న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌కు ఐపీఎల్ ఓ చక్కటి ప్రిపరేషన్: స్టీవ్ స్మిత్

IPL a good preparation for World Cup: Steve Smith

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌కు ఐపీఎల్ ఓ చక్కటి ప్రిపరేషన్ అవుతుందని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ "వన్డేల్లో రాణించడానికి ఈ ఐపీఎల్‌ కచ్చితంగా తోడ్పాటునందిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్‌కప్‌లో పాల్గొనే క్రికెటర్లు అందరూ మంచి ప్రదర్శనే చేస్తారు. నాకు తెలిసి టీ20 క్రికెట్‌ అనేది వన్డే ఫార్మాట్‌కు ఒక కొనసాగింపు లాంటిది" అని స్టీవ్ స్మిత్ అన్నాడు.

ఐపీఎల్ ద్వారా ఎన్నో విషయాలు

ఐపీఎల్ ద్వారా ఎన్నో విషయాలు

"నా విషయానికొస్తే ఈ ఐపీఎల్ ద్వారా ఎన్నో విషయాల్లో మెరుగుయ్యాను. ముఖ్యంగా ప్రత్యర్థి జట్లలో అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొగలిగే అవకాశం దొరికింది. ఇక, రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే లీగ్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. అయితే మా ఆటగాళ్లు తమ స్థాయి మేరకు మెరుగైన ప్రదర్శనే చేస్తారు" అని స్మిత్ అన్నాడు.

స్టీవ్ స్మిత్‌కు ఇదే ఆఖరి మ్యాచ్

స్టీవ్ స్మిత్‌కు ఇదే ఆఖరి మ్యాచ్

ఈ సీజన్‌లో స్టీవ్ స్మిత్‌కు ఇదే ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియాకు పయనం కావాల్సి ఉంది. కాగా, ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న యువ ఆటగాడు, జట్టులోని సహచర ఆటగాడు శ్రేయస్‌ గోపాల్‌‌పై స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఆఖరి నుంచి రెండో స్థానంలో రాజస్థాన్

ఆఖరి నుంచి రెండో స్థానంలో రాజస్థాన్

ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడుతున్నాయి. చివరగా ఈ రెండు జట్లు ఆడిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాజస్థాన్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.... ఆర్సీబీ మాత్రం 8 పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది.

ఆర్సీబీ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకు దూరమైనట్టే!

ఆర్సీబీ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకు దూరమైనట్టే!

టెక్నికల్‌గా చెప్పాలంటే ఆర్సీబీ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకు దూరమైనట్టే. అయితే, మిగతా జట్ల ఓటములు ఆర్సీబీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్‌ ఆర్సీబీకి ఎంతమాత్రం కలిసి రాలేదు. సీజన్ ఆరంభంలో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అంతేకాదు ఐపీఎల్‌లో 100 ఓటములను ఎదుర్కొన్న తొలి జట్టుగా ఆర్సీబీ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.

Story first published: Tuesday, April 30, 2019, 18:53 [IST]
Other articles published on Apr 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X