న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs RCB: ఢిల్లీ జట్టులోకి మిచెల్ మార్ష్.. ఆర్‌సీబీ‌లోకి హర్షల్ పటేల్ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే!

IPL 2022: Harshal Patel likely to re-entry In RCB Playing 11 And DC Playing 11 Mitchell Marsh In

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. నేడు వాంఖడే వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో జోరు కనబర్చిన ఆర్‌సీబీకి గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. టాపార్డర్ వైఫల్యం కారణంగా సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమిపాలైంది. దాంతో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని ఆర్‌సీబీ భావిస్తోంది. కేకేఆర్‌పై గత మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది.

హర్షల్ పటేల్ రీఎంట్రీ..

హర్షల్ పటేల్ రీఎంట్రీ..

గత మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ తమ స్టార్ పేసర్ హర్షల్ పటేల్ సేవలను కోల్పోయింది. సొంత చెల్లలు మరణంతో హర్షల్ పటేల్ బయో బబుల్ వీడాడు. దాంతో చెన్నైతో మ్యాచ్‌లో అతని సేవలను కోల్పోయిన ఆర్‌సీబీ మూల్యం చెల్లించుకుంది. అయితే ఏప్రిల్ 11నే అతను బయోబబుల్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన అతని మూడు రోజుల క్వారంటైన్ గురువారం ముగిసి ఉంటుంది. కాబట్టి అతను ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే అతని బయోబబుల్ చేరికపై అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ అతను అందుబాటులోకి రాకుంటే ఆర్‌సీబీ సిద్దార్థ్ కౌల్‌తో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్‌లో ధారళంగా పరుగులిచ్చిన ఆకాశ్‌దీప్‌పై వేటు వేయనుంది. ఇక ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్ వుడ్ గత మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

బరిలోకి మిచెల్ మార్ష్ ..

బరిలోకి మిచెల్ మార్ష్ ..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ముఖ్యంగా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. షా సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గాయంతో ఇబ్బంది పడుతున్న అన్రిచ్ నోర్జ్‌ మరింత విశ్రాంతినిచ్చే అవసరం ఉంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అందుబాటులోకి రావడంతో రోవమన్ పొవెల్ స్థానంలో ఆడించనున్నారు. కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

పిచ్ రిపోర్ట్..

పిచ్ రిపోర్ట్..

వాంఖడే మైదానంలోని వికెట్ చేజింగ్‌కు అనుకూలం. డ్యూ ప్రభావం ఉండనుంది. స్పిన్నర్లకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకరకంగా ఇది లోస్కోరింగ్ పిచ్ అని చెప్పాలి. బౌలర్లకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌ల్లో చేజింగ్ టీమ్స్ గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్లు చేజింగ్‌కే మొగ్గు చూపనున్నాయి.

తుది జట్లు(అంచనా)

తుది జట్లు(అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషభ్ పంత్, రోవమన్ పొవెల్/మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షెహ్‌బాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేశాయ్, హజెల్ వుడ్, వానిందు హసరంగా, సిద్దార్థ్ కౌల్/హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్,

Story first published: Saturday, April 16, 2022, 14:56 [IST]
Other articles published on Apr 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X