న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: వైఫై సౌకర్యం ఏమాత్రం బాలేదు.. జియో or ఎయిర్‌టెల్‌లో ఏది బాగుంటుంది: సామ్‌

IPL 2021: Sam Billings asks Indian fans suggestions over WiFi

ముంబై: ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది. ఒక్క మ్యాచ్ కూడా తన సొంత మైదానంలో ఆడే అవకాశం ఏ జట్టుకూ లేదు. టోర్నీలో మ్యాచ్‌లను అన్ని జట్లూ తటస్థ వేదికల్లోనే ఆడనున్నాయి. ఇక ఐపీఎల్‌ కోసం రన్నరఫ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ ప్రాక్టీస్ కోసం ముంబైకు చేరింది.

ఇంగ్లండ్ ప్లేయర్ సామ్‌ బిల్లింగ్స్‌ టీమిండియాతో సిరీస్‌ ముగిసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిశాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టు ముంబైలోని తాజ్‌మహల్‌ ప్యాలెస్‌లో బస చేస్తోంది. తాజ్‌మహల్‌నే బిల్లింగ్స్‌ ఉంటున్నాడు. ఆ హోటల్‌లో వైఫై సౌకర్యం ఏమాత్రం బాలేదని, తనకు సాయం చేయండి అంటూ బిల్లింగ్స్‌ ట్వీట్ చేశాడు. 'హోటల్‌ రూంలో వైఫై సౌకర్యం బాలేదు. ఇండియాలో వేగంగా ఉండే ఒక వైఫై డాంగిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నా. అందుకు మీరిచ్చే సూచనలు చాలా అవసరం. సాయం చేయండి ప్లీజ్' అని ట్వీటాడు.

సామ్‌ బిల్లింగ్స్‌ చేసిన ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది. ఈ ట్వీటుకు నెటిజన్లు స్పందించారు. ఇండియాలో ఉన్న వైఫై సౌకర్యం కల్పిస్తున్న కంపెనీలతో పాటు వాటి ధరలను బిల్లింగ్స్‌కు షేర్‌ చేశారు. వాటిలో జియో, ఎయిర్‌టెల్‌ అత్యధిక సార్లు రిపీట్‌ అయ్యాయి. జియో లేదా ఎయిర్‌టెల్‌లో ఏది బాగుంటుందని బిల్లింగ్స్‌ మరో ట్వీట్ చేశాడు. ఎక్కువమంది జియోకు ఓటు వేశారు. 'నేను జియో డాంగిల్‌ను కొంటున్నా. నాకు స్పందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేశాడు. టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో బిల్లింగ్స్‌ ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 10న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో ఆడనుంది. ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లండ్ సిరీస్‌లో గాయపడ్డ విషయం తెలిసిందే. వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ను ఢిల్లీ యాజమాన్యం సారథిగా ప్రకటించింది. 'శ్రేయస్‌ ఐపీఎల్‌కు దూరమవ్వడం దురదృష్టకరం. పంత్ తనకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడని భావిస్తున్నా. తాజా ప్రదర్శనలు, మొక్కవోని ఆత్మవిశ్వాసం దృష్ట్యా నాయకత్వం చేపట్టేందుకు అతడు అర్హుడు. సారథ్యం పంత్‌ను మరింత మెరుగైన ఆటగాడిగా మారుస్తుందని అనుకుంటున్నా' అని కోచ్ రికీ పాంటింగ్‌ ట్వీట్‌ చేశాడు.

IPL 2021: చహల్‌ భార్యతో ధావ‌న్.. ఇద్దరూ ఇరగదీశారుగా (వీడియో)!!IPL 2021: చహల్‌ భార్యతో ధావ‌న్.. ఇద్దరూ ఇరగదీశారుగా (వీడియో)!!

Story first published: Wednesday, March 31, 2021, 16:05 [IST]
Other articles published on Mar 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X