న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021లో చెన్నైని నడిపించేది అతనే.. సారథిగా ధోనీ ఉండడు: టీమిండియా బ్యాటింగ్ కోచ్

 IPL 2021: Sanjay Bangar says I feel that MS Dhoni may not be the captain next year
MS Dhoni May Not Be The Captain Next Year - Sanjay Bangar

న్యూజిలాండ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఫాఫ్ డుప్లెసిస్ నడిపిస్తాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు.
ఆ టీమ్ ప్రస్తుత సారథి మహేంద్రసింగ్‌ ధోనీనే జట్టు పగ్గాలను డుప్లెసిస్‌కు అప్పగించి అతని కెప్టెన్సీలో ఆడుతాడని బంగర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇర్ఫాన్‌ పఠాన్‌తో కలిసి స్టార్ స్పోర్ట్స్ 'క్రికెట్‌ కనెక్టెడ్' షోలో మాట్లాడిన బంగర్.. తర్వాతి సీజన్‌లో ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తాడా? అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చాడు. అంతకుముందు ఇర్ఫాన్ పఠాన్‌ స్పందిస్తూ ఇప్పటికైతే తానేమీ అలాంటివి ఊహించడం లేదని స్పష్టం చేశాడు.

'నాకైతే అలాంటి ఆటగాళ్లెవరూ కనిపించడం లేదు. తర్వాతి సీజన్‌కు మరికొద్ది నెలల సమయమే ఉండడంతో ధోనీ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో తిరిగొస్తాడని భావిస్తున్నా. ఐపీఎల్‌ కన్నా ముందే పలు మ్యాచ్‌లు ఆడుతాడని ఆశిస్తున్నా. ఎందుకంటే ఏ ఆటగాడికైనా అదెంతో అవసరం. ధోనీ గొప్ప ఆటగాడు కాబట్టి అతన్ని మళ్లీ చూడాలనుకుంటున్నా' అని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు.

ఆపై బంగర్‌ మాట్లాడుతూ 2011 తర్వాత టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ధోనీ భావించి ఉంటాడని, అప్పుడు సరైన వ్యక్తి లేకపోవడంతోనే కొన్నేళ్ల పాటు కొనసాగాడని చెప్పాడు. సరైన సమయంలో కోహ్లీకి అప్పగించాక అతడి సారథ్యంలో ఆడినట్లు గుర్తుచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోనూ వచ్చే ఏడాది డుప్లెసిస్‌కు బాధ్యతలు అప్పగించి సాధారణ ఆటగాడిగా కొనసాగే అవకాశం ఉందన్నాడు. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన ధోనీసేన ఎన్నడూ లేని విధంగా లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌ చేరకుండా వైదొలగడం చెన్నై జట్టుకు ఇదే తొలిసారి.

యువరాజ్ న్యూ లుక్ వైరల్.. 'హాయ్ అందగాడా'అంటూ బ్రిటీష్ బ్యూటీ కామెంట్!యువరాజ్ న్యూ లుక్ వైరల్.. 'హాయ్ అందగాడా'అంటూ బ్రిటీష్ బ్యూటీ కామెంట్!

Story first published: Friday, November 13, 2020, 18:04 [IST]
Other articles published on Nov 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X