న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs RR:టాస్ గెలిచినా.. ఆప్షన్ చెప్పకుండా వెనక్కివెళ్లిన కోహ్లీ! అయ్యో.. నేనే గెలిచా కదా అంటూ(వీడియో)!

IPL 2021: Virat Kohli reaction after winning the toss vs RR Will Make You Laugh
IPL 2021,RCB VS RR: 'Hey I Won The Toss'- Virat Kohli Involved in Hilarious Incident| OneindiaTelugu

ముంబై: ఐపీఎల్ 2021‌లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో కోహ్లీసేన బరిలోకి దిగింది. పటిదార్‌ స్థానంలో కైల్‌ రిచర్డ్‌సన్‌ను తీసుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. మరోవైపు జయదేవ్‌ ఉనద్కత్‌ స్థానంలో శ్రేయస్‌ గోపాల్‌ను ఎంపిక చేసినట్లు సంజు శాంసన్‌ వెల్లడించాడు. అయితే ఈ మ్యాచులో టాస్ వేసే సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

DC vs MI: సెహ్వాగ్‌ భాయ్‌.. ఇప్పుడైనా నా జీతం కాస్త పెంచండి! వేడుకున్న అమిత్ మిశ్రా!DC vs MI: సెహ్వాగ్‌ భాయ్‌.. ఇప్పుడైనా నా జీతం కాస్త పెంచండి! వేడుకున్న అమిత్ మిశ్రా!

కోహ్లీ ఏమరపాటు:

కోహ్లీ ఏమరపాటు:

ఇయన్ బిషప్ సమక్షంలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాజస్థాన్‌ సారథి సంజు శాంసన్ టాస్ వేయడానికి మైదానానికి వచ్చారు. కోహ్లీ కాయిన్‌ను గాల్లోకి వేయగా.. శాంసన్ తన ఆప్షన్ చెప్పాడు. టాస్ గెలిచిన కోహ్లీ.. మొదట తాను టాస్ ఓడిపోయినట్లు భావించి సంజుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి వెళ్లాడు. దాంతో సంజు ముందుకు వచ్చి తన నిర్ణయం ప్రకటించబోయాడు. ఇంతలోనే తన తప్పిదాన్ని గ్రహించిన కోహ్లీ.. రియాక్ట్ అయ్యి నవ్వుకుంటూ ముందుకు వచ్చాడు. అయ్యో.. టాస్ నేనే గెలిచా కదా అంటూ ముందుకువచ్చి సంజు దగ్గరి మైక్ అందుకుని.. తాము బౌలింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు.

టాస్ గెలవడం నాకు అలవాటు లేదు:

టాస్ గెలవడం నాకు అలవాటు లేదు:

టాస్ గెలిచినా అలా వెళ్లిపోయావ్ ఏంటి విరాట్ కోహ్లీ అని ఇయన్ బిషప్ సరదాగా అడిగాడు. 'నేను టాస్ గెలిచా? అని అనుకోలేదు. ఎందుకంటే.. టాస్ గెలవడం నాకు అలవాటు లేదు' అని కోహ్లీ నవ్వుతూ బదులిచ్చాడు. ఆపై సంజు శాంసన్ వచ్చి ఓ ముసిముసి నవ్వు నవ్వి.. ఉనద్కత్‌ స్థానంలో గోపాల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు. ఈ సరదా ఘటన చూసిన మైదానంలోని వారు నవ్వు ఆపుకోలేకపోయారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఆలస్యం ఎందుకు మీరూ చూసి హాయిగా నవ్వుకోండి.

 మూడు మ్యాచ్‌ల్లో విజయం:

మూడు మ్యాచ్‌ల్లో విజయం:

ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) అన్నింటిలోనూ విజయం సాధించింది. ఐపీఎల్‌ చరిత్రలో బెంగళూరు ఒక సీజన్‌లో మొదటి మూడు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఐపీఎల్‌ 2014 సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ విజయం సాధించింది. గత సీజన్లలో జట్టులో స్టార్ ఆటగాళ్లున్నా.. వారికి శుభారంభాలు దక్కలేదు. ఈసారి గ్లెన్‌ మాక్స్‌వెల్ రాకతో విజయాల బాట పట్టింది.

ఆదిలోనే ఎదురు దెబ్బ:

ఈ మ్యాచ్‌లో రాయల్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మహ్మద్‌ సిరాజ్‌ సూపర్ బంతులతో తన వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టాడు. మూడో ఓవర్లో జోస్‌ బట్లర్ ‌(8)ను బౌల్డ్‌ చేసిన సిరాజ్‌.. ఐదో ఓవర్లో డేవిడ్‌ మిల్లర్‌ను (0) పెవిలియన్‌ పంపాడు. కైల్ జేమీసన్‌ కూడా నాలుగో ఓవర్లో మనన్‌ వోహ్రా (7)ను ఔట్‌ చేశాడు. దీంతో రాజస్థాన్‌ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ సంజూ శాంసన్ (12)‌ నిలకడగా ఆడుతున్నాడు. మరో ఎండ్‌లో శివమ్‌ దూబే (4) ఉన్నాడు. పవర్‌ప్లే ఆఖరికి రాజస్థాన్‌ 3 వికెట్లకు 32 పరుగులు చేసింది.

Story first published: Thursday, April 22, 2021, 20:31 [IST]
Other articles published on Apr 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X