 LIVE Updates: Mohit Sharma sold to CSK for Rs 5 Cr

హైదరాబాద్: జైపూర్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2019 వేలంలో పలువురు ఆటగాళ్లు రికార్డు స్థాయి ధర పలకగా, మరికొందరిని ప్రాంచైజీలు అసలు పరిగణనలోకే తీసుకోలేదు. అలాంటి వారిలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ షాన్ మార్ష్, ఉస్మాన్ ఖవాజాలు ఉన్నారు. వీరి కోసం ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

మైఖేల్ తెలుగులో ఐపీఎల్ వేలం 2019 లైవ్ అప్ డేట్స్మైఖేల్ తెలుగులో ఐపీఎల్ వేలం 2019 లైవ్ అప్ డేట్స్

మరోవైపు మరికొందరు ఆటగాళ్లను గత సీజన్లలో వారు ఆడిన ప్రాంఛైజీలే కొనుగోలు చేయడం విశేషం. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన మోహిత్ శర్మను మళ్లీ ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఈ పేసర్ కోసం ముంబై ఇండియన్స్ పోటీ పడినప్పటికీ చివరకు రూ.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

ఇప్పటి వరకు మెహిత్ శర్మ 84 ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక, శ్రీలంక పేసర్ లసిత్ మలింగను ఈ ఏడాది వేలంలో మళ్లీ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.2కోట్లకు కొనుగోలు చేసింది. ఇక, కనీసధర రూ. రూ.75ల‌క్ష‌లతో వేలంలోకి వచ్చిన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.1కోట్లకు దక్కించుకుంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన(6/56) చేసిన మహ్మద్ షమీని రూ.4.8 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది. మరోవైపు కనీస ధర రూ. 50 లక్షలకు వేలంలోకి రాగా రూ.2.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. మరోవైపు స్పిన్నర్లు రాహుల్ శర్మ, ఆడమ్ జంపాలను నిరాశే ఎదురైంది.

Story first published: Tuesday, December 18, 2018, 19:24 [IST]
Other articles published on Dec 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X