న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

muralidaran Shouts On Jasen: వై ది ఫ.. హీ ఇజ్ బౌలింగ్, వాడు ఎందుకలా బౌలింగ్ చేస్తున్నాడు.. మైండ్ దొబ్బిందా?

IPL 2022: SRH Bowling Coach Muttiah Muralitharan Shouts On Marco Jansen For His Worst Bowling On GT

ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠగా సాగింది. చివరి బంతి వరకు విజయం ఇరువైపులా దోబూచులాడింది. చివరి ఓవర్లో 22పరుగులు అవసరమైన దశలో రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. తొలుత తేవాతీయ ఓ సిక్స్ కొట్టి సింగిల్ తీయగా.. చివరి మూడు బంతుల్లో రషీద్ ఖాన్ మూడు సిక్సర్లు కొట్టి గుజరాత్‌ను గెలిపించారు. చివరి ఓవర్ వేసిన మార్కో జాన్సేన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. బంతి ఎలా వేసినా రషీద్ బాదుతూనే ఉన్నాడు.

ఈ క్రమంలో మార్కో జాన్సేన్ బౌలింగ్ పట్ల సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ బాగా సీరియస్ అయ్యాడు. డగౌట్లో కూర్చుని అసహనానికి లోనయ్యాడు. 5వ బంతికి జాన్సేన్ ఫుల్ టాస్ వేయడంతో రషీద్ ఆఫ్ సైడ్ సిక్సర్ బాదాడు. దీంతో తీవ్రంగా నిరాశపడ్డ ముత్తయ్య డగౌట్లో కూర్చున్నోడు లేచి.. వై ది ఫ.. హీజ్ ఈ బౌలింగ్ ఫుల్ అంటూ సీరియస్‌ అయ్యాడు. జాన్సేన్ ఎందుకు ఫుల్ లెంత్ బాల్స్ వేస్తున్నాడు.. మైండ్ ఏమైనా దొబ్బిందా వీడికి అన్నట్లు ముత్తయ్య రియాక్షన్ కన్పించింది.

కూల్‌గా ఉండేవాళ్లు సైతం ఐపీఎల్లో ఇలా అయిపోతారు

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. శ్రీలంక జట్టుకు ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా.. చాలా కూల్‌గా కన్పించేవాడు. ఎప్పుడూ తన నవ్వును చెదరనివ్వని ఈ దిగ్గజం.. ఐపీఎల్ పుణ్యమా అని బరస్ట్ అయిపోయాడు. గతంలో చాలా కూల్‌ పర్సన్స్ అని పేరున్న మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ సైతం ఇలా ఐపీఎల్లో తమ సహనాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్‌లలో ఉండే ఉద్విగ్నతే ఇందుకు కారణం.

పాపం జాన్సేన్

నిజానికి మార్కో జాన్సేన్ చివరి ఓవర్ బానే బౌలింగ్ చేశాడు. తన ప్లాన్ ప్రకారం.. ప్రతి బంతిలో వైవిధ్యత చూపించాడు. ఎగ్జిక్యూషన్ లోపం కొంత.. అలాగే రషీద్ ఖాన్ ఎటాకింగ్ కొంత అతని ప్లాన్‌ను పూర్తిగా చెడగొట్టాయి. తొలిబంతికి స్లో కట్టర్ వేశాడు.. కానీ దాన్ని తెవాతీయా సిక్సర్‌గా మలిచాడు. తన బౌలింగ్లో వైడ్ యార్కర్, బౌన్సర్, స్ట్రెయిట్ యార్కర్, లో ఫుల్ టాస్ లాంటి వైవిధ్య భరిత బంతులు వేసినా.. గాచారం బాగాలేకపోతే ఏం చేస్తాడు పాపం.

మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఉమ్రాన్.. కానీ

ఉమ్రాన్ మాలిక్ 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పాడు. ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే బంతులతో గిల్, సాహా, మిల్లర్, అభినవ్ మనోహర్‌లను బౌల్డ్ చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యాను క్యాచ్ ఔట్ చేశాడు. 16ఓవర్లు ముగిసేసరికి 140పరుగులతో 5వికెట్లు కోల్పోయి గుజరాత్ కష్టాల్లో పడింది. ఇక గెలుపు కష్టమే అనుకున్న తరుణంలో సన్ రైజర్స్ బౌలర్లు నిరాశపర్చడం, చివర్లో జాన్సేన్ 22పరుగులను కూడా డిఫెండ్ చేయలేకపోవడంతో ముత్తయ్య మురళీధరన్ అసహనానికి లోనయ్యాడు.

ఇంకా ఒక్క వికెట్ పడినా.. సన్ రైజర్స్ గెలిచేది. కానీ మాలిక్ తప్పా మిగతా వాళ్లు ఎవరూ వికెట్లు తీయకపోవడంతో మురళీధరన్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో మరో విశేషమేంటంటే.. తన చివరి ఓవర్లో సన్ రైజర్స్ బ్యాటర్లు 25పరుగులు చేయగా.. గుజరాత్ సైతం చివరి ఓవర్లో 25పరుగులు చేసింది.

Story first published: Thursday, April 28, 2022, 8:48 [IST]
Other articles published on Apr 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X