న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RCB: విరాట్ కోహ్లీ ఆవేశం.. మ్యాచ్ రిఫరీ మందలింపు! అసలేంజరిగిందంటే?

IPL 2021: Virat Kohli warned by Match Referee for IPL code of conduct breach in RCB vs SRH match

చెన్నై: బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశ శతకం చేయగా.. విరాట్‌ కోహ్లీ (33) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో హోల్డర్‌ 3, రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకు పరిమితమైంది. డేవిడ్‌ వార్నర్‌ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌సెంచరీ సాధించగా.. మనీశ్‌ పాండే (38) రాణించాడు.

హైదరాబాద్‌ స్పిన్నర్లు విజృంభించడంతో

హైదరాబాద్‌ స్పిన్నర్లు విజృంభించడంతో

ఈ మ్యాచులో బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. ఐపీఎల్‌ నియమావళిని ఉల్లంఘించడమే ఇందుకు కారణం. టాస్‌ ఓడి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. కరోనా నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (11) ఆరంభంలోనే ఔట్‌ కాగా.. పించ్‌ హిట్టర్‌గా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌ (14) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ దశలో కోహ్లీకి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ తోడవడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ సజావుగా సాగింది. అయితే హైదరాబాద్‌ స్పిన్నర్లు విజృంభించడంతో వేగంగా పరుగులు రాలేకపోయాయి.

కుర్చీని తన్నేశాడు

కుర్చీని తన్నేశాడు

స్కోరు వేగం పెంచే క్రమంలో జేసన్ హోల్డర్‌ వేసిన 12.1వ బంతిని విరాట్ కోహ్లీ భారీ షాట్‌ ఆడాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి గాల్లోకి లేచింది. లాంగ్‌ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌ విజయ్‌ శంకర్‌ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి.. డైవ్‌ చేసి ఆ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఔటైన ఆవేశంలో డగౌట్‌కు చేరుకునే క్రమంలో కోహ్లీ.. అడ్వర్టైజ్‌మెంట్‌ కుషన్ (బౌండరీ లైన్)‌, కుర్చీని తన్నేశాడు. అతడు ఐపీఎల్‌ నియమావళిలోని లెవల్‌ 1, 2.2 నిబంధనలను ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. దాంతో రిఫరీ వెంగలిల్‌ నారాయణ్‌ కుట్టీ.. కోహ్లీని మందలించాడు.

గౌతీకి మ్యాచు ఫీజులో 15% కోత

గౌతీకి మ్యాచు ఫీజులో 15% కోత

2016లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌.. విరాట్ కోహ్లీ లాగే చేయడంతో మ్యాచ్ రిఫరీ గౌతీని హెచ్చరించాడు. అంతేకాదు అతడి మ్యాచు ఫీజులో 15% కోత కూడా విధించాడు. అయితే ఇప్పుడు కోహ్లీని రిఫరీ వెంగలిల్‌ నారాయణ్‌ కుట్టీ కేవలం మందలింపుతో సరిపెట్టాడు. ఈ మ్యాచులో కోహ్లీ 29 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 33 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో‌ కూడా కోహ్లీ టాప్‌లో ఉన్నాడు.

SRH vs RCB: బీసీసీఐ డైరీస్‌లో.. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద కుంభకోణం విజయ్ శంకరే!!

Story first published: Thursday, April 15, 2021, 9:00 [IST]
Other articles published on Apr 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X