న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: అత్యంత బలహీనంగా గుజరాత్ టైటాన్స్! కెప్టెన్‌తో పాటు టీమ్ మొత్తం బొక్కలే!

IPL 2022: Gujarat Titans, Weakness, Top Players, Playoffs Chances and Playing XI Prediction
IPL 2022 : Gujarat Titans Team Analysis | Oneindia Telugu

హైదరాబాద్: ప్రపంచంలోనే ఖరీదైన, ఖతర్నాక్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ కోసం క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా.. ఎదురు చూస్తున్నారు. ప్రపంచ క్రికెట్ అభిమానులందరినీ ఏకం చేసి సహచరుల్ని ప్రత్యర్థుల్లా.. ప్రత్యర్థుల్ని సహచరుల్లా మార్చే ఈ టోర్నీ మరో 9 రోజుల్లో మొదలవ్వనుంది. రెండు కొత్త జట్ల రాకతో మెగా వేలం అనివార్యమవ్వగా.. అన్ని జట్లలో ఆటగాళ్లు అటు ఇటు మారారు. ఈ నేపథ్యంలో ఏ టీమ్ ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి రెట్టింపైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాదే క్యాచ్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేస్తున్న హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ టీమ్ ఎట్లుందో ఓ లుక్కెద్దాం.

అత్యంత బలహీనంగా..

అత్యంత బలహీనంగా..

గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా గుజరాత్ టైటాన్స్ ఆవిర్భవించింది. బీసీసీఐ బిడ్డింగ్‌లో కార్పొరేట్‌ వెంచర్స్‌ క్యాపిటల్‌ (సీవీసీ) కంపెనీ రూ.5625 కోట్ల భారీ ధరకు బిడ్ చేసి గుజరాత్‌ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా రూ. 15 కోట్లకు హార్దిక్ పాండ్యాను నియమించుకున్న గుజరాత్ టైటాన్స్.. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(రూ.15 కోట్లు), యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(రూ.8 కోట్లు) వేలానికి ముందు తీసుకుంది.

ఈ ముగ్గురికే రూ. 38 కోట్లు ఖర్చు చేయడంతో వేలంలో సరైన జట్టును అహ్మదాబాద్ పిక్ చేసుకోలేకపోయింది. ఉన్న డబ్బుతో సరైన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయింది. అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. మిగతా జట్లతో పోలిస్తే పేపర్‌పై అత్యంత బలహీనంగా కనిపిస్తోంది. ఇతర జట్లలో ఫస్ట్ ఎలెవన్ అయినా స్ట్రాంగ్ ఉంటే గుజరాత్‌లో అది కూడా లేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు టీమ్ మొత్తం గ్యాప్స్ కనిపిస్తున్నాయి.

టీమ్ బలాలు..

టీమ్ బలాలు..

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, స్టార్ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఆ జట్టు ప్రధాన బలం. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని శాసించగల సత్తా ఈ ఇద్దరికి ఉంది. ముఖ్యంగా రషీద్‌ఖాన్‌కు ఈ ఫార్మాట్‌లో ఎంతో అనుభవంతో పాటు మంచి రికార్డు ఉంది. పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడం అతని స్పెషలిటీ. అంతేకాకుండా లోయరార్డర్‌లో జట్టుకు కావాల్సిన మెరుపులు మెరిపించగలడు. ఈ క్రమంలోనే హార్దిక్ కన్నా కూడా రషీద్ ఖానే ఆ జట్టుకు కొండంత అండ. కాగితంపై చూస్తే పాండ్యతో పాటు రాహుల్ తెవాతియా, విజయ్‌శంకర్‌ లాంటి ఆల్‌రౌండర్లు ఆ జట్టుకు సమతూకాన్ని తెచ్చేవాళ్లే. మిల్లర్‌, రహ్మతుల్లా గుర్బాజ్‌ లాంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. యువ ఆటగాళ్లు సాయి కిషోర్, యశ్ దయాల్ వంటి సత్తా కలిగిన ఆటగాళ్లున్నారు.

బౌలింగ్‌లో రషీద్‌ కాకుండా పేసర్‌ మహ్మద్‌ షమీ, అల్జారీ జోసెఫ్‌, లూకీ ఫెర్గూసన్ జట్టులో కీలకం కానున్నారు.

బలహీనతలు

బలహీనతలు

కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ బలమే కాదు బలహీనత కూడా. ఇటీవల కాలంలో ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. గాయాలు, ఫిట్‌నెస్‌ లేమి కారణంగా చాలారోజులు క్రికెట్‌కు దూరంగా ఉండడం మరో ప్రతికూలాంశం. బ్యాటింగ్‌ పక్కనపెడితే బౌలింగ్‌ ఎంతవరకు చేస్తాడనేది ప్రశ్నార్థకం. ప్రస్తుతం ఫిట్‌నెస్ టెస్ట్ క్వాలిఫై అయినా అతను ఏ మేరకు బౌలింగ్ చేస్తాడనేది అనుమానమే. బౌలింగ్‌ బాగానే ఉన్నా బ్యాటింగ్‌లో మాత్రం భరోసానిచ్చే ఆటగాళ్లు కనిపించడం లేదు.

ఎంతో నమ్మకం పెట్టుకున్నజాసన్‌ రాయ్‌ లీగ్‌ నుంచి తప్పుకుని షాకిచ్చాడు. మిల్లర్‌ ఐపీఎల్‌లో ఎప్పుడూ నిలకడగా ఆడింది లేదు. విజయ్‌ శంకర్‌ పేరుకే ఆల్‌రౌండర్‌ కానీ.. ఐపీఎల్‌ రికార్డు పేలవం. రాహుల్ తెవాతియా తన తొలి ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత అంచనాలు అందుకోలేదు. శుభ్‌మన్‌కు తోడు సరైన ఓపెనర్‌ లేకపోవడం కూడా గుజరాత్‌కు ప్రతికూలాంశమే.

గుజరాత్ టైటాన్స్ టీమ్..

గుజరాత్ టైటాన్స్ టీమ్..

భారత ఆటగాళ్లు: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా, విజయ్‌ శంకర్‌, గుర్‌కీరత్‌, మహ్మద్‌ షమీ, దర్శన్‌ నాల్కండే, వరుణ్‌ ఆరోన్‌, ప్రదీప్‌ సాంగ్వాన్‌, యశ్‌ దయాళ్‌, సాయి సుదర్శన్‌, జయంత్‌ యాదవ్‌, అభినవ్ సాదరంగనీ,

విదేశీయులు: రషీద్‌ఖాన్‌, డేవిడ్‌ మిల్లర్‌, డొమినిక్‌ డ్రేక్స్‌, అల్జారి జోసెఫ్‌, రహ్మతుల్లా గుర్బాజ్‌, మాథ్యూ వేడ్‌, లూకీ ఫెర్గూసన్

కీలక ఆటగాళ్లు: హార్దిక్‌, రషీద్‌, మహమ్మద్ షమీ, శుభ్‌మన్‌ గిల్.

తుది జట్టు (అంచనా)

తుది జట్టు (అంచనా)

శుభ్ మన్ గిల్, రెహ్మనుల్లా/ సాహా/ మాథ్యూవేడ్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్/యశ్ దయాల్ , లూకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ

ప్లే ఆఫ్స్ చాన్స్..

ఈ జట్టుతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. అయితే హార్దిక్ పాండ్యా ఒకప్పటి ఆల్‌రౌండర్‌లా చెలరేగి.. యువ ఆటగాళ్లు సత్తా చాటితే మాత్రం అది సాధ్యం కావచ్చు.

Story first published: Tuesday, March 22, 2022, 10:20 [IST]
Other articles published on Mar 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X