న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: యువ బౌల‌ర్‌ ఉమ్రాన్ మాలికే త‌న‌కు స్ఫూర్తి అంటున్న‌ పేస్ దిగ్గ‌జం డేల్ స్టెయిన్‌

IPL 2022: Sunrisers Bowling coach Dale Steyn says young bowler Umran Malik is an inspiration to him

ఉమ్రాన్ మాలిక్‌. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఈ యువ బౌల‌ర్ పేరు బ‌లంగా వినిపిస్తుంది. దీనికి ఈ కుర్రాడి బౌలింగ్‌లోని వేగ‌మే కార‌ణం. జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. గ‌త సీజ‌న్లోనూ స‌న్‌రైజ‌ర్స్‌కే ప్రాతినిధ్యం వ‌హించిన ఉమ్రాన్ మాలిక్‌ను ఈ సారి మెగా వేలానికి ముందే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మేనేజ్‌మెంట్ రిటైన్ చేసుకుంది.

150 కిలో మీట‌ర్ల‌కుపైగా వేగంతో బౌలింగ్‌

150 కిలో మీట‌ర్ల‌కుపైగా వేగంతో బౌలింగ్‌

ప్ర‌స్తుత సీజ‌న్లో గంట‌కు ఏకంగా 150 కిలో మీట‌ర్ల‌కు పైగా వేగంతో బంతులేస్తూ ఉమ్రాన్ మాలిక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు. ఏదో ఒక బంతిని కాకుండా చాలా బంతుల‌ను ఉమ్రాన్ మాలిక్ ఇదే వేగంతో విసురుతున్నాడు. ఇక ఓవ‌ర్‌లోని ప్ర‌తి బంతిని క‌నీసం 140 కిలో మీట‌ర్ల వేగంతో వేస్తున్నాడంటే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ఎంత వేగం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అత్యంత వేగంతో బౌలింగ్ చేసిన రికార్డు కూడా ఉమ్రాన్ మాలిక్ పేరు మీద‌నే ఉంది. ఉమ్రాన్ మాలిక్ అత్య‌ధికంగా 153 కిలో మీట‌ర్ల‌కు పైగా వేగంతో బౌలింగ్ చేశాడు. అయితే మంచి వేగంతో బౌలింగ్ చేస్తున్న‌ప్ప‌టికీ ఉమ్రాన్ మాలిక్ దానికి త‌గ్గ‌ట్టుగా వికెట్లు తీయ‌లేక‌పోతున్నాడు. అంతేకాకుండా భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఉమ్రాన్ వేగంతో కూడిన పేస్‌ను ఉప‌యోగించుకోని బ్యాట‌ర్లు సునాయ‌సంగా ప‌రుగులు రాబ‌డుతున్నాడు. దీంతో ఒక్కో సారి మాలిక్‌కు కెప్టెన్ కేన్ విలియమ్స‌న్ పూర్తి బౌలింగ్ కోటా కూడా ఇవ్వ‌డం లేదు.

స్టెయిన్‌కు ఇన్సిపిరేష‌న్ ఉమ్రాన్ మాలిక్

తాజాగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్.. ఉమ్రాన్ మాలిక్‌ను త‌న స్ఫూర్తిదాయ‌క ఆట‌గాడిగా పేర్కొన‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా షాజాద్ ఖాన్ అనే వ్య‌క్తి డేల్ స్టెయిన్ మీకు స్ఫూర్తి ఎవ‌ర‌ని అడిగాడు. దీనికి డేల్ స్టెయిన్ ఉమ్రాన్ మాలిక్ పేరు చెప్పాడు. అయితే దీనిపై ప‌లువురు నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఉమ్రాన్ మాలికే మీ నుంచి స్ఫూర్థి పొంది ఉంటాడ‌ని నేను అనుకున్నాన‌ని ఒక‌రు అన‌గా.. ముందు ఉమ్రాన్ మాలిక్‌కు బౌలింగ్ నేర్పించండ‌ని మ‌రొక‌రి కామెంట్ చేశారు. కాగా ప్ర‌పంచంలోని దిగ్గ‌జ పేస్ బౌల‌ర్ల‌లో డేల్ స్టెయిన్ ఒక‌డ‌నే విష‌యం తెలిసిందే. త‌న పేస్‌తో ఎంతో మందికి స్ఫూర్తి క‌ల్గించాడు. దీంతో స్టెయిన్ త‌న స్ఫూర్తి దాయ‌కుడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్ప‌డేమంట‌ని ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి జ‌ట్టు

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి జ‌ట్టు

కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కరిక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రొమారియో అబ్బోట్, రొమారియో అబ్బోట్ , ఆర్ సమర్థ్, సౌరభ్ దూబే, శశాంక్ సింగ్, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్హాక్ ఫరూకీ.

Story first published: Thursday, April 14, 2022, 18:17 [IST]
Other articles published on Apr 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X