న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: చూడనికి సూపర్.. కేకేఆర్ వేసెనా తీన్మార్! బలాలు, బలహీనతలు ఇవే!

 IPL 2022: KKR Strength and Weakness, Top Players, Playoffs Chances and Playing XI Prediction

హైదరాబాద్: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కాకుండా ఐపీఎల్‌లో ఒకటికి మించి టైటిళ్లు గెలిచిన జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్. గౌతమ్ గంభీర్ సారథ్యంలో ఆ జట్టు 2012, 2014లో ఛాంపియన్‌గా నిలిచింది. మూడేళ్ల వ్యవధిలోనే రెండు టైటిళ్లు గెలిచిన ఆ జట్టు.. గత ఏడేళ్లుగా మరో టైటిల్ కోసం నిరీక్షిస్తూనే ఉంది. గౌతమ్ గంభీర్ అనంతరం దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్‌లు జట్టును నడిపించినా రాత మారలేదు. గత సీజన్‌‌‌‌ తొలి దశలో చెత్తగా ఆడి.. యూఏఈ గడ్డపై రెండో దశలో రెచ్చిపోయిన కోల్‌‌‌‌కతా అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ వరకు వెళ్లిన ఆ టీమ్‌‌‌‌ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి మూడో టైటిల్‌‌‌‌ను కొద్దిలో చేజార్చుకుంది. అయితే ఆరు నెలలు తిరగక ముందే ఆ టీమ్ కెప్టెన్‌‌‌‌ను మార్చేసిన ఫ్రాంచైజీ షాకిచ్చింది. మోర్గాన్​ను​ వదులుకున్న కేకేఆర్​ వేలంలో రూ.12.25 కోట్ల ధరతో కొనుక్కున్న టీమిండియా స్టార్‌‌‌‌ శ్రేయస్ అయ్యర్​ను కెప్టెన్ గా నియమించింది. మొత్తంగా చూస్తే ఆ జట్టు మరీ గొప్పగా లేదు. అలాగని తీసిపడేసేలానూ లేదు. ఒకసారి ఆ టీమ్ బలాలు బలహీనతలపై ఓ లుక్కెద్దాం.

బలాలు

బలాలు

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఆ జట్టు రాత మారడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్‌ అయ్యరే ఇప్పుడు కోల్‌కతాకు అతి పెద్ద బలం. గాయంతో గత సీజన్‌ ఫస్టాఫ్‌కు దూరమైన తనకు.. సెకండాఫ్‌లో తిరిగి కెప్టెన్సీ ఇవ్వకపోవడంతో శ్రేయస్ అలిగి ఆ జట్టును వీడాడు. ఇప్పుడు టీమిండియా తరఫున అదరగొట్టి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో కోల్‌కతా పగ్గాలు చేపడుతున్నాడు.

కొన్నేళ్లుగా కోల్‌కతాను ఇబ్బంది పెడుతున్న కెప్టెన్సీ సమస్య శ్రేయస్‌ వల్ల తీరిపోయినట్లే. బ్యాట్స్‌మన్‌గా కూడా అతడిది కీలక పాత్ర. వెస్టిండీస్ తో వన్డే, శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్ లో గొప్పగా రాణించిన అతడు.. ఈ లీగ్ లోనూ బ్యాట్ కు పనిచెబితే జట్టుకు తిరుగుండదు.

ఇక, అయ్యర్‌‌‌‌తో పాటు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ వెంకటేశ్, కమిన్స్, రసెల్ ఈ టీమ్ స్టార్ పెర్ఫామర్స్ అనడంలో సందేహం లేదు. భారత పిచ్​లపై జోరు చూపించే స్పిన్నర్లు వరుణ్, నరైన్ టీమ్‌కు కొండంత అండ.

బలహీనతలు

బలహీనతలు

దేశీయ ఆటగాళ్లలో స్టార్ల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు కోల్‌కతా. శ్రేయస్‌ అయ్యర్ కాకుండా ఆ స్థాయి దేశీయ బ్యాట్స్‌మన్‌ ఇంకొకరు లేకపోవడం లోటే. వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, శ్రేయస్‌లతో టాప్‌ ఆర్డర్‌ కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నా.. వీరు కాకుండా నమ్మదగ్గ దేశీయ బ్యాట్స్‌మన్‌ లేడు.

శుభ్‌మన్‌ దూరమవడం దెబ్బే. షెల్డన్‌ జాక్సన్‌, బాబా ఇంద్రజిత్‌, రింకు సింగ్‌, అనుకుల్‌ రాయ్‌ లాంటి దేశవాళీ ఆటగాళ్లు ఏమేర రాణిస్తారన్నది సందేహమే. రహానే ఫామ్‌ సంగతి తెలిసిందే.

దేశీయ పేసర్ల బలం కూడా కోల్‌కతాకు తక్కువే. ప్రసిద్ధ్‌ కృష్ణలా రాణించే బౌలరెవరో చూడాలి. ఉమేశ్‌ యాదవ్‌, శివమ్‌ మావిలపై పెద్దగా అంచనాల్లేవు. ఇక ఈ టీమ్ టాపార్డర్ లో కీలకమవుతాడనుకున్న అలెక్స్ హేల్స్ లీగ్ నుంచి తప్పుకోవడం కాస్త మైనస్.

అతడి ప్లేస్ లో వచ్చిన ఆరోన్ ఫించ్.. పెద్దగా ఫామ్‌‌‌‌లో లేడు. టిమ్ సౌథీ, మహ్మద్ నబీ ఉన్నా.. ఫారిన్‌‌‌‌ ప్లేయర్ల లిమిట్ ను దృష్టిలో ఉంచుకుంటే వారికి తుది జట్టులో అవకాశాలు రావడం కూడా సందేహమే.

ప్లే ఆఫ్స్ అంచనా..

ప్లే ఆఫ్స్ అంచనా..

శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే కేకేఆర్ సులువుగా ప్లే ఆఫ్స్ చేరుతోంది. మిగతా జట్లతో పోలిస్తే కేకేఆర్ బలంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా టీ20 స్పెషలిస్ట్‌లు ఆ జట్టులో ఉన్నారు. కాబట్టి ఈజీగా ప్లే ఆఫ్స్ చేరవచ్చు.

కోల్​కతా టీమ్

ఇండియన్స్‌‌‌‌: శ్రేయస్ (కెప్టెన్), చక్రవర్తి, వెంకటేశ్, రాణా, మావి, షెల్డన్, రహానె, రింకూ సింగ్, అనుకూల్, రసిఖ్, ఇంద్రజిత్, అశోక్ శర్మ, ప్రథమ్, అభిజీత్, రమేశ్, అమన్, ఉమేశ్ యాదవ్.

ఫారిన్‌‌‌‌ ప్లేయర్లు:

రసెల్, నరైన్, కమిన్స్, చమిక కరుణరత్నె, సామ్ బిల్లింగ్స్, ఫించ్, నబీ.

కేకేఆర్ తుది జట్టు (అంచనా)

కేకేఆర్ తుది జట్టు (అంచనా)

వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే/ఆరోన్ ఫించ్, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్/షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, ఉమేశ్ యాదవ్, శివం మావి, వరుణ్ చక్రవర్తీ.

Story first published: Saturday, March 19, 2022, 10:19 [IST]
Other articles published on Mar 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X