న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Steve Smith అంత తక్కువ ధరకు లభిస్తాడనుకోలేదు.. ఈ సీజన్‌లో అతను చెలరేగుతాడు: రికీ పాంటింగ్

IPL 2021: Ricky Ponting says I’m not really sure how we got Steve Smith so cheap
IPL 2021 : Ricky Ponting 'not Sure' How Delhi Got Steve Smith 'So Cheap'

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, వెటరన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అంత తక్కువ ధరకే తమ జట్టుకు సొంతమవుతాడని అస్సలు ఊహించలేదని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్, ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ అన్నాడు. ప్రస్తుతం స్మిత్ పరుగుల ఆకలితో ఉన్నాడని, అతను ఐపీఎల్‌-2021 సీజన్‌లో దుమ్మురేపుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత సీజన్‌లో స్మిత్ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా దారుణంగా విఫలమ్యాడు. అతని సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ గతేడాది 14 మ్యాచ్‌లాడి 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

14 మ్యాచ్‌ల్లో 311 పరుగుల చేసిన స్మిత్‌ బ్యాట్స్‌మన్‌గానూ ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రూ.12.4 కోట్ల భారీ ధరకు తీసుకున్న రాజస్థాన్ స్మిత్‌పై వేటు వేసింది. యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌ను తమ నూతన సారథిగా నియమించింది.

టాపార్డర్‌లో..

టాపార్డర్‌లో..

దాంతో ఈ సీజన్ వేలంలోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌ను ఆశ్చర్యకరంగా ఢిల్లీ క్యాపిటల్స్ అతని కనీస ధర రూ.2 కోట్లకు మరో 20 లక్షలు ఎక్కువగా చెల్లించి(రూ.2.2 కోట్లు) సొంతం చేసుకుంది. అతని కోసం ఆరంభంలో ఆర్‌సీబీ పోటి పడినా చివర్లో తప్పుకుంది. దాంతో స్మిత్ తక్కువ ధరకే ఢిల్లీకి సొంతమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్ క్రికెట్.కామ్ ఏయూతో మాట్లాడిన పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో అతను టాప్-3లో ఆడుతాడని, అయితే టీమ్ కాంబినేషన్స్ బట్టి అతనికి తుది జట్టులో ఎక్కువగా అవకాశాలు రాకపోవచ్చన్నాడు.

మెగా వేలం ఉంది కాబట్టి..

మెగా వేలం ఉంది కాబట్టి..

'ఇంత తక్కువ ధరకే మేం స్మిత్‌ను దక్కించుకుంటామని అనుకోలేదు. సుదీర్ఘ కాలంగా అతన్ని కొనసాగించిన ఫ్రాంఛైజీ ఈ సీజన్‌లో వదులుకుంది. ప్రస్తుతం అతను ఆట మీద కసితో ఉన్నాడు. ఈసారి కచ్చితంగా పరుగుల వరద పారిస్తాడు. వచ్చే ఏడాది మెగా వేలం ఉంటుందన్న సంగతి తనకు తెలుసు. కాబట్టి ఈ సీజన్‌లో బాగా రాణిస్తే, తనను కొనుగోలు చేసేందుకు భవిష్యత్తులో పెద్దమొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందనే విషయం అతనికి తెలుసు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

స్మిత్ సేవలు..

స్మిత్ సేవలు..

ఇక వేలం జరుగుతున్న సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానన్న పాంటింగ్‌... 'ఫ్రాంఛైజీ యజమానులతో ఆరోజు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంతలో స్మిత్‌ కోసం బిడ్‌ వేసినట్లు తెలిసింది. వెనువెంటనే డీసీ అతన్ని కొనుగోలు చేసిందనే ప్రకటన కూడా వెలువడింది. స్మిత్‌ అనుభవం, తన క్లాసిక్‌ ఆట మా జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు'అని స్టీవ్‌ స్మిత్‌పై ఫంటర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

తుది జట్టులో చోటు కష్టమే..

తుది జట్టులో చోటు కష్టమే..

ప్రస్తుత టీమ్ కాంబినేషన్స్ కారణంగా స్మిత్‌కు ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పలేనని రికీ పాంటింగ్ అంగీకరించాడు. ఒక వేళ అవకాశం వస్తే మాత్రం అతను టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌ స్మిత్‌ను వదులుకున్న తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ పోటీపడగా, డీసీ అతడిని సొంతం చేసుకుంది. ఇక ఏప్రిల్‌ 10న తమ తొలి మ్యాచ్‌లో డీసీ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా దూరం కావడంతో, టీమిండియా యువ కెరటం రిషభ్‌ పంత్‌ సారథ్యంలో ముందుకు సాగనుంది.

Story first published: Wednesday, April 7, 2021, 13:14 [IST]
Other articles published on Apr 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X