న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేకేఆర్ టీం నుంచి స్టార్ పేసర్ పాట్ కమ్మిన్స్ ఔట్.. కారణమిదే

IPL 2022: Pat Cummins Leaves KKR Bio Bubble Due To Hip Injury

ఐపీఎల్ సీజన్ ముగింపులో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పెద్ద దెబ్బ పడింది. తుంటి గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో కమ్మిన్స్ తన స్వస్థలమైన ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లడానికి జట్టు బయోబబుల్‌ను విడిచిపెట్టాడు. అయితే కమిన్స్ గాయం చాలా తీవ్రమైనదేం కాదని, రెండు వారాల్లో పూర్తి ఫిట్‌నెస్‌ని తిరిగి పొందగలడని జట్టు వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో కమ్మిన్స్‌కు విశ్రాంతినిస్తూ ఆస్ట్రేలియా సెలక్షన్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

తాజాగా గాయం వల్ల అతనికి ఫిట్ నెస్ పరంగా ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. అయినప్పటికీ శ్రీలంకతో జరగబోయే వన్డే, టెస్టు పర్యటనకు కమ్మిన్స్ అందుబాటులో ఉంటాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కేకేఆర్ చావోరేవో తేల్చుకోవాల్సిన చివరి రెండు మ్యాచ్‌లకు పాట్ కమ్మిన్స్ దూరం కావడం ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీయొచ్చు. ఈ సీజన్లో కొన్ని మ్యాచ్‌లలో అతన్ని కేకేఆర్ జట్టు బెంచ్‌కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ అతను జట్టుతో చేరాడు. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ జట్టు పాట్ కమ్మిన్స్ సేవలను కోల్పోవడం కొంత సమస్యే అని చెప్పొచ్చు. ప్లేఆఫ్ పోటీలో నిలవాలంటే ఆ జట్టు భారీ విజయాలు సాధించాలి. ప్రస్తుతం 12 మ్యాచ్‌లలో 5 విజయాలతో కేకేఆర్ 7వ స్థానంలో ఉంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా మైనస్లో ఉంది. ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడానికి చివరి రెండు మ్యాచ్‌లలో భారీ మార్జిన్ గెలుపులు అవసరమైన ఈ తరుణంలో కమ్మిన్స్ నిష్క్రమణ ఆ జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపడం తథ్యం.

IPL 2022: Pat Cummins Leaves KKR Bio Bubble Due To Hip Injury

రెండింటికీ రెండు మ్యాచ్‌లలో గెలిచినా కేకేఆర్ మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇకపై కమిన్స్ బౌలింగ్ లైనప్‌లో లేనందున పేస్-బౌలింగ్ విభాగాన్ని నిర్వహించడానికి కేకేఆర్ శివమ్ మావి, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ వంటి వారిపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియా పూర్తి స్థాయి శ్రీలంక పర్యటన జూన్ 7న ప్రారంభం అవుతుంది. జూన్ 7న తొలి టీ20జరుగుతుంది. మూడు టీ20ల సిరీస్ తొలుత జరిగాక.. ఆ తర్వాత ఐదు వన్డేల సిరీస్, రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇటీవల పాకిస్థాన్ పర్యటనలో కమ్మిన్స్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. చక్కటి ఫామ్‌ను కనబరిచాడు. కమ్మిన్స్ కేవలం వికెట్ టేకర్ మాత్రమే కాదు.. లోయర్ ఆర్డర్లో అద్భుతంగా హిట్టింగ్ చేయగల ప్లేయర్ కూడా.

Story first published: Friday, May 13, 2022, 12:47 [IST]
Other articles published on May 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X