మెగా వేలంలో సంగక్కర చీటింగ్! ఆర్చర్ విషయంలో SRHకు కనుసైగ.. ముంబైకి దెబ్బ‌.. వైర‌ల్ వీడియో

బెంగ‌ళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. ఈ వేలం స‌మ‌యంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫ్రాంచైజీ డైరెక్ట‌ర్ కుమార సంగ‌క్క‌ర్ చీటింగ్‌కు పాల్ప‌డ్డాడ‌నే వార్తలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. అందుకు త‌గిన ఆధారాలు కూడా ల‌భించాయి. దీంతో క్రికెట్ అభిమానులు సంగ‌క్క‌రపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దిగ్గ‌జ ఆట‌గాడిగా బాధ్యతాయుత‌మైన ప‌ద‌విలో ఉండి ఇలా చేయ‌డమేంట‌ని సంగ‌క్క‌ర‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే

అస‌లు ఏం జ‌రిగిందంటే

ఐపీఎల్ 20 మెగా వేలం రెండో రోజు ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. మ‌ధ్యాహ్నం అనంత‌రం ఇంగ్లండ్ స్టార్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ వేలంలోకి వ‌చ్చాడు. 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన ఆర్చ‌ర్ వేలం పాట‌ను ఆక్ష‌న‌ర్ ప్రారంభించాడు. ఆశ్చ‌ర్యంగా ఈ సీజ‌న్‌లో ఆర్చ‌ర్ ఆడ‌డ‌ని తెలిసిన‌ప్ప‌టికీ అత‌ని కోసం ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పోటీ ప‌డ్డాయి.

రాజ‌స్థాన్ డ‌బ్బులు ఖ‌తం

రాజ‌స్థాన్ డ‌బ్బులు ఖ‌తం

మంచి స‌త్తా ఉన్న ఆర్చ‌ర్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొనుగోలు చేయాల‌ని మూడు టీంలు భావించాయి. ఇక గ‌త సీజ‌న్లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫునే ఆడిన ఆర్చ‌ర్ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు. దీంతో ఆ జ‌ట్టు ఆర్చ‌ర్‌ను వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో వేలంలో మూడు జ‌ట్ల మ‌ధ్య హోరా హోరి నెల‌కొంది. కానీ వేలం 6 కోట్ల రూపాయ‌ల వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి రాజ‌స్థాన్‌కు ఓ త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. అదేంటంటే ఆ జ‌ట్టు ద‌గ్గ‌ర అంతకు మంచి డ‌బ్బులు లేవు. దీంతో ఇక త‌న వేలాన్ని ముందుకు సాగించ‌లేదు.

సంగ‌క్క‌ర చీటింగ్‌

సంగ‌క్క‌ర చీటింగ్‌

ఈ స‌మ‌యంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ డైరెక్ట‌ర్ కుమార సంగ‌క్క‌ర చీటింగ్ మొద‌లుపెట్టాడు. ముంబై ఇండియ‌న్స్ ద‌గ్గ‌ర అప్ప‌టికే డ‌బ్బులు చాలా ఉండ‌డంతో ఆ జ‌ట్టు ఇక ఆర్చ‌ర్‌ను వ‌ద‌ల‌ద‌ని అర్థం చేసుకున్నాడు. అందుకే ముంబై డ‌బ్బుల‌ను అయిపోగొట్టాల‌నే ఉద్ధేశ్యంతో అప్ప‌టికే ఆర్చ‌ర్ కోసం వేలం పాట పాడుతున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు బిడ్‌ను పెంచ‌మ‌మ‌ని త‌న క‌ళ్ల‌తో సైగ చేశాడు. సంగ‌క్క‌ర చేసిన ఈ ప‌నులు వీడియోలో రికార్డు అయ్యాయి. దీంతో ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

సంగ‌క్క‌రపై విమ‌ర్శ‌లు

సంగ‌క్క‌ర చేసిన చీటింగ్ ప‌నుల‌ వీడియో చూసిన నెటిజన్లు అత‌నిపై విమ‌ర్శల దాడి చేస్తున్నారు. ఇలా మోసం చేయ‌డానికి సిగ్గు లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఓ బాధ్యతాయుత‌మైన ప‌ద‌విలో ఉండి ఇలా చేయ‌డ‌మేంట‌న ముంబై అభిమానులు, క్రికెట్ విశ్లేష‌క‌లు మండిపడుతున్నారు. వేలంలో సంగ‌క్క‌ర మోసానికి పాల్ప‌డ్డాడ‌ని అంటున్నారు. అంతేకాకుండా సంగ‌క్క‌ర‌పై ఐపీఎల్ కౌన్సిల్ క‌మిటీ, బీసీసీఐ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. కాగా సంగ‌క్క‌ర మోసానికి పాల్ప‌డిన‌ప్పకీ 8 కోట్ల రూపాయ‌ల‌కు జోఫ్రా ఆర్చ‌ర్‌ను ముంబై ఇండియ‌న్సే ద‌క్కించుకుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, February 14, 2022, 14:47 [IST]
Other articles published on Feb 14, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X