న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: రహానే, పుజారాలకు నిరాశే.. వేలంలో అమ్ముడుపోని 9 మంది భారత ఆటగాళ్లు వీరే!

IPL 2022 Mega Auction: 9 Indian Players Who Will Remain Unsold In The Auction

హైదరాబాద్: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్నా కొద్దీ అభిమానుల్లో ఆసక్తి మరింత రెట్టింపు అవుతోంది. ఏయే ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తాడనే ఆతృత అందరిలో నెలకొంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ వేలానికి సంబంధించిన వ్యూహాలను సిద్దం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే పది జట్ల రాకతో ఈ సారి మరో 40 మంది ఆటగాళ్లకు అదనంగా అవకాశం దక్కనుంది.

అయితే పేలవ ఫామ్ దృష్ట్యా ఓ 9 మంది భారత ఆటగాళ్లకు నిరాశ తప్పేలా లేదు. అమ్ముడుపోని లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. వయసు ఎక్కువగా ఉండటంతో పాటు పేలవ ఫామ్, కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఫ్రాంచైజీ‌లు ఈ ఆటగాళ్లపై ఆసక్తికనబర్చకపోవచ్చు. ఓ సారి ఆ జాబితాపై లుక్కెద్దాం.!

 రహానే, పుజారా‌లకు నిరాశే..

రహానే, పుజారా‌లకు నిరాశే..

టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు ఈసారి అన్‌సోల్డ్ లిస్ట్‌లో నిలిచే అవకాశం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమై టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరూ ఇటీవల నిలకడలేమి ఆటతో తడబడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిని జట్టులోకి తీసుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు సుముఖంగా లేవు. గత సీజన్‌లో గౌరవం కొద్దీ ధోనీ సూచనల మేరకు చతేశ్వర్ పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ కరుణించినా.. ఈ సారి ఆ పరిస్థితి లేదు. జట్టులోకి తీసుకున్నా.. అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

గత సీజన్‌లో రహానే ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించినా అతనికి రెండు మ్యాచ్‌ల్లోనే అవకాశం లభించింది. ఆ రెండింటిలో కూడా అతను దారుణంగా విఫలమయ్యాడు. 2019 వరకు నిలకడగా ఐపీఎల్ ఆడిన రహానేకు.. గత రెండేళ్లు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. రహానే, పుజారా కోటి రూపాయల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్నారు. వీరిని తీసుకునే సాహసం ఏ ఫ్రాంచైజీ చేయకపోవచ్చు.

విజయ్ శంకర్, విహారీ..

విజయ్ శంకర్, విహారీ..

తమిళనాడు ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ విజయ్ శంకర్‌కు కూడా ఈ సారి నిరాశే ఎదురవ్వనుంది. గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో తమిళనాడు కెప్టెన్‌గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫైనల్‌కు చేర్చిన విజయ్ శంకర్.. వ్యక్తిగతంగా దారుణంగా విఫలమయ్యాడు. పైగా ఒత్తిడిని ఏ మాత్రం తట్టుకోలేని విజయం శంకర్‌ను ఆల్‌రౌండర్‌గా ఏ జట్టు పరిగణించడం లేదు. ఈ క్రమంలోనే కోటీ రూపాయల కనీస ధరతో అందుబాటులో ఉన్న అతన్ని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ సుముఖంగా లేదు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ విహారీకి ఈసారి కూడా మొండిచెయ్యే ఎదురవ్వనుంది. గత సీజన్ మాదిరే ఈసారి కూడా అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరనున్నాడు.

కేదార్ జాదవ్, పియూష్ చావ్లా..

కేదార్ జాదవ్, పియూష్ చావ్లా..

గత రెండు, మూడేళ్లుగా తీవ్ర ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్న కేదార్ జాదవ్‌ను కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకునే అవకాశం లేదు. గత సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ వదిలేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కరుణించింది. అయినా ఆ అవకాశాన్ని అతను అందిపుచ్చుకోలేకపోయాడు. 6 మ్యాచ్‌ల్లో 55 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే కోటీ రూపాయలతో అందుబాటులో ఉన్న జాదవ్‌ను ఫ్రాంచైజీలు పక్కనపెట్టే అవకాశం ఉంది. సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లాను కూడా తీసుకునే అవకాశాలు లేవు. గతేడాది ముంబై ఇండియన్స్ తరఫు ఒకే మ్యాచ్ ఆడిన చావ్లా.. ఒకే ఒక వికెట్ తీసాడు. సీనియర్ అనే ట్యాగ్ కారణంగా అతన్ని పక్కనపెట్టే అవకాశం ఉంది.

IPL 2022 Mega Auction: 3 Indian Players Are The Most Expensive Cricketers | Oneindia Telugu
సచిన్ బేబీ, కరణ్ శర్మ, మోహిత్ శర్మ..

సచిన్ బేబీ, కరణ్ శర్మ, మోహిత్ శర్మ..

సచిన్ బేబీ, కరణ్ శర్మ, మోహిత్ శర్మ వంటి దేశవాళీ ఆటగాళ్లకు ఈసారి నిరాశే ఎదురుకానుంది. గత సీజన్‌లో ఆర్‌సీబీకి ఆడిన సచిన్ బేబీ.. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది ఢిల్లీకి ఆడిన మోహిత్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. పైగా అతను ఇప్పుడు ఫామ్‌లో లేడు. 2020 సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన కరణ్ శర్మకు కూడా ఈ సారి మొండిచెయ్యే ఎదురుకానుంది. లక్కీస్టార్‌గా పేరున్న కరణ్ శర్మ‌కు గత రెండు మూడు సీజన్లుగా దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని పక్కనపెట్టే చాన్స్ ఉంది.

Story first published: Friday, January 28, 2022, 11:34 [IST]
Other articles published on Jan 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X