న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

second half best bowling teams: ఐపీఎల్ సెకండాఫ్‌లో బెస్ట్ బౌలింగ్ జట్లు ఏవో చెప్పిన జాఫర్, నిఖిల్ చోప్రా

IPL 2022: best bowling attack teams in ipl second half, predict by nikhil chopra, wasim jaffer

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2022లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. సీజన్ తొలి అర్ధభాగంలో పిచ్‌లు పేసర్లకు బాగా అనుకూలించాయి. దీంతో తొలుత టాస్ గెలిచిన జట్లు బౌలింగ్ ఎంచుకోవడానికే మొగ్గుచూపాయి. రెండో ఇన్నింగ్స్‌లో మంచు కారణంగా పేస్ దెబ్బతింటుందని జట్లు అంచనా వేశాయి. దీంతో ఛేజింగ్‌కు ఎక్కుగా ప్రిఫరెన్స్ ఇచ్చాయి. అయితే ఎండాకాలం ముదిరినందున అవుట్‌ఫీల్డ్‌లు పొడిగా మారడంతో పాటు.. పిచ్‌లలో ప్యాచ్‌లు రావడం స్పిన్నర్లకు కలిసొస్తాయి. దీంతో టాస్ గెలిచిన జట్లు బౌలింగ్, బ్యాటింగ్ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు నిఖిల్ చోప్రా, వసీం జాఫర్ సీజన్ సెకండాఫ్‌లో బౌలింగ్లో మరింత మెరుగ్గా రాణించగల జట్లను ఎంపిక చేశారు. నిఖిల్ చోప్రా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌లను బెస్ట్ సెకండాఫ్ బౌలింగ్ జట్లుగా పేర్కొన్నాడు. పేసర్లు, స్పిన్నర్లతో కూడిన బలమైన బౌలింగ్ జట్టుగా రాజస్థాన్ రాయల్స్‌ను పేర్కొన్నాడు. ఆర్‌సీబీపై రాజస్థాన్ రాయల్స్ తమ తక్కువ స్కోరు 144ను కూడా డిఫెండ్ చేసుకోవడం అసాధారణమైన బౌలింగ్ ప్రదర్శనకు నిదర్శనమని భావిస్తున్నట్లు తెలిపాడు.

పేస్ బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ఒబెడ్ మెక్ కాయ్, ప్రసీద్ క్రిష్ణ లాంటి నాణ్యమైన బౌలింగ్ అటాక్ ఉండగా.. ఇప్పటికే ఈ సీజన్ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి సమర్థులైన స్పిన్నర్లు ఉండడం ఆర్ఆర్ బౌలింగ్‌ను దుర్భేద్యంగా చేస్తుందన్నాడు.

IPL 2022: best bowling attack teams in ipl second half, predict by nikhil chopra, wasim jaffer

ఇక జాఫర్ మాట్లాడుతూ.. ఆర్సీబీపై 144పరుగులను డిఫెన్స్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఈ సెకండాఫ్‌లో బలమైన బౌలింగ్ జట్టుగా పేర్కొన్నాడు. జాఫర్ సెకండాఫ్‌లో బెస్ట్ బౌలింగ్ జట్లుగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌లను పేర్కొన్నాడు. వరుణ్ చక్రవర్తి సెకండాఫ్‌లో ఫామ్‌ అందుకుని సునీల్ నరైన్‌తో కలిసి కేకేఆర్‌కు బెస్ట్ ఇవ్వగలడని అభిప్రాయపడ్డాడు. పిచ్‌లు క్రమంగా స్పిన్నర్లకు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకోవడం సన్ రైజర్స్‌కు గుడ్ న్యూస్ అని తెలిపాడు.

నిఖిల్ చోప్రా ఎంచుకున్న సెకండాఫ్ బెస్ట్ బౌలింగ్ టీమ్స్ : రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్
వసీం జాఫర్ ఎంచుకున్న సెకండాఫ్ బెస్ట్ బౌలింగ్ టీమ్స్ : రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్

Story first published: Thursday, April 28, 2022, 9:46 [IST]
Other articles published on Apr 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X