న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Mega Auction: ఆర్‌సీబీలోకి మనీశ్ పాండే.. కెప్టెన్ కూడా అతనే!

IPL 2022 Mega Auction: RCB Likely To Buy Manish Pandey And Make Him Captain
IPL 2022 Mega Auction: Manish Pandey To Replace Virat Kohli ?

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ మనీశ్ పాండే.. ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఈ వెటరన్ బ్యాట్స్‌మన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటకకు చెందినవాడే కావడం, ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా రాణించడంతో మనీశ్ పాండే‌ను తీసుకునేందుకు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఆసక్తికనబరుస్తుంది. ఇక 2009లో ఆర్‌సీబీ తరఫునే ఈ ధనాధన్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాండే.. ఐపీఎల్‌లో సెంచరీ బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, పుణె వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. 2018 మెగా వేలంలో మనీశ్ పాండే‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.11 కోట్లకు కోనుగోలు చేయగా.. తాజా సీజన్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఓ దశలో తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. దాంతో ఈ స్టార్ బ్యాట్స్‌మన్‌ను సన్‌రైజర్స్ వేలంలోకి విడిచి పెట్టింది. అయితే ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో మనీశ్ పాండే సత్తా చాటాడు. కర్ణాటక కెప్టెన్‌గా అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టును ఫైనల్‌కు చేర్చిన పాండే.. విజయ్ హజారే ట్రోఫీలో క్వార్టర్స్ వరకు తీసుకెళ్లాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు హాఫ్ సెంచరీలతో 292 పరుగులు చేశాడు.

లీగ్‌లో ఎంతో అనుభవంతో పాటు కర్ణాటకు చెందినవాడు కావడంతో మనీశ్ పాండేను ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అంతేకాకుండా ఆర్‌సీబీ గత కొన్నాళ్లుగా సరైన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ లేకుండా ఇబ్బంది పడుతుంది. మనీశ్ పాండేతో ఆ సమస్యను కూడా అధిగమించవచ్చనుకుంటుంది. అంతేకాకుండా ఫీల్డింగ్‌లో మనీశ్ పాండేకు సాటిలేరు. అతని మైమరిపించే ఫిల్డీంగ్ విన్యాసాలు ఇప్పటికి నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. వీటన్నిటికి మించి కెప్టెన్‌గా ఎంతో అనుభవం ఉండటం మనీశ్ పాండే‌ను తీసుకోవడానికి ప్రధాన కారణం.

వాస్తవానికి కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలనుకున్నప్పటికీ అతను లక్నో ఫ్రాంచైజీ ఒప్పందంతో ఆర్‌సీబీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో లోకల్ బాయ్ అయిన మనీశ్ పాండేతో జట్టును నడిపించాలని ఆర్‌సీబీ అనుకుంటుంది. వాస్తవానికి మనీశ్ పాండే సైతం కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లా భారత జట్టులో ఆడాల్సింది. కానీ అతనికి సరైన అవకాశాలు రాకపోవడం.. మిడిలార్డర్‌లో తీవ్ర పోటీ ఉండటంతో దేశవాళీ మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు.

Story first published: Wednesday, December 22, 2021, 17:41 [IST]
Other articles published on Dec 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X