న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs PBKS: 'జోస్ బట్లర్‌తో ఎందుకు ఓపెనింగ్‌ చేయించలేదు.. అసలు మీరేం ఆలోచిస్తున్నారు'

IPL 2021, RR vs PBKS: Michael Vaughan questions Rajasthan Royals tactics of using Jos Buttler

ముంబై: వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్స్‌మెన్‌ జోస్‌ బట్లర్‌ సేవలను రాజస్తాన్‌ రాయల్స్‌ సరిగా వినియోగించుకోలేకపోయిందని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత మైకేల్‌ వాన్‌ విమర్శించాడు. ఎంతో అనుభవం ఉన్న బట్లర్‌కు కీపింగ్‌ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో భాగంగా సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని చవిచూసింది.

రాజస్తాన్‌ రాయల్స్ జట్టు కూర్పు గురించి ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. 'వికెట్‌ కీపర్, ఓపెనర్‌గా జోస్‌ బట్లర్‌కు‌ మంచి అనుభవం ఉంది. అలాంటి ఆటగాడిని ఎందుకు కీపర్‌ స్థానంలో తీసుకోలేదు. అంతేకాదు అతడితో ఎందుకు ఓపెనింగ్‌ చేయించలేదు. అసలు మీరేం ఆలోచిస్తున్నారు' అంటూ రాజస్తాన్‌ జట్టు తీరుపై విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు వాన్ రెండు ట్వీట్లు చేశాడు. ఈ మ్యాచులో కెప్టెన్‌ సంజు శాంసన్ వికెట్‌ కీపర్‌గా బరిలోకి దిగగా.. బెన్ ‌స్టోక్స్‌, మనన్‌ వోహ్రా ఓపెనింగ్‌ చేశారు.

గత రెండు సీజన్లలో రాజస్తాన్‌ రాయల్స్ తరఫున జోస్‌ బట్లర్‌ ఓపెనింగ్‌ చేశాడు. భారీ పరుగులు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌ తరఫున అతడు టీ20ల్లో ఓపెనింగ్‌ చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ జట్టుకు వికెట్‌ కీపర్‌గానూ సేవలందిస్తున్నాడు. అయితే పంజాబ్ మ్యాచులో బట్లర్‌ వికెట్‌ కీపర్‌గానూ చేయలేదు, ఓపెనర్‌గా రాలేదు. స్టోక్స్‌ పరుగులేమీ చేయకుండానే షమీ బౌలింగ్‌లో వెనుదిరగగా.. వోహ్రా కేవలం 12 పరుగులు చేశాడు. అందుకే వాన్ మండిపడ్డాడు.

జోస్ బట్లర్ ఐపీఎల్ 2021 సీజన్‌లో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే వరుస బౌండరీలతో హోరెత్తించాడు. 222 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 3.2 ఓవర్లలోనే 25/2తో నిలిచింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బట్లర్.. నాలుగు వరుస బౌండరీలు బాదాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన యువ పేసర్ రిలే మెరాడిత్ బౌలింగ్‌లో బట్లర్ (25: 13 బంతుల్లో 5x4) వరుసగా 4, 4, 4, 4 బాదేశాడు. దీంతో ఐపీఎల్ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న మెరాడిత్ తల పట్టుకున్నాడు. అయితే బట్లర్ మెరుపులు ఆ ఒక్క ఓవర్‌కే పరిమితయ్యాయి. జే రిచర్డ్సన్ వేసిన 8వ ఓవర్ మూడో బంతికి బోల్ట్ అయ్యాడు.

RR vs PBKS: ఆ బంతితోనే.. శాంసన్‌ సిక్సర్ కొట్టకుండా కట్టడి చేశా: అర్షదీప్‌RR vs PBKS: ఆ బంతితోనే.. శాంసన్‌ సిక్సర్ కొట్టకుండా కట్టడి చేశా: అర్షదీప్‌

Story first published: Tuesday, April 13, 2021, 13:15 [IST]
Other articles published on Apr 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X