న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Liam Livingstone: ఉమ్రాన్ మాలిక్ అయితే ఏంటీ తొక్క.. 153కి.మీ బంతికి సిక్స్, లివింగ్‌స్టోన్ రికార్డులివే

IPL 2022: Liam Livingstone Hits Umran Malik 153 KMPH Ball For A Six

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించిన సంగతి తెలిసిందే. తద్వారా ఐపీఎల్ 2022 సీజన్‌ను ఘనంగా ముగించింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ బౌలింగ్‌ను పంజాబ్ బ్యాటర్లు తుత్తునియలు చేశారు. ఇక 158పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు ఇంకా 29బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంలో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ లియమ్ లివింగ్ స్టోన్ కీలక పాత్ర పోషించాడు.

తన విధ్వంసక బ్యాటింగ్‌తో లియామ్ లివింగ్‌స్టోన్ పంజాబ్ కు అలవోక విజయాన్ని కట్టబెట్టాడు. అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన లివింగ్‌స్టోన్ ఏమాత్రం టైం వృథా చేయలేదు. వచ్చీరాగానే సన్ రైజర్స్ బౌలర్లపై అటాక్ మొదలెట్టేశాడు. ఈ క్రమంలో రెండు ఫోర్లు, 5సిక్సర్లతో కేవలం 22బంతుల్లో 49పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా ఉండి పంజాబ్‌కు సునాయస విజయాన్ని అందించాడు.

అయితే లివింగ్ స్టోన్ కు ఈ మ్యాచ్‌లో రెండు లైఫ్స్ వచ్చాయి. రెండు క్యాచ్ అవుట్ల నుంచి తప్పించుకున్న లివింగ్ స్టోన్ ఏమాత్రం జాలి దయ కరుణ చూపకుండా సన్ రైజర్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు.

ఉమ్రాన్ మాలిక్ అయితే ఏంటీ?

ఉమ్రాన్ మాలిక్ అయితే ఏంటీ?

ఇక ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్లో లివింగ్ స్టోన్ చివరి రెండు బంతుల్లో సిక్సర్లు బాదాడు. అందులో ఓ బంతి 153కి.మీల వేగంతో పడింది. అంతా వేగవంతమైన బంతి పడ్డప్పటికీ ఏమాత్రం జంకకుండా లివింగ్ స్టోన్ అంతే వేగంతో సిక్సర్ బాది వారెవ్వా అనిపించాడు. ఇక లివింగ్ స్టోన్‌తో తన ఇన్నింగ్స్‌లో 5సిక్సర్లు బాదాడు.

త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అందుక్కారణం.. 16ఓవర్ తొలి బంతికి అవతలి ఎండ్ లో ఉన్న మంకడ్ ఫోర్ కొట్టడం దీంతో పంజాబ్ గెలుపు లాంఛనమైపోయింది. హాఫ్ సెంచరీ చేయకున్నా 22బంతుల్లోనే 49పరుగులు చేసి సన్ రైజర్స్ కు ఊపిరి సడలనివ్వకుండా చేశాడు.

1000వ సిక్సు బాదిన లివింగ్ స్టోన్

1000వ సిక్సు బాదిన లివింగ్ స్టోన్

ఇక ఈ ఐపీఎల్లో లియమ్ లివింగ్ స్టోన్ 14మ్యాచ్‌లలో 437పరుగులు చేసి వారెవ్వా అనిపించాడు. అతని స్ట్రైక్ రేట్ 180కంటే ఎక్కువగా ఉండడం విశేషం. అలాగే ఈ సీజన్లో లాంగెస్ట్ సిక్స్ 117మీటర్లు కూడా అతనిపేరిటే ఉంది. అలాగే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ బట్లర్ (37సిక్సులు) తర్వాత అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్ల జాబితాలో లియమ్ లివింగ్ స్టోన్ (34) రెండో స్థానంలో ఉన్నాడు.

అతని తర్వాతి స్థానంలో ఆండ్రీ రస్సెల్ (32)మూడో స్థానంలో ఉన్నాడు. ఇక పోతే లివింగ్ స్టోన్ ఈ మ్యాచ్‌లో తన నాలుగో సిక్సు బాదడంతో ఈ ఐపీఎల్ సీజన్లో 1000వ సిక్సు నమోదైంది. తొలిసారి ఓ ఐపీఎల్ సీజన్లో 1000సిక్సులు నమోదు కావడం విశేషం.

నా మీద వచ్చిన విమర్శలకు గట్టి జవాబిచ్చా

నా మీద వచ్చిన విమర్శలకు గట్టి జవాబిచ్చా

పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ చేరకపోయినప్పటికీ లివింగ్‌స్టోన్ తన బ్యాటింగ్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ.. గత ఐపీఎల్ 2021లో తన ప్రదర్శనను విమర్శించిన వ్యక్తులకు ప్రస్తుత సీజన్లో తన ఆటతీరుతో గట్టి జవాబు ఇచ్చానని పేర్కొన్నాడు. కొందరు వ్యక్తులు నా మీద చేసిన విమర్శలను తప్పని నిరూపించేలా ఆడినందుకు చాలా సంతోషంగా ఉందని లివింగ్‌స్టోన్ పేర్కొన్నాడు.

టోర్నీలో బాగా హిట్టింగ్ చేయగలిగా

టోర్నీలో బాగా హిట్టింగ్ చేయగలిగా

లియమ్ లివింగ్ స్టోన్ టోర్నీలో ఆద్యంతం తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉందని తెలిపాడు. టోర్నీ మొత్తం బంతిని బాగా హిట్ చేయగలిగానని ఫీలింగ్ అనిపించింది. రెండున్నర నెలలుగా టోర్నీలో భాగం కావడం వల్ల చాలా తెలుసుకున్నానని చెప్పాడు. 'ముఖ్యంగా ఎడమ చేతివాటం బౌలర్లను బాగా ఎదుర్కోగలిగాను.

నేనెప్పుడూ ఒక ఎడమచేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్లో ఎక్స్ ట్రా కవర్‌ దిశగా షాట్ కొట్టలేదు. కానీ దాన్ని ఈ ఐపీఎల్లో కొంచెం పూడ్చుకున్నట్లు అనిపించింది. ఇక నేను ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ దిగే టైంలో కేవలం మాకు బాల్ కు ఓ చొప్పున రన్ మాత్రమే అవసరముంది. ఇక పెద్దగా హిట్టింగ్ చేయాల్సిన పని లేదు. కానీ కాస్త లూజ్ బాల్స్ పడితే చూడొచ్చనుకున్నా.. అలాగే హిట్టింగ్ చేశా' అని తెలిపాడు.

Story first published: Monday, May 23, 2022, 14:50 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X