
అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారు
ఐపీఎల్ లేని సమయంలో తమకు చాలా పని ఉన్నదని, తమ జట్టు బలహీన ప్రాంతాలను గుర్తించామని ఆయన చెప్పాడు. అందుకు అనుగుణంగానే వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేశామని చెప్పుకొచ్చాడు. బలమైన జట్టును తయారు చేయడానికి తమ ఫ్రాంచైజీ అద్భుతంగా పని చేసిందని సంగక్కర కొనియాడాడు. ప్రపంచంలోని ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లు ఈ సారి తమ జట్టులో ఉన్నారని చెప్పుకొచ్చాడు. కాగా రాజస్థాన్ రాయల్స్ మెగా వేలంలో రవిచంద్రన్ అశ్విన్, యజుర్వేంద్ర చాహల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

బలంగా పేస్ బౌలింగ్, బ్యాటింగ్
వేలంలో బలమైన పేస్ డిపార్డుమెంట్‌ను దక్కించుకున్నామని సంగక్కర విశ్వాసం వ్యక్తం చేశాడు. ట్రెంట్ బౌల్డ్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ, మెక్‌కాయ్, కౌల్టర్ నీల్‌తో తమ పేస్ విభాగం బలంగా ఉందని చెప్పుకోచ్చాడు. ఇక సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, నీషమ్, మిచెల్, వాన్‌డర్ డస్సెన్‌తో తమ బ్యాటింగ్ విభాగం కూడా బలంగా ఉందని సంగక్కర చెప్పాడు. ముఖ్యంగా భారత జట్టు నుంచి రాజస్థాన్ రాయల్స్ టీంలో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు. అన్ని విభాగాల్లో బలమైన ఆటగాళ్లను ఎంపిక చేశామని, ఈ సారి జట్టు బలంగా ఉందని, కచ్చితంగా సత్తా చాటుతామని సంగక్కర తెలిపాడు.

ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తాం
ఆటగాళ్ల విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని, ఫీల్డ్‌లో ఒత్తిడిని తట్టుకుని, ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చి, అత్యుత్తమమైన ప్రదర్శన రాబట్టడమే కీలకమని సంగక్కర అన్నాడు. ప్రాంచైజీకి గౌరవం తీసుకొచ్చి, మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడమే తన కర్తవ్యమని, ఇది పూర్తి స్థాయిలో నెరవేర్చానని భావిస్తున్నానని ఆయన చెప్పాడు. కాగా నిరాశజన ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ గత 3 సీజన్లలో వరుసగా 7, 8, 7 సీజన్లలో నిలిచిన సంగతి తెలిసిందే.

వార్న్ మరణం కలిచివేస్తోంది
ఐపీఎల్ తొలి సీజన్లోనే సంచలన ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా నిలబెట్టిన ఆ జట్టు మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో షేన్‌వార్న్‌ను గుర్తు చేసుకుని సంగక్కర భావోద్వేగం చెందాడు. షేన్ వార్న్ లేకపోవడం క్రికెట్‌కు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆట పట్ల పరిపూర్ణమైన జ్ఞానం ఉన్న మేధావి షేన్ వార్న్ మరణం తనను ఎంతో కలిచి వేస్తుందని సంగక్కర చెప్పుకోచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్ పూర్తి స్వ్వాడ్ 2022
సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కేసీ కరియప్ప, నవదీప్ సైనీ, ఒబేద్ మెకాయ్, అరుణయ్ సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ జురెల్, దహ్రూవ్ నాయర్, , తేజస్ బరోకా, కులదీప్ యాదవ్, శుభమ్ గర్వాల్, డారిల్ మిచెల్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, నాథన్ కౌల్టర్-నైల్, జేమ్స్ నీషమ్