న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: బైసెప్స్‌తో భయపెడుతున్న సంజూ శాంసన్!

 IPL 2022: RR skipper Sanju Samson shows biceps, says ‘I am Super strong’

ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్ తన బైసెప్స్‌తో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉన్న శాంసన్.. టీమ్ హోటల్లో క్వారంటైన్ పాటిస్తున్నాడు. ఈ క్వారంటైన్ సమయాన్ని వృథా చేయకుండా తన ఫిట్‌నెస్ లెవల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. క్వారంటైన్ గదిలోనే తన ఆర్మ్ పవర్ పెంచుకునే ఎక్స్‌ర్‌సైజులపై ఫోకస్ పెట్టాడు. అప్‌కమింగ్ సీజన్‌లో అలవోకగా సిక్సర్లు బాదేందుకు తన కండ బలాన్ని పెంచుకుంటున్నాడు.

కండలతో కంగారెత్తిస్తున్నడుగా..

తాజాగా తన కండలను చూపిస్తూ ఇచ్చిన ఫోజును సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫొటోకు ''క్వారంటైన్‌ గోయింగ్‌ స్ట్రాంగ్‌'' అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. కండలు చూపిస్తూ సంజూ అందరిని కంగారెత్తిస్తున్నాడు కదా? అని అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. అప్‌కమింగ్ సీజన్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తాడేమోనని కామెంట్ చేస్తున్నారు.

ఒక భారీ ఇన్నింగ్స్ ఖాయం..

ఒక భారీ ఇన్నింగ్స్ ఖాయం..

ఇక మరో 9 రోజుల్లో ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఆర్మ్‌ పవర్‌ ఉన్న ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ ఒకడు. బంతిని బలంగా బాదడంలో శాంసన్‌‌ను మించిన వాడు లేడు. ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో ఓ భారీ ఇన్నింగ్స్‌తో తన పవరేంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. అయితే ఒకటి రెండు ఇన్నింగ్స్‌లు ధాటిగా ఆడటం.. ఆ తర్వాత వరుసగా విఫలమవ్వడం అతనికి అలవాటు. అయితే గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన అతను కాస్త నిలకడగా రాణించాడు. అయితే శాంసన్‌ పవర్‌హిట్టింగ్ గురించి ఓ సందర్భంలో విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భయమనే పదం తెలియదు..

భయమనే పదం తెలియదు..

రెండేళ్ల క్రితం(2020) విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. అక్కడ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడగా... ఇందులో మూడు, నాలుగో టీ20లు రసవత్తరంగా సాగి వరుసగా సూపర్ ఓవర్‌కు దారి తీసాయి. అయితే ఈ రెండు సార్లు సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రోహిత్ శర్మతో కలిసి సంజూ శాంసన్‌ను పంపాలనుకున్నానని అప్పట్లో విరాట్ కోహ్లీ తెలిపాడు. కానీ కేఎల్‌ రాహుల్‌ దీన్ని వ్యతిరేకించడంతో నాలుగో టి20లో తాను బరిలోకి దిగానని, భయమనే పదమే తెలియని శాంసన్‌లో మంచి హిట్టింగ్‌ పవర్‌ దాగుందని కోహ్లీ కొనియాడాడు. అయితే సూపర్‌ ఓవర్‌లో రాహుల్‌ ఔట్‌ కావడం.. వెంటనే కోహ్లీ.. శాంసన్‌ను బ్యాటింగ్‌కు పిలవడం కొస మెరుపు. టీమిండియా తరపున 13 టీ20లు, ఒక వన్డే మ్యాచ్‌ ఆడిన సంజూ శాంసన్‌.. ఐపీఎల్‌లో 121 మ్యాచ్‌లాడి 3068 పరుగులు చేశాడు.

Story first published: Thursday, March 17, 2022, 17:26 [IST]
Other articles published on Mar 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X