న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Jos Buttler Records In Qualifier 2: జోస్ ది బాస్ దెబ్బకు పిట్టల్లా రాలిన రికార్డులు.. డేంజరేస్ ప్లేయర్ మరీ!

IPL 2022: List Of Records For Jos Buttler After Scoring Against RCB In Qualifier 2

ఒక్క సీజన్ 16మ్యాచ్‌లు, 824పరుగులు, 151.47 స్ట్రైక్ రేట్, 58.87 సగటు, 4సెంచరీలు, 4హాఫ్ సెంచరీలు, 78ఫోర్లు, 45సిక్సులు, అత్యధిక స్కోరు 116.. ఈ గణాంకాలు చాలు.. ఈ సీజన్లో జోస్ బట్లర్ దండయాత్ర ఏ రేంజులో సాగిందో చెప్పడానికి. అతని అసామాన్య బ్యాటింగ్‌కు పలు రికార్డులు గులామ్ అన్నాయి. ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌‌ మ్యాచ్‌ను జోస్ బట్లర్ పూర్తిగా వన్ సైడ్ మ్యాచ్‌గా మార్చేశాడు.

జోస్ బట్లర్ (106పరుగులు 60బంతుల్లో 10ఫోర్లు 6సిక్సర్లు) ఒంటి చేత్తో మ్యాచ్ ఆర్సీబీ నుంచి లాగేసుకున్నాడు. ఫలితంగా రాజస్థాన్ 7వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ఫైనల్ చేరుకుంది. ఇకపోతే జోస్ బట్లర్ విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్సీబీ బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా.. ఎడాపెడా బౌండరీలతో బట్లర్ పిచ్చికొట్టుడు కొట్టిండు. ఇక ఈ ఇన్నింగ్స్ ద్వారా ఎన్నో రికార్డులు బట్లర్ ఒళ్లో వాలాయి. ప్రత్యర్థుల పాలిట మోస్ట్ డేంజరేస్ బ్యాటర్‌గా మారాడు.

ఆ రికార్డ్ నమోదు చేసిన మూడో ప్లేయర్‌గా

ఇక ఈ సీజన్లో 16మ్యాచుల్లో బట్లర్ 4సెంచరీలు, 4హాఫ్ సెంచరీలతో మొత్తం 824పరుగులు చేశాడు. ఇక ఒక సీజన్లో 800కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ ఈ ఫీట్ సాధించారు. ఇకపోతే ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలోనూ మూడో స్థానంలో బట్లర్ నిలిచాడు.

ఈ జాబితాలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ (973పరుగులు) తొలిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ 848పరుగులు ఉన్నాడు. ఇక మూడో స్థానంలో జోస్ బట్లర్ (824పరుగులు మరో మ్యాచ్ మిగిలి ఉంది)కొనసాగుతున్నాడు. ఫైనల్లో మరో 25పరుగులు చేస్తే రెండో స్థానానికి బట్లర్ ఎగబాకుతాడు.

సెంచరీల ధీరుడు

ఇక ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా జోస్ బట్లర్ (4సెంచరీలు), విరాట్ కోహ్లీ (4సెంచరీలు)తో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక 2016లో విరాట్ కోహ్లీ 4సెంచరీలు ఏడు హాఫ్ సెంచరీలతో మొత్తం 973పరుగులు చేయగా.. బట్లర్ 4సెంచరీలు 4 హాఫ్ సెంచరీలతో 824పరుగులు చేశాడు. ఇకపోతే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో గేల్ (6సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ (5), బట్లర్ (5)తో రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో 4సెంచరీలతో షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. ఇక ఒకే టోర్నీలో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ల లిస్టులోనూ బట్లర్ రికార్డు నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ (4సెంచరీలు ఐపీఎల్ 2016), బట్లర్ (4సెంచరీలు ఐపీఎల్ 2022), మైకెల్ క్లింగర్ (3సెంచరీలు టీ20 బ్లాస్ 2015)తో కొనసాగుతున్నారు.

బౌండరీల శూరుడు

ఒక్క సీజన్లో బట్లర్ బ్యాటింగ్ ధాటికి బౌండరీలు వరదలా వచ్చాయి. ఒకే సీజన్లో బట్లర్ ఏకంగా 45సిక్సులు బాదాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు (45) బాదిన ప్లేయర్‌గా బట్లర్ నిలిచాడు. ఇక ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో బట్లర్ టాప్ 5లో చోటు సంపాదించాడు. అంతకుముందు 2012లో క్రిస్ గేల్ 59సిక్సులు, 2019లో ఆండ్రూ రస్సెల్ 52, 2013లో క్రిస్ గేల్ 51, 2022లో బట్లర్ 45, 2011లో క్రిస్ గేల్ 44 సిక్సులు బాది టాప్ 5లో ఉన్నారు. ఇక ఈ సీజన్లో అత్యధిక ఫోర్లు (78) కొట్టిన ప్లేయర్‌గా బట్లర్ కొనసాగుతున్నాడు.

Story first published: Saturday, May 28, 2022, 11:35 [IST]
Other articles published on May 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X