న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెప్టెంబర్‌లో ఐపీఎల్ 2021.. చర్చకు ఆ మూడు వేదికలు!

IPL 2021 resumption possible in September if COVID situation improves
IPL 2021 In September - England, UAE, Australia లో ఏదో ఒక చోట..!! || Oneindia Telugu

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. పకడ్బందీ బయో బబుల్‌లోకి ప్రవేశించిన వైరస్ ఆటగాళ్లకు సోకడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) లీగ్ అర్థాంతరంగా నిలిపివేసింది. అయితే వాయిదా పడిన ఐపీఎల్‌-2021ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే చర్చ మొదలైంది. ఈ విషయాన్ని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ముందు ప్రస్తావించగా.. ప్రయతిస్తామని, కానీ ఇప్పుడు ఏం చెప్పినా చాలా ముందవుతుందన్నాడు. అయితే సీజన్‌ సెకండ్ ఫేస్ పూర్తి చేసేందుకు సరైన సమయం, వేదిక గురించి బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇతర దేశాల క్రికెట్‌ షెడ్యూళ్లను అనుసరించి సెప్టెంబర్లో రెండో దశను నిర్వహిస్తే బాగుంటుందని బోర్డు పెద్దలు భావిస్తున్నారని సమాచారం. యూఏఈ, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలో ఏదో ఒక చోటికి వేదికను మార్చాలని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

యూఏఈలో నిర్వహిస్తే..?

యూఏఈలో నిర్వహిస్తే..?

గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించారు. మళ్లీ అక్కడికే వేదికను మారిస్తే మెరుగని మరో ఆలోచన. అక్కడి పిచ్‌లు, వాతావరణం, బయో బుడగ, కరోనా పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఇంగ్లండ్‌ సిరీస్‌ ముగియగానే నేరుగా ఇంగ్లండ్, భారత ఆటగాళ్లను దుబాయ్‌కు తీసుకెళ్లాలన్నది యోచన. యూఏఈకి వచ్చేందుకు ఇతర దేశాల ఆటగాళ్లకూ అభ్యంతరం ఉండదని అనుకుంటున్నారు. అంతేకాకుండా లీగ్‌ ముగియగానే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను కూడా నిర్వహించే అవకాశం ఉంది. మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు కూడా భారత్ దగ్గరే ఉన్నాయి. కానీ, సెప్టెంబర్‌లో యూఏఈలో ఎండలు విపరీతంగా ఉంటాయి. కాకపోతే గత సీజన్ కూడా సెప్టెంబర్‌లోనే జరగడం సానుకూలాంశం.

 ఇంగ్లండ్‌ కూడా మంచి ఆప్షన్..

ఇంగ్లండ్‌ కూడా మంచి ఆప్షన్..

జులైలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్‌ ఇందులో తలపడనున్నాయి. టెస్టుకు కొన్ని రోజుల ముందుగానే కోహ్లీసేన అక్కడికి చేరుకోనుంది. ఫైనల్‌ ముుగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో తలపడనుంది. సిరీస్‌ ముగిసే సరికి సెప్టెంబర్‌ అవుతుంది. అందుకని అదే నెలలో ఐపీఎల్‌ మిగిలిన మ్యాచులు అక్కడే నిర్వహించాలన్నది ఐపీఎల్ పెద్దల మరో ఆలోచన.

ఆసీస్‌ కూడా బెటరే..

ఆసీస్‌ కూడా బెటరే..

ఆస్ట్రేలియాలో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని మరో ఆలోచన. ప్రస్తుతం ఆ దేశంలో రాకపోకలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. బహుశా నాలుగు నెలల్లో ప్రభుత్వం వీటిని తొలగిస్తుందని అంచనా. వాస్తవంగా 2020లో టీ20 ప్రపంచకప్‌ను ఆసీస్‌లోనే నిర్వహించాల్సింది. అది వాయిదా పడటంతో 2021 కప్‌ను భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. 2022 హక్కులు ఆసీస్‌కు ఇచ్చారు. చర్చలు జరిపితే ఈ ఏడాది మెగా టోర్నీని అక్కడ నిర్వహించే వచ్చే ఏడాది భారత్‌లో ఆతిథ్యమిచ్చేందుకు మార్గం సుగమం కావచ్చు. క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఇందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇదే జరిగితే పెర్త్‌ వేదికగా సెప్టెంబర్లో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటందనే చర్చ కూడా జరుగుతుంది. పెర్త్‌ సమయం భారత కాలమానం కన్నా 3.30 గంటలు ముందుంటుంది. వీక్షణకు అనువుగా ఉంటుంది.

Story first published: Thursday, May 6, 2021, 12:44 [IST]
Other articles published on May 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X