న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs RR Playing 11: తెలుగు కుర్రాడికి ఛాన్స్: బట్లర్‌ జోరుకు బ్రేకులు వేయడం ఎలా?

IPL 2022, DC vs RR: KS Bharat likely to replace Rovman Powell

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఢిల్లీ కేపిటల్స్.. కీలక మ్యాచ్ ఆడబోతోంది. పాయింట్ల పట్టికలో తనకంటే ఎత్తులో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. పంజాబ్ కింగ్స్‌పై భారీ తేడాతో నెగ్గిన తరువాత రిషభ్ పంత్ టీమ్ నెట్ రన్‌రేట్ మెరుగుపడింది. ఆ జట్టుకు ఊపిరిపోసింది. అదే ఊపులో ఇవ్వాళ్టి మ్యాచ్‌ గెలుపుపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో గెలవగలిగితే- పాయింట్ల పట్టికలో టాప్ 5లోకి వచ్చేస్తుందీ జట్టు.

కోవిడ్ కల్లోలం..

కోవిడ్ కల్లోలం..

ఈ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ ప్రస్థానం మొన్నటిదాకా ఆశించిన స్థాయిలో సాగట్లేదు. ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లను ఆడిన రిషభ్ పంత్ టీమ్.. రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిందీ జట్లు. పంజాబ్ కింగ్స్‌పై సాధించిన తిరుగులేని విజయం- ఢిల్లీ క్యాంప్‌లో నూతనోత్తేజాన్ని నింపింది. బలమైన పంజాబ్ జట్టును 115 పరుగులకే పరిమితం చేయడం.. అనంతరం ఆ లక్ష్యాన్ని 10.3 ఓవర్లలోనే ఛేదించి- తిరుగులేదనిపించుకుంది.

వార్నర్ నుంచి మరో భారీ ఇన్నింగ్..

వార్నర్ నుంచి మరో భారీ ఇన్నింగ్..

పృథ్వీ షా ఫర్వాలేదనిపించుకుంటోన్నప్పటికీ.. అతని ఓపెనింగ్ పార్ట్‌నర్ డేవిడ్ వార్నర్ దమ్ము దులుపుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లల్లో 191 పరుగులు చేశాడు. మ్యాచ్‌కు 60 చొప్పున పరుగులు సాధిస్తున్నాడు. మూడు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. రిషభ్ పంత్ నిలకడగా రాణించట్లేదు. అడపా దడపా మాత్రమే సత్తా చాటుతున్నారు. అక్షర పటేల్, శార్దుల్ ఠాకూర్, లలిత్ యాదవ్.. తమ ఆల్‌రౌండర్ ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంది.

గాడిన పడ్డ బౌలింగ్

గాడిన పడ్డ బౌలింగ్

ఇదివరకు బౌలర్లు కూడా వరుసగా విఫలమౌతూ వచ్చారు గానీ.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ వారిని గాడిన పడేలా చేసింది. ఒక్క శార్దుల్ ఠాకూర్ మినహా మిగిలిన బౌలర్లందరూ వికెట్లు పడగొట్టారా మ్యాచ్‌లో. ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ రెండు చొప్పున, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ తీసుకున్నారు. బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితి ఉండొచ్చు.

 రౌమన్ పావెల్‌కు బదులుగా..

రౌమన్ పావెల్‌కు బదులుగా..

ఢిల్లీ కేపిటల్స్ ఇవ్వాళ్టి మ్యాచ్‌కు ఒక్క మార్పుతో బరిలోకి దిగొచ్చు. విరుసగా విఫలమౌతోన్న రౌమన్ పావెల్‌ను బెంచ్‌కే పరిమితం చేయొచ్చు. అతని స్థానంలో తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్‌ను తుది జట్టులోకి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మిగిలిన అయిదింట్లో చేసింది 31 పరుగులే. బ్యాటింగ్ యావరేజ్ 6.20. కీలకమైన ఈ మ్యాచ్‌లో పావెల్‌కు బదులుగా కేఎస్ భరత్‌ను తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

బట్లర్ జోరుకు..

బట్లర్ జోరుకు..

రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఢిల్లీ కంటే చాలా బెటర్. ఆరు మ్యాచ్‌లల్లో ఓడింది రెండింట్లోనే. మొత్తం ఎనిమిదిపాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది సంజు శాంసన్ సేన. ఓపెనర్ జోస్ బట్లర్.. ఆ జట్టు బ్యాటింగ్‌కు మెయిన్ పిల్లర్. ఈ సీజన్‌లో రెండో సెంచరీ చేశాడంటే- అతని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అతని జోరుకు బ్రేకులు వేయాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్‌లో లియామ్ లివింగ్‌స్టొన్‌ను త్వరగా అవుట్ చేసినట్టే- బట్లర్‌ కోసం అదే స్కెచ్ వేసింది.

మిడిలార్డర్‌లో హిట్టర్..

మిడిలార్డర్‌లో హిట్టర్..

రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. ఓపెనర్ దేవ్‌దత్ విఫలమైతే.. బట్లర్‌తో కలిసి మిగిలిన బ్యాటర్లు జట్టు ఇన్నింగ్‌ను రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్నారు. సంజు శాంసన్, హిట్టర్ షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. క్రీజ్‌లో నిలదొక్కుకోగలుగుతున్నారు. ఫలితంగా- అంచనాలకు మించి రాణిస్తోంది పింక్ టీమ్. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని భావిస్తోంది.

 తుదిజట్టు కూర్పు ఇలా..

తుదిజట్టు కూర్పు ఇలా..

ఢిల్లీ టీమ్‌లో- పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (కేప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రౌమన్ పావెల్/కేఎస్ భరత్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. రాయల్స్‌లో జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టన్, వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయిర్, కరుణ్ నాయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కే, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్ ఆడొచ్చు.

Story first published: Friday, April 22, 2022, 7:22 [IST]
Other articles published on Apr 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X