IPL 2021: మేం కప్పు కొట్టడం.. ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టు ఉంది! అందుకే ఇలా?!

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కష్టకాలంలో కూడా క్రికెట్ అభిమానుల‌ను అలరించిన ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ఊహించని రీతిలో నిరవధికంగా వాయిదా పడింది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది.

IPL 2021ను నిర్వహించిన బీసీసీఐకి 1000 కోట్లు జరిమానా విధించండి! లాభాలను కూడా పంచేయండి!

ఐదు విజయాలతో మూడో స్థానంలో:

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరింటిలో గెలుపొంది 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రతి ఏడాది సీజన్ ఆరంబంలో తడబడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఐపీఎల్ 2021లో దూసుకుపోయింది. ఆరంభంలో వరుస విజయాలు అందుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన కోహ్లీసేన ఐదు విజయాలు అందుకుని 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.

దేవుడికి కూడా ఇష్టం లేనట్టు ఉంది:

దేవుడికి కూడా ఇష్టం లేనట్టు ఉంది:

ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు చూసి కప్పు తమదే (ఈ సాలా కప్‌ నమ్‌దే) అని ఆ జట్టు అభిమానులు కలలు కన్నారు. ఐపీఎల్ 2021 రద్దవడంతో వారి ఆశలు అన్ని ఆవిరయ్యాయి. దీంతో సోష‌ల్ మీడియాలో ఫ‌న్నీ మీమ్స్ క్రియేట్ చేసి బెంగళూరు ఫాన్స్ తమ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన 'మన్మథుడు' సినిమా డైలాగ్‌ను కాపీ కొట్టిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మేం కప్పు కొట్టడం.. ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టు ఉంది' అని బెంగళూరు ఫాన్స్ అంటున్నారు. 'విరాట్ కోహ్లీ.. ఇక నీ తలరాత మారదు', 'బెంగళూరు ఇక కప్ కొట్టదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.'ఇప్పుడెలా టైంపాస్ చేయాల‌ని ఒక‌రు, మా ఆత్మాభిమానాన్నే లాగేసుకున్నార‌ని మ‌రొక‌రు ట్వీట్స్ చేస్తున్నారు.

ఒక్క టైటిల్‌ కూడా లేదు:

ఆర్‌సీబీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్‌ కొట్టలేకపోయింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వం కూడా ఆ జట్టు తలరాతను మార్చడం లేదు. ప్రతిసారి 'ఈ సాలా కప్‌ నమ్‌దే' అంటూ టోర్నీలో బరిలోకి దిగడం, పూర్తిగా నిరాశపరచడం బెంగళూరుకు ఓ అలవాటుగా మారింది. అయినా సరే ఆర్‌సీబీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌​ సీజన్‌లో ఫ్లేఆఫ్‌ వరకు వెళ్లి ఇంటి బాట పట్టింది. లీగ్ మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ సేన.. కీలకమైన ఫ్లేఆఫ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఈసారి అద్భుత ఫామ్‌లో ఉన్న ఆర్‌సీబీని కరోనా అడ్డుకుంది.

పలువురు ఆటగాళ్లకు కరోనా:

రెండు రోజులుగా ఐపీఎల్‌లోని పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహాకు కరోనా నిర్ధారణ కావడంతో ఆ జట్టు ఆటగాళ్లు ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కూడా కరోనా బారినపడ్డాడు. ఇక ఢిల్లీ మైదానంలో సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కోల్‌కతా ఆటగాళ్లు వరణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లకు ఆదివారం చేసిన పరీక్షల్లో కరోనా నిర్ధరణ అయింది. బయో బబుల్‌లో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజా సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 4, 2021, 16:34 [IST]
Other articles published on May 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X