న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: దంచికొట్టిన మాక్స్‌వెల్‌.. 27 బంతుల్లోనే డివిలియర్స్ ఫిఫ్టీ! కోల్‌కతాకు భారీ లక్ష్యం!

IPL 2021, RCB vs KKR: AB de Villiers, Glenn Maxwell fireworks give Bangalore score 204
IPL 2021,RCB vs KKR: AB de Villiers, Glenn Maxwell ఆడుతుంటే ఎంత ముద్దుగా ఉందో...! || Oneindia Telugu

చెన్నై: చెన్నై చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (78; 49 బంతుల్లో 9x4, 3x6) మెరుపులు మెరిపించగా.. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (76; 34 బంతుల్లో 9x4, 3x6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 రన్స్ చేసి.. కోల్‌కతా ముందు 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (5) విఫలం అయినా.. దేవదత్ పడిక్కల్ (25) పర్వాలేదనిపించాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నబెంగళూరుకు కోల్‌కతా మిస్టరి స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి రెండో ఓవర్‌లోనే షాకిచ్చాడు. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ (5)తో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రజత్‌ పాటిదార్ ‌(1)ను ఔట్ చేశాడు. నాలుగు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరినీ చక్రవర్తి పెవిలియన్‌ పంపాడు. దాంతో బెంగళూరు 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో దేవ‌దత్‌ పడిక్కల్ ‌(25; 28 బంతుల్లో 2x4) అండతో గ్లెన్‌ మాక్స్‌వెల్ బెంగళూరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మూడో వికెట్‌ 86 పరుగులు జోడించాడు.

క్రీజులోకి రావడంతోనే హార్డ్ హిట్టర్ మాక్స్‌వెల్ బౌండరీల మోత మొదలెట్టాడు. దీంతో స్కోర్ వేగం పుంజుకుంది. ఈ క్రమంలోనే మాక్సీ ధనాధన్‌ బ్యాటింగ్‌తో 28 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 12వ ఓవర్‌ తొలి బంతికి పడిక్కల్‌.. త్రిపాఠి చేతికి చిక్కి ఔటయ్యాడు. ఆపై డివిలియర్స్‌, మాక్సీ దూకుడుగా ఆడి బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. అయితే పేసర్ పాట్ కమిన్స్‌ వేసిన 17వ ఓవర్‌ చివరి బంతికి పుల్‌షాట్‌ ఆడబోయిన మాక్స్‌వెల్..‌ హర్భజన్‌ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు.

మాక్స్‌వెల్ ఔట్ అయ్యే సమయానికి ఆర్సీబీ స్కోర్‌ 148/4గా నమోదైంది. అయితే చివరి మూడు ఓవర్లలో కైల్‌ జేమీసన్ (11)‌తో కలిసి డివిలియర్స్‌ రెచ్చిపోయాడు. రసెల్ వేసిన 18వ ఓవర్లో ఏబీడీ 6, 4, 2, 4 బాదడంతో 17 పరుగులొచ్చాయి. హర్భజన్‌ సింగ్‌ వేసిన 19వ ఓవర్‌లో 18 రన్స్‌ రాబట్టిన ఏబీడీ.. 27 బంతుల్లో హాఫ్ ‌సెంచరీ చేసుకున్నాడు. ఇక రసెల్ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో 4, 6, 2, 4, 4తో ఏబీడీ 21 పరుగులు సాధించడంతో బెంగళూరు స్కోరు 200 దాటింది.

DC vs PBKS: వైరల్ ఫొటోస్.. కేఎల్ రాహుల్‌కు స్పెషల్ విషెస్ చెప్పిన అతియా శెట్టి!!DC vs PBKS: వైరల్ ఫొటోస్.. కేఎల్ రాహుల్‌కు స్పెషల్ విషెస్ చెప్పిన అతియా శెట్టి!!

Story first published: Sunday, April 18, 2021, 17:40 [IST]
Other articles published on Apr 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X