న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: మినీ వేలం తర్వాత డేంజరస్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్.. తుది జట్టు అంచనా ఇదే!

IPL 2023: CSK strongest playing 11 after Mini Auction

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై.. 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్‌టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. దీపక్ చాహర్ గాయంతో పాటు కెప్టెన్సీ మార్పు నిర్ణయం చెన్నై సూపర్ కింగ్స్ కొంపముంచింది. రిటైర్మెంట్ ప్లాన్‌లో భాగంగా ధోనీ.. తన సారథ్య బాధ్యతలను జడేజాకు ఇవ్వగా అతను దారుణంగా విఫలమయ్యాడు.

కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేక వ్యక్తిగతంగాను విఫలమయ్యాడు. దాంతో ధోనీ మళ్లీ సారథ్య బాధ్యతలు అందుకున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో అవసరం లేని ఆటగాళ్లను వదిలేసిన సీఎస్‌కే.. రూ.20.45 కోట్లతో మినీ వేలంలో పాల్గొంది.

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్‌కే.. మరో ఆరుగురు ఆటగాళ్లను తీసుకుంది. ఇంకా ఆ జట్టు పర్స్‌లో రూ.1.5 కోట్లు ఉన్నాయి. బెన్ స్టోక్స్‌ రాకతో చెన్నై బలం రెట్టింపు అయ్యింది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్న నేపథ్యంలోనే స్టోక్స్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎస్‌కే తుది జట్టు అంచనాపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా రుతురాజ్, బెన్ స్టోక్స్..

ఓపెనర్లుగా రుతురాజ్, బెన్ స్టోక్స్..

చెన్నై ఇన్నింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు బెన్ స్టోక్స్ ప్రారంభించనున్నాడు. డెవాన్ కాన్వే రూపంలో మంచి ఓపెనర్ ఉన్నా.. నలుగురు ఓవర్ సీస్ ప్లేయర్ల నిబంధన కారణంగా డెవాన్ కాన్వేను ఆడించలేని పరిస్థితి. ఒకవేళ డెవాన్ కాన్వే జట్టులోకి వస్తే మాత్రం బెన్ స్టోక్స్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో తనదైన బ్యాటింగ్‌తో సత్తా చాటాడు.ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 368 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్‌కు కూడా ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉంది. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

మిడిలార్డర్‌లో మొయిన్ అలీ, రాయుడు, శివమ్ ధూబే..

మిడిలార్డర్‌లో మొయిన్ అలీ, రాయుడు, శివమ్ ధూబే..

మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ ధూబే.. చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. తనదైన రోజు మొయిన్ అలీ ఆకాశమే హద్దుగా చెలరేగగలడు. ఉన్నంత సేపు చిత్కకొట్టే మొయిన్ అలీ.. స్కోర్ బోర్డు పరుగుగెత్తించగలడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన మొయిన్ అలీ.. ఓ హాఫ్ సెంచరీతో 244 పరుగులు చేశాడు.

13 మ్యాచ్‌లు ఆడిన అంబటి రాయుడు ఓ హాఫ్ సెంచరీతో 274 పరుగులు చేయగా.. శివమ్ ధూబే 11 ఇన్నింగ్స్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 289 పరుగులు చేశాడు. మరోసారి ఈ ముగ్గురు సీఎస్‌కేకు కీలకం కానున్నారు. వయసు రీత్యా అంబటి రాయుడికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చు.

ఫినిషర్లుగా ధోనీ, జడేజా..

ఫినిషర్లుగా ధోనీ, జడేజా..

టీమ్ ఫినిషర్లుగా మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నారు. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన జడేజా.. ఈ సీజన్‌లో రాణించడం చాలా ముఖ్యం. అయితే ధోనీ సీజన్ మొత్తం కొనసాగుతాడా? లేక మధ్యలోనే తప్పుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన జడేజా.. 116 పరుగులు మాత్రమే చేశాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ బాదిన ధోనీ..232 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కూడా ఈ ఇద్దరూ రాణించడం చాలా ముఖ్యం.

దీపక్ చాహర్, ముఖేశ్ చౌదరితో...

దీపక్ చాహర్, ముఖేశ్ చౌదరితో...

పేస్ విభాగాన్ని దీపక్ చాహర్, ముఖేశ్ చౌదరి, బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్ నడిపించనుండగా.. మహీశ్ తీక్షణతో కలిసి జడేజా స్పిన్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. గత సీజన్‌లో దీపక్ చాహర్ దూరమవడం టీమ్ విజయవకాశాలను దెబ్బతీసింది. శివమ్ దూబే రూపంలో కూడా సీఎస్‌కేకు ఎక్స్‌ట్రా పేసర్ ఉన్నాడు.

సీఎస్‌కే తుది జట్టు(అంచనా)

సీఎస్‌కే తుది జట్టు(అంచనా)

రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివ్‌మ్ ధూబే, మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ముఖేశ్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ

సీఎస్‌కే పూర్తి జట్టు

సీఎస్‌కే పూర్తి జట్టు

ఎంఎస్ ధోనీ, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాన్షు సేనపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్థన్ హంగార్గేకర్, డ్వేన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేశ్ చౌదరి, మతీషా పతీరణ, సిమర్జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహీశ్ తీక్షణ, అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, కైల్ జెమీసన్, అజయ్ మండల్, భగత్ వర్మ

Story first published: Thursday, December 29, 2022, 11:28 [IST]
Other articles published on Dec 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X