న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RCB: బీసీసీఐ డైరీస్‌లో.. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద కుంభకోణం విజయ్ శంకరే!!

IPL 2021, SRH vs RCB: Vijay Shankar is the biggest scam ever happened in BCCI diaries

హైదరాబాద్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021‌లో శుభారంభాన్ని అందుకోలేకపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులతో ఓటమిపాలై అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. సన్‌రైజర్స్‌ పరాజయానికి కారణం స్వయంకృతాపరాధమే. లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోతున్న దశలో అనవసరంగా వికెట్లు పారేసుకుని మూల్యం చెల్లించుకుంది. మిడిలార్డర్‌ ముంచడంతో వార్నర్‌ సేనకు సీజన్‌లో వరుసగా రెండో పరాజయం తప్పలేదు.

విజయ్ శంకర్ విఫలం

విజయ్ శంకర్ విఫలం

ఆల్‌రౌండర్‌గా బాధ్యతాయుతంగా ఆడాల్సిన స్థితిలో టీమిండియా ప్లేయర్ విజయ్ శంకర్.. తక్కువ పరుగులకే పెవిలిన్ చేరాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 17వ ఓవర్లో 5 వికెట్లను 116 పరుగులు చేసింది. ఇక చివరి మూడు ఓవర్లలో 36 పరుగులు చేయాలి. ఈ దశలో విజయ్ శంకర్ భారీ షాట్లు ఆడాల్సి ఉంది. కానీ సింగిల్స్ తీస్తూ.. రన్‌రేట్‌ను మరింత పెంచాడు. 18వ ఓవర్‌ చివరికి బంతికి హర్షల్‌ పటేల్ అతడిని పెవిలియన్ చేర్చాడు. ఐదు బంతులు ఆడి కేవలం మూడు పరుగులే చేశాడు. ఆపై హోల్డర్, రషీద్, నదీమ్ ఔట్ అవ్వడంతో గెలిచే మ్యాచును సన్‌రైజర్స్ ఓడిపోయింది.

రాయుడు 3డీ గ్లాస్‌లో చూస్తున్నాడు

ఐపీఎల్ 2020లో విజయ్ శంకర్ రాణించని విషయం తెలిసిందే. గత రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచులో కూడా కీలక సమయంలో ఔట్ అయ్యాడు. దీంతో నెటిజన్లు విజయ్ శంకర్‌పై ఫన్నీ మీమ్స్, జోక్స్ ట్రెండ్ చేస్తున్నారు. 2019 ప్రపంచకప్ ప్రస్తావననను కూడా తెచ్చారు. '2019 ప్రపంచకప్ కోసం విజయ్ శంకర్‌ను బీసీసీఐ ఎలా సెలెక్ట్ చేసింది. అంబటి రాయుడు మంచి కెరీర్‌ను నాశనం చేశారు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'బీసీసీఐ డైరీస్‌లో.. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద కుంభకోణం విజయ్ శంకరే' అని మరొకరు ట్వీట్ చేశారు. '3డీ ఆటగాడైన నువ్వు ఇలా ఆడితే ఎలా', 'అంబటి రాయుడు 3డీ గ్లాస్‌లో నీ ఆటను చూస్తున్నాడు' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

రాయుడును కాదని

2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో తెలుగు తేజం అంబటి రాయుడిని కాదని ఎమ్మెస్కే ప్రసాధ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్.. త్రీడైమన్షన్ నేపథ్యంలోనే అతని ఎంపిక చేశామని అప్పట్లో ఎమ్మెస్కే వివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై రాయుడు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిచండంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. ఆ ప్రపంచకప్‌లో విజయ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేక భారత్ ఇంటిదారి పట్టింది. దీంతో రాయుడుని ఎందుకుతీసుకోలేదని ఎమ్మెస్కేతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు రోస్ట్ చేశారు. తాజాగా శంకర్ విఫలమవడంతో మరోసారి అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఆఖర్లో తడబడి

ఆఖర్లో తడబడి

షాబాజ్‌ అహ్మద్‌ (3/7), మొహ్మద్ సిరాజ్‌ (2/25), హర్షల్‌ పటేల్‌ (2/25) విజృంభించడంతో బుధవారం బెంగళూరు 6 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. గెలుపు ముంగిట సన్‌రైజర్స్‌ అనూహ్యంగా బోల్తా కొట్టింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (59; 41 బంతుల్లో 5×4, 3×6), విరాట్ కోహ్లీ (33; 29 బంతుల్లో 4×4) రాణించడంతో మొదట బెంగళూరు 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్‌ (3/30), రషీద్‌ ఖాన్‌ (2/18), భువనేశ్వర్‌ కుమార్ (1/30) రాణించారు. డేవిడ్ వార్నర్‌ (54; 37 బంతుల్లో 7×4, 1×6), మనీష్‌ పాండే (38; 39 బంతుల్లో 2×4, 2×6) రాణించడంతో సన్‌రైజర్స్‌ గెలుపు బాటలో పయనించినా.. ఆఖర్లో తడబడింది. 9 వికెట్లకు 143 పరుగులే చేసింది.‌

అవినీతి ఆరోపణలు.. మాజీ కెప్టెన్‌పై ఎనిమిదేళ్ల నిషేధం!!

Story first published: Thursday, April 15, 2021, 8:16 [IST]
Other articles published on Apr 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X