న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉమ్రాన్ మాలిక్ పేస్ దెబ్బకు.. నేలకూలిన మయాంక్ అగర్వాల్, నొప్పితో విలవిల

Ipl 2022: Umran Malik short ball makes Mayank Agarwal injury to his ribs

సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో అత్యంత వేగవంతమైన డెలివరీలతో ఆకట్టుకున్నాడు. అతను స్థిరంగా 150కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం పట్ల క్రికెట్ దిగ్గజ ప్లేయర్లు సైతం అతన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. వేగవంతమైన డెలివరీలు అతనికి ప్లస్ పాయింట్ అయినప్పటికీ బ్యాటర్‌కు మాత్రం మైనస్ అనే చెప్పొచ్చు. అతని వేగవంతమైన బంతులు బ్యాటర్ల శరీరానికి తాకితే తప్పకుండా గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఇక నిన్న అదే జరిగింది. ఈ సీజన్‌లోని చివరి లీగ్ మ్యాచ్‌ ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఉమ్రాన్ బౌలింగ్ చేయగా.. అతను వేసిన వేగవంతమైన బంతి మయాంక్ శరీరానికి తాకింది. దీంతో మయాంక్ నొప్పితో విలవిల్లాడాడు.

నొప్పితోనే సింగిల్ తీసి నేలపై కూలాడు

నొప్పితోనే సింగిల్ తీసి నేలపై కూలాడు

పంజాబ్ ఛేజింగ్ చేస్తున్న క్రమంలో ఎనిమిదో ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌కు దిగాడు. ఉమ్రాన్ షార్ట్ డెలివరీ వేశాడు. మయాంక్ దానిని స్క్వేర్ లెగ్ ప్రాంతం గుండా స్వైప్ చేయాలని చూడగా ఆ బంతి మిస్ అయింది. నేరుగా వెళ్లి మయాంక్ పక్కటెముకలను తాకింది. అయితే బాయ్స్ రన్ కోసం అతను సింగిల్ కోసం పరిగెత్తాడు. అలా పరుగెత్తుతున్నప్పుడు అతను తన పక్కటెముకల మీద ఒక చేతిని పెట్టుకుని నొప్పితో పరుగు తీసినట్లు కన్పించాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకున్నప్పుడు, అతను నేలపై పడిపోయాడు. దీంతో అతనికి చికిత్స అందించేందుకు వెంటనే జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చాడు. తద్వారా మ్యాచ్‌లో కాస్త ఆలస్యం చోటుచేసుకుంది. ఇక నొప్పి ఉన్నప్పటికీ మయాంక్ తన బ్యాటింగ్ కొనసాగించాడు. ఇక ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. కేవలం 1పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో మయాంక్ అగర్వాల్ తన పేలవమైన ప్రదర్శనతోనే సీజన్‌ను ముగించాడు.

నేను ఎక్స్ రే తీసుకోవడానికి వెళ్తాను

నేను ఎక్స్ రే తీసుకోవడానికి వెళ్తాను

మ్యాచ్ అనంతరం మయాంక్ మాట్లాడుతూ.. 'ఈ గాయం చాలా నొప్పి పెడుతుంది. నేను ఎక్స్ రే తీసుకోవడానికి వెళ్తాను' అని పేర్కొన్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించి తమ సీజన్‌ను ఘనంగా ముగించింది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో 14పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచారు. మరోవైపు సన్ రైజర్స్ 14మ్యాచ్‌లలో ఆరు విజయాలు 12పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

మాకు చాలా సానుకూల అంశాలున్నాయి

మాకు చాలా సానుకూల అంశాలున్నాయి

ఇక మ్యాచ్, టీం గురించి మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'ఈ సీజన్లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్, ధావన్ చాలా బాగా ఆడారు. మేము రెండు బ్యాక్ టు బ్యాక్ విజయాలను సాధించి ఉండుంటే ప్లేఆఫ్ రేసులో మరింత అవకాశం ఉండేది. కానీ అది జరగలేదు. మేము కొన్ని సార్లు వరుసగా వికెట్లు కోల్పోయాము, దానివల్ల మా బ్యాటింగ్ కొన్నిసార్లు పట్టాలు తప్పింది. అయినప్పటికీ మేము చాలా దూకుడుగా ఆడాం. తర్వాతి ఐపీఎల్ కోసం తప్పకుండా చర్చించుకుంటాం.' అని మయాంక్ చెప్పాడు.

Story first published: Monday, May 23, 2022, 9:44 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X