న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RR: ఎలా ఆడాలో తెలుసు.. నాపై ఆంక్షలు విధించొద్దు! ఐపీఎల్‌ అంటేనే రిస్కీ గేమ్: శాంసన్

IPL 2021: Rajasthan Royals captain Sanju Samson says I dont want to restrict my shots

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ అంటేనే రిస్కీ గేమ్ అని, ఈ ఫార్మాట్‌ ఏర్పడిందే భారీ షాట్లు కోసమని రాజస్థాన్‌ రాయల్స్ సారథి సంజు శాంసన్ అన్నాడు. షాట్ల ఎంపిక ఏమిటో తనకు తెలుసని, ఇక్కడ తనకేమీ ఆంక్షలు విధించొద్దని కోరాడు. 10-15 పరుగులు ఎక్కువగా ఇచ్చామని, అది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని శాంసన్ పేర్కొన్నాడు. వాంఖడే మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 45 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. సీఎస్‌కే తొలుత బ్యాటింగ్‌ చేసి 188 పరుగులు చేయగా.. రాజస్థాన్‌ 143 పరుగులకే పరిమితమైంది.

మ్యాచ్ అనంతరం రాజస్థాన్‌ రాయల్స్ సారథి సంజు శాంసన్ మీడియాతో మాట్లాడుతూ... 'ఛేదించడానికి ఇది మంచి స్కోరని నేను అనుకున్నాను. కానీ మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోయాం. మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. అంతేకాదు బ్యాటింగ్ కూడా బాగా ఆడారు. అయితే 10-15 పరుగులు అదనంగా ఇచ్చాం. ఇదే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందనుకుంటున్నా. మంచు ప్రభావం లేకున్నా బంతి బాగా టర్న్ అయింది. ఇది మేము అస్సలు ఊహించలేదు. ఈ ఫార్మాట్లో ఎప్పుడూ భారీ స్కోర్ అవసరం. నేను ఎప్పుడూ బేసిక్స్‌పై పని చేస్తూనే ఉంటాను. చేతన్ సకారియా బాగా రాణిస్తున్నాడు. మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ చాలా పాజిటివ్‌లు ఉన్నాయి' అని తెలిపాడు.

5 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసిన సంజు శాంసన్ కీలక సమయంలో పెవిలియన్‌ చేరాడు. సామ్‌ కరన్‌ వేసిన ఆరో ఓవర్‌ ఐదో బంతికి డ్వేన్ బ్రేవోకు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనవసరపు షాట్‌కు పోయి వికెట్‌ సమర్పించుకున్నాడని శాంసన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. దీనిపై శాంసన్‌ మాట్లాడుతూ... 'నా షాట్ల ఎంపిక ఏంటో నాకు తెలుసు. ఇక్కడ నాకేమీ ఆంక్షలు విధించొద్దు. నా సహజ శైలిలో ఆడతా. కొన్ని సందర్భాల్లో విఫలం కూడా కావొచ్చు. ఐపీఎల్‌ అంటేనే రిస్కీ షాట్ల ఫార్మాట్‌. ఈ ఫార్మాట్‌ ఏర్పడిందే భారీ షాట్లు కోసం. అందులో రిస్క్‌ షాట్లే ఎక్కువ ఉంటాయి' అని అన్నాడు.

'నేను సెంచరీ చేసి సక్సెస్‌ అయిన మ్యాచ్‌లో కూడా రిస్క్‌ షాట్లే ఆడా. అది ఆ రోజును, మన మైండ్‌ సెట్‌ను బట్టి ఉంటుంది. నా షాట్ల ఎంపికలో నేను ఎటువంటి ఆంక్షలు పెట్టుకోను. నేను ఎలా ఆడాలనుకుంటోనో అలానే ఆడతా. అలా ఆడటమే నాకిష్టం. అలా ఆడేటప్పుడు విఫలం కూడా అవుతా. దాన్ని అంగీకరించాల్సిందే. నా ఔట్‌పై నాకు ఎటువంటి బెంగలేదు. వచ్చే మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ విజయాల్లో నా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా' అని రాయల్స్ సారథి చెప్పుకొచ్చాడు.

CSK vs RR: జడేజా సూపర్ ఫీల్డింగ్ గురించి.. ధోనీ 8 ఏళ్ల క్రితమే చెప్పాడు! ఇంతకీ ట్వీట్‌లో ఏముందంటే?CSK vs RR: జడేజా సూపర్ ఫీల్డింగ్ గురించి.. ధోనీ 8 ఏళ్ల క్రితమే చెప్పాడు! ఇంతకీ ట్వీట్‌లో ఏముందంటే?

Story first published: Tuesday, April 20, 2021, 16:25 [IST]
Other articles published on Apr 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X