న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలంతో జీవితం మారిపోయింది: ఎవరీ రింకూ సింగ్‌

By Nageshwara Rao
IPL Auction 2018: Aligarh rejoices Rinku Singh’s big break with Kolkata Knight Riders

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలం కొంత మంది యువ క్రికెటర్ల జీవితాలను మార్చేయబోతోంది. అలాంటి వారిలో రింకూ సింగ్ ఒకడు. పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్ జీవితంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త వెలుగులను నింపింది.

ఐపీఎల్‌లో తొలి కాశ్మీరీ క్రికెటర్: ఎవరీ మంజూర్ దార్ఐపీఎల్‌లో తొలి కాశ్మీరీ క్రికెటర్: ఎవరీ మంజూర్ దార్

బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన రెండు రోజుల వేలంలో రింకూ సింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.80 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అలీగఢ్‌ ఆటగాడు రింకూ సింగ్‌ను గతేడాది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.10 లక్షలు పెట్టి వేలంలో కొనుగోలు చేస్తే, ఈ ఏడాది ఏకంగా రూ.80 లక్షలు పలికాడు.

రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. రింకూ సింగ్ కోసం పంజాబ్, ఢిల్లీ, కోల్‌కతా జట్లు పోటీ పడ్డాయి. చివరకు వేలంలో కోల్‌కతా జట్టు రూ. 80 లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. ఇది అతని కనీస ధరకన్నా నాలుగు రెట్లు ఎక్కువ. ఐపీఎల్‌కి రాకముందు వరకు రింకూ సింగ్ కుటుంబం ఒక చిన్న షెడ్డులోనే జీవించేది.

వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి, భారత బ్యాట్స్‌మన్ షూ లేస్ కట్టిన పాక్ ఫీల్డర్వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి, భారత బ్యాట్స్‌మన్ షూ లేస్ కట్టిన పాక్ ఫీల్డర్

ఇంటింటికి వెళ్లి ఎల్‌పీజీ సిలిండర్‌ చేర వేసే వృత్తిలో ఉన్న తన తండ్రి ఖాన్ చంద్‌కు తాను ఇలా ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని వేలం అనంతరం రింకూ సింగ్ తెలిపాడు. 2009లో క్రికెట్ ఆడటం నేర్చుకున్న రింకూ సింగ్ ఉత్తర ప్రదేశ్ అండర్‌-16, 19 జట్లకు ఎంపికయ్యాడు.

2014 విజయ్‌ హజారే ట్రోఫీలో 206, 154 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2016లో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరుపున ఆడాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్
1. సునీల్ నరైన్ (రూ.8.5 కోట్లు - Retained)
2. అండ్రీ రసెల్ (రూ.7 కోట్లు-Retained)
3. మిచెల్ స్టార్క్ (9.4 కోట్లు)
4. క్రిస్ లిన్ (9.6 కోట్లు)
5. దినేష్ కార్తీక్ (రూ.7.4 కోట్లు)
6. రాబిన్ ఉతప్ప (రూ.6.4 కోట్లు-RTM)
7. పియూష్ చావ్లా (రూ.4.2 కోట్లు-RTM)
8. కుల్‌దీప్ యాదవ్ (రూ.5.8 కోట్లు -RTM)
9. శుభ్‌మాన్ గిల్ (రూ.1.8 కోట్లు)
10. ఇషాంక్ జగ్గి (రూ.20 లక్షలు)
11. నితీష్ రాణా (రూ.3.4 కోట్లు)
12. కమలేష్ నగర్‌కోటి (రూ.3.2 కోట్లు)
13. వినయ్ కుమార్ (రూ.కోటి)
14. అపూర్వ్ వాంఖెడె (రూ.20 లక్షలు)
15. రింకు సింగ్ (రూ.80 లక్షలు)
16.శివమ్ మావి (రూ.3 కోట్లు)
17. కేమరూన్ డెల్‌పోర్ట్ (రూ.30 లక్షలు)
18. మిచెల్ జాన్స‌న్ (రూ.2 కోట్లు)
19. జేవ‌న్ సియ‌ర్‌లెస్ (రూ.30 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 10:37 [IST]
Other articles published on Jan 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X