న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RCB: చెలరేగిన గిల్, అయ్యర్.. కేకేఆర్ సునాయాస విజయం!!

IPL 2021: Shubman Gill 48, Venkatesh Iyer 41 runs helps KKR beat RCB

అబుదాబి: అబుదాబి వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్) 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఆర్‌సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (48; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (41; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. దాంతో ఐపీఎల్ 2021 రెండో దశను కోల్‌కతా ఘనంగా ఆరంబించింది. బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఒక వికెట్ పడగొట్టాడు.

దంచికొట్టిన ఓపెనర్లు:

దంచికొట్టిన ఓపెనర్లు:

స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఆడుతూ పాడుతూ ల‌క్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు శుభ్‌మ‌న్ గిల్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్ ఎక్కడా తడబడలేదు. ఇద్దరూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై విరుచుకుపడడ్డారు. ముఖ్యంగా గిల్‌ బెంగళూరు బౌలర్లను ఆటాడుకున్నాడు. వరుస బౌండరీలతో కోల్‌కతా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే గిల్‌, అయ్య‌ర్ 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే హాఫ్ సెంచరీకి చేరువైన గిల్.. 48 పరుగుల వద్ద యుజ్వేంద్ర చహల్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. గిల్ అనంతరం అయ్యర్ రెచ్చిపోయాడు. మూడు బౌండరీలు బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోకి వచ్చింది. వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఆరంభంలోనే భారీ షాక్‌:

ఆరంభంలోనే భారీ షాక్‌:

అంతకుముందు బెంగళూరు 19 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరుకు రెండో ఓవర్‌లోనే భారీ షాక్‌ తగిలింది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీకర్‌ భరత్‌ (16)తో కలిసి దేవదత్‌ పడిక్కల్‌ ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే లూకీ ఫెర్గూసన్‌ వేసిన ఆరో ఓవర్‌లో చివరి బంతికి దినేశ్‌ కార్తీక్‌కి క్యాచ్‌ ఇచ్చి పడిక్కల్‌ ఔటయ్యాడు. తర్వాత ఆర్‌సీబీ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. ఒక్కరు కూడా క్రీజులో నిలవలేకపోయారు.

చక్రవర్తి మాయ:

చక్రవర్తి మాయ:

ఆండ్రీ రస్సెల్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో కేఎస్ భరత్ (16), ఏబీ డివిలియర్స్‌ (0)లు ఔటయ్యారు. ఈ క్రమంలో 10 ఓవర్లకు ఆర్‌సీబీ 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేసింది. ఇక వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్‌లో హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ (10), వనింద హసరంగ (0) పెవిలియన్‌ చేరారు. కైల్‌ జేమీసన్‌ (4), సచిన్‌ బేబీ (7) కూడా త్వరగానే ఔట్ అయ్యారు. హర్షల్‌ పటేల్‌ (12) రెండు ఫోర్లు బాది ఫెర్గూసన్‌ వేసిన 17వ ఓవర్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఇక మొహ్మద్ సిరాజ్‌ (8)ని రసెల్ ఔట్ చేశాడు. దాంతో ఆర్‌సీబీ 92 పరుగులకు ఆలౌట్ అయింది. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ మూడు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్‌ రెండు, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక వికెట్‌ తీశారు.

Story first published: Monday, September 20, 2021, 23:00 [IST]
Other articles published on Sep 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X